Tuesday, June 4, 2013

చట్టానికి కళ్లు లేవు

 మన దేశంలో చట్టానికి కళ్లు లేవు. కాని కాళ్లున్నాయి. కళ్ల ముందు జరిగిన సంఘటన ఆయినా ఎవరూ నోరెత్తరు. రాజధాని నగరం నడిబొడ్డులో ఒకాయన యిద్దర్ని రోడ్డు మధ్య నిలబెట్టి కారు ఆపి, తన మనుషుల్ని పిలిపించి చావగొట్టించడాన్ని- ఎంత లేదన్నా వందమంది చూసి వుండాలి. కాని మన పోలీసులకి ఫిర్యాదు కావాలి. దాని గురించి రిపోర్టు కావాలి. ఆ తర్వాత చర్య. ఈ ఆకృత్యాన్నిజరిపింది ఓ సినీ కధానాయకుడు.
పూర్తిగా చదవండి

2 comments:

  1. చక్కని ఉదాహరణలతో సూటిగా మీరు రాసింది బాగుంది. అతి మొహమాటాల, పాడు మర్యాదల హిపోక్రసీనీమా రంగంలో ఉంటూ కూడా హీరో కొడుకు గురించి ఇలా నిష్కర్షగా రాయటం మరీ బాగుంది.

    అభినందనలతో పాటు ఈ సందర్భంగా మీరు పదేపదే వాడే ఓ పోలికకు నా నిరసన కూడా!

    ‘అధికారం చట్టానికి గాజులు తొడుగుతుంది’- అసమర్థత అని చెప్పటానికి గాజులు తొడగటాన్ని ప్రతీకగా వాడటం మీ రచనల్లో తరచూ కనిపిస్తుంటుంది. గాజులను ధరించే అసంఖ్యాకమైన స్త్రీలను ఈ పోలిక అవమానించేలా ఉంటుందని మీకు అనిపించదా?

    ReplyDelete
  2. అమెరికాలోనే కాదు సర్, ఆఫ్రికాలోని రువాండాలో కూడా పోలీస్ పవర్ ఇంతే. మా దేశంలో ఒక చెట్టుని గుద్దితే రుపాయల్లో లక్ష జరిమానా, ఒక విద్యుత్ స్థంభాన్ని గుద్దితే రెండు లక్షలు జరిమానా. ముందు ఆ వాహనాన్ని స్వాధీనపరచుకుని ఒక వారం గడువిస్తారు, ఆ లోగా ఆ వ్యక్తి సొమ్ము కట్టి విడిపించుకుంటాడా సరే. లెకపోతే ప్రభుత్వం వేలం లో ఆ వాహనాన్ని అమ్మి జరిమానా సొమ్ము మినహాయించుకుని మిగతాది ఆ వ్యక్తికి తిరిగి ఇచ్చెస్తారు.

    ReplyDelete