బహుశా ఎవరూ ఈ విషయాన్ని ఆలోచించి ఉండరు. మనల్ని ప్రతిరోజూ, ప్రతీ క్షణం ఎవరో ఒకరు దోచుకుంటున్నారు. నమ్మించి మోసం చేస్తున్నారు. మనల్నికాపాడవలసిన వాళ్ళే మనల్ని కబళిస్తున్నారు. పోలీసు స్టేషన్లో పోలీసులు మానభంగాలు చేస్తున్నారు. నిన్ననే చెన్నైలో పోలీసులు ఇన్ కమ్ టాక్స్ అధికారులుగా నటించి ఓ నగల వ్యాపారిని కొల్లగొట్టారు. రాజకీయ నాయకులు మోసాలు చేసి సమర్థించుకొంటున్నారు, అధికారులు లంచాలు తీసుకుని సమాజాన్ని గుల్ల చేస్తున్నారు. కాని మనిషి మనుగడ సజావుగా , ఏ పొరపొచ్చాలూ లేకుండా , నమ్మకంగా, తనగురించి ఆలోచించకపోయినా ఎటువంటి మోసమూ, కల్తీ లేకుండా మనకి సేవ చేసే శక్తి ఒకటి ఉంది. దాని పేరు ప్రకృతి.
పూర్తిగా చదవండి..
WELL SAID.
ReplyDeleteబాదాకరమైన సంఘటనలు చూస్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు, వింటున్నప్పుడు మనం ఏమి చెయ్యలేని స్థితిలో వున్నప్పుడు "దేవుడున్నాడు" అనుకోవాలి. అది నిజం కూడా.
బాధాకర విషయాన్ని బాగా చెప్పారండి.
ReplyDeleteమారుతీ రావుగారు
ReplyDeleteనమస్కారం. ఈ "రేపు" దోపిడీ "నిన్న" టినుంచే మొదలయ్యింది కదండీ. ముఖమర్దనం, తైలమర్దనంతో పాటు, బొమికల మర్దనం చేయిస్తే ఈ "రేపే" ఈ"రోజు" అవుతుంది. కానీ ఆ మర్దన చేసేవాడెవ్వదీ వసుధలోన?
విశ్వస్తలు వడ్డింపగా మెక్కిన సోములే కనపడుతున్నారు తప్పితే, గదుచ్చుకుని నిజమయిన దెబ్బేసే భీముడేడీ ? భీముడు కాకపోతే దుర్యోధనుడయినా సమ్మతమే!
కానీ ఇద్దరూ "జరాసంధులు" అయిన రాజకీయ నాయకుల వద్ద శిష్యరికం చేయటానికి పోయారని వార్త వచ్చింది. కాబట్టి మనం ఆ రేపు కోసం ఈ రోజు ఎదురుచూస్తూ కూర్చోటమే
అద్భుతంగా ఉంది గొల్లపూడి గారు. ప్రతీ వారం కౌముది లో మీ వ్యాసం చదువుతూ ఉంటాను. మీరు ప్రతీ విషయాన్ని ఘాటుగా, నిష్కర్షగా చెప్పడం నాకు బాగా నచ్చుతుంది. అది మీ ఆవేదనని ప్రతిబింబుస్తూ ఉంటుంది. కానీ ఒక్కోసారి అది నిరాశావాదంగా అనిపిస్తుంది. మీరు నిరాశావాదులా? లేక కేవలం చెప్పే దాంట్లో Intensity పెంచడానికి అలా రాస్తారా
ReplyDeleteవాసుగారూ
ReplyDeleteచాలా మంచి ప్రశ్న అడిగారు. ఆ మధ్య ఎవరో నేను కొన్ని విమర్శలు చేస్తూంటే- వీరు ఏ సిద్ధాంతాలను నమ్ముతారో అర్ధంకావడం లేదు అని నా మిత్రునితో అన్నారట. రెండిటికీ ఒకే సమాధానం. రచన, ముఖ్యంగా సమకాలీన సమస్యల మీద విశ్లేషణ- పరిష్కారాన్ని చూపలేదు. అది రచన పని కాదు. నాయకుల పని. సంస్కర్తల పని. ప్రభుత్వం పని. నా ఆవేదన పాఠకుని మనస్సు వరకూ తీసుకుపోగలిగితే నా ప్రయత్నం సఫలమయినట్టే. పొతే- నా కాలమ్ లో కనిపించే నిరాశ- నాది కాదు. ఆ సమస్యలకో, పరిస్థితికో పరిష్కారాన్ని చూపించలేని వ్యవస్థది. నేను నిరాశావాదిని కాదు. ఆ నిరాశ కనుచూపుమేరలో పరిష్కారం కనిపించని పరిస్థితిది. ఇక- విమర్శకుడు నిర్ధిష్టంగా కొన్ని సిద్దాంతాలకు ముడిపడనక్కరలేదు. నిజానికి అలా వుండడం అతని దృక్పధాన్ని సంకుచితం చేస్తుంది. మంచి జరగడం నా లక్ష్యం. అన్యాయం జరగకపోవడం నా కోరిక. మన చుట్టూ బిగుసుకునే అవినీతి తొలగాలన్నది నా కల. ఇది ఏదయినా "సిద్దాంత’మయితే అది నాది. వరసగా నా కాలమ్స్ చదివే మీకు- ప్రతీసారీ నేను చేసే విమర్శలు చూస్తూండగా అలా అనిపించడం న్యాయం. అవినీతి ఆసుపత్రిలో లోషన్ వాసన లాంటిది. మీరు వాసనని మాత్రమే చూస్తున్నారు. చికిత్సని మరిచిపోతున్నారు. చివరగా- "నిరాశ” గమ్యం పట్ల మన విశ్వాస లేమిని చెప్తుంది. కాని నాకు నిరాశ లేదు. ఎప్పటికన్నా మంచి జరుగుతుందన్న ఆశ వుంది.
మారుతీరావుగారు, మీ సమాధానంలో నాకు post-modernism కనపడింది (అదీ ఒక సిద్ధాంతమేసుమా!)
ReplyDeleteఈ ఆధునిక అతివేగపు లోకంలో "మార్పులు"కూడా అంతే వేగంగా జరుగుతున్నాయి. అందుకే ఘటనల్ని ఒక సిద్ధాంతానికి కాని, ఒక నియమానికి కాని, ఒక వాదానికి గాని, ఒక సంప్రదాయానికి కాని కట్టుబడి చూడకుండా, స్వతంత్రంగా ఆలోచించి, సందర్భశుద్ధి తో తమ తమ భావాలని నిర్భయంగా వ్యక్త పరచటమే కావాలి. అది మీ రచనల్లో కనిపిస్తుంది.
కానీ,అప్పుడప్పుడూ ఘటనలతో నిమిత్తం లేకుండా మీరు "నమ్మకాల"ఆధారంగా వాదిస్తారు (స్లమ్ డాగ్ మిలియనేర్ ఉదంతం) అప్పుడే కొంత disconnect కనిపిస్తుంది. బహుశా అది కూడా అవసరమేమో! ఏదో ఒకదాన్ని కనీసం ఆ క్షణంలో అయినా నమ్మకపోతే జీవితం అర్థరహితమైపోదూ!!