Sunday, May 30, 2010

నేనెరిగిన వేటూరి

1988 లో రాజాలక్ష్మీ ఫౌండేషన్ పురస్కారం సి.నారాయణరెడ్డిగారికిచ్చారు. ఆ నాటి సభలో నేను ప్రధాన వక్తని. ఎందరో పముఖులు హాజరయిన సభ. మిత్రులు సినారె గురించి మాట్లాడుతూ ఒక పాట రచనని సమగ్రంగా విశ్లేషించాను. ఆ పాట: "చేరేదెటకో తెలిసి, చేరువకాలేమని తెలిసి, చెరిసగమౌతున్నామెందుకో తెలిసి, తెలిసి" 'ప్రేమబంధం' పతాక సన్నివేశంలో ఆఖరి పాట. ప్రేక్షకులు చప్పట్లు కొట్టారు.
పూర్తిగా చదవండి

Thursday, May 27, 2010

నా సంపాదకత్వంలో 'సురభి ' మాసపత్రిక


నా సంపాదకత్వంలో టైంస్ ఆఫ్ ఇండియా సంస్థ వెలువరిస్తున్న మాసపత్రిక 'సురభి ' గురించిన ప్రకటన చూడండి.

Sunday, May 23, 2010

కొత్త లెక్కలు

సరిగ్గా ఎనభై సంవత్సరాల తర్వాత వచ్చే యేడు ఈ దేశంలో కులాలను ఉటంకించే జనాభా లెక్కలు జరగనున్నాయి. ఈ సారి ఆరువేల కులాలతో పాటు అరవై అయిదు వేల ఉపకులాలు సాధికారికంగా పరిగణనలోకి వస్తాయి.ఈ దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన అరవై మూడు సంవత్సరాలలో కొన్ని చిన్న కులాల ఉనికి దాదాపు సన్నగిల్లిపోయింది.అవి పెద్దకులాలతోనో లేదా పూర్తిగానో మరిచిపోయారు. వారు తమ కులాల్ని గుర్తుం చుకోవడం, గుర్తించడం మానేశారు. కానీ ఈ జనాభా లెక్కల్లో అవన్నీ పైకి తవ్వుతారు. మరిచిపోయినవారికి మరోసారి గుర్తుచేసి " నీ కులం ఇది అని మరిచిపోకు బాబూ. అందువల్ల నీకే లాభం ఉంటుంది " అంటే అతనికేం పోయింది? ఇందులో విశేషమేమిటంటే 'నాది ఫలాన కులం ' అని ఓటరు చెప్పుకోవడం వినా, అవునో కాదో తేల్చుకోగలిగిన, తేల్చవలసిన, తేల్చుకోవలసిన పని ఈ జనాభా లెక్కలవారిది కాదు. రేపు 'కులా ' ల ప్రాతిపదికగా అతను రిజర్వేషన్ తన హక్కంటూ నిలదీసిన నాడు అది తేల్చుకు చావాల్సిన పని ఆ శాఖది. కాదంటే కావలసినని కోర్టులున్నాయి.రేపు 71,00 0 వేల కులాల కొత్త సమస్యల కొత్త కేసులు కోర్టులకి పుష్కలంగా అందుతాయి.

Monday, May 17, 2010

బాబాయి

"ఇచ్చుటలో ఉన్న హాయి..వేరెచ్చటనూ లేనేలేదని.."నమ్మేవాళ్ళకి నచ్చే కథ. 40 ఏళ్ళ క్రిందట నేను వ్రాసిన ఈ కథ ఈ నెల 'కౌముది ' లో అనగనగా మంచి కథ గా వచ్చింది.
పూర్తిగా చదవండి

Sunday, May 16, 2010

అవినీతి - ఆరోగ్యం

నాకేమో అవినీతికీ ఆరోగ్యానికీ దగ్గర తోవ ఉన్నదని అనిపిస్తుంది. దీనిని రుజువులతో సహా నిరూపించగలను. మనదేశంలో అవినీతిపరులంతా నిమ్మకు నీరెత్తినట్టు నిగనిగలాడుతూ, చలవచేసిన ఖద్దరు చొక్కాలతో, సూట్లతో, చిరునవ్వులతో హుషారుగా కులాసాగా ఉంటారు. కాని ఒక్కసారి వారిని నీతి, చట్టం వేలు చూపిస్తే చాలు - ఎక్కడలేని అనారోగ్యం వారిని క్రుంగదీస్తుంది. మీలాటి నాలాంటివారు అంతంత మాత్రం ఖాయిలా పడితే ఇంటి దగ్గర ఉండే చికిత్స చేయించుకుంటాం. కాని వీరి అనారోగ్యం అలాక్కాదు. నిన్నటిదాకా బాగానే ఉన్నా ఇవాళ మాత్రం - ఎవరూ పలకరించ వీలులేని, ఎవరితో మాట్లాడడానికీ వీలులేని, ఎవరూ కలుసుకోవడానికీ వీలులేని - ఆసుపత్రి ఇంటెన్సివ్ గదుల్లో ఉండక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది.
పూర్తిగా చదవండి

Monday, May 10, 2010

గాంధీలు పుట్టిన దేశం

దాదాపు పాతికేళ్ళ కిందట నేను "అభిలాష" అనే సినిమాలో నటించాను. ఉరిశిక్ష రద్దుచేయాలన్న ఆదర్శాన్ని చాటే చిత్రమది.చివర లో చిరంజీవి వాదనని నేనే రాశాను. నిరపరాధికి శిక్షపడితే శిక్షించకుండాకాపాడే స్థితికి 'అభిలాష' తత్వాన్నివంటబట్టించుకున్న తరంలో మనం జీవిస్తున్నందుకు గర్వంగా ఉంది.
పూర్తిగా చదవండి

Monday, May 3, 2010

గురూజీ జిందాబాద్..!

చిన్న రాష్ట్రాల వల్ల మేలు జరగదని ఈ మధ్య చాలామంది జుత్తులు పీక్కొంటున్నారు గాని, వారితో మాత్రం నేను ఏకీభవించను. వెంటనే కారణాలు చెప్పమని నన్ను చాలామంది నిలదీస్తారు నాకు తెలుసు.నేను చెప్పను. చక్కగా, కన్నులపండుగగా, నిత్యనూతనంగా ఉన్న ఒకే ఒక రాష్ట్రాన్ని చూపిస్తాను. దాన్ని పరిపాలిస్తూ పదిమంది కీ గురూజీగా చలామణీ అవుతున్న శిబూ శొరేన్ ని చూపిస్తాను.