Sunday, May 23, 2010

కొత్త లెక్కలు

సరిగ్గా ఎనభై సంవత్సరాల తర్వాత వచ్చే యేడు ఈ దేశంలో కులాలను ఉటంకించే జనాభా లెక్కలు జరగనున్నాయి. ఈ సారి ఆరువేల కులాలతో పాటు అరవై అయిదు వేల ఉపకులాలు సాధికారికంగా పరిగణనలోకి వస్తాయి.ఈ దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన అరవై మూడు సంవత్సరాలలో కొన్ని చిన్న కులాల ఉనికి దాదాపు సన్నగిల్లిపోయింది.అవి పెద్దకులాలతోనో లేదా పూర్తిగానో మరిచిపోయారు. వారు తమ కులాల్ని గుర్తుం చుకోవడం, గుర్తించడం మానేశారు. కానీ ఈ జనాభా లెక్కల్లో అవన్నీ పైకి తవ్వుతారు. మరిచిపోయినవారికి మరోసారి గుర్తుచేసి " నీ కులం ఇది అని మరిచిపోకు బాబూ. అందువల్ల నీకే లాభం ఉంటుంది " అంటే అతనికేం పోయింది? ఇందులో విశేషమేమిటంటే 'నాది ఫలాన కులం ' అని ఓటరు చెప్పుకోవడం వినా, అవునో కాదో తేల్చుకోగలిగిన, తేల్చవలసిన, తేల్చుకోవలసిన పని ఈ జనాభా లెక్కలవారిది కాదు. రేపు 'కులా ' ల ప్రాతిపదికగా అతను రిజర్వేషన్ తన హక్కంటూ నిలదీసిన నాడు అది తేల్చుకు చావాల్సిన పని ఆ శాఖది. కాదంటే కావలసినని కోర్టులున్నాయి.రేపు 71,00 0 వేల కులాల కొత్త సమస్యల కొత్త కేసులు కోర్టులకి పుష్కలంగా అందుతాయి.

4 comments:

  1. తమ కులం జనాభా ఇంత అని, తమ కులానికి ఎన్నికలలో ఇన్ని సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేసేవాళ్ళు ఉన్నారు. రిజర్వేషన్ల కోసం కులం పేరు తప్పు చెప్పేవారు కొందరు ఉండొచ్చు కానీ కుల జనాభా లెక్కలు తీస్తే తమ కులం జనాభా ఇంత అని చెప్పేవాళ్ళ లెక్కలు మారిపోతాయి.

    ReplyDelete
  2. "విభజించి పాలించటం" అనే విదేశీ విధానాన్ని మన నాయకులు వివిధ రకాలుగా వాడుతూనే ఉంటారు. తాము ఏం నష్టపోతున్నామో తామే తెలుసుకొని ఇలాంటి విభజనలని తాము ఎలాంటి పరిస్థితులలోనూ అంగీకరించమని ప్రజలు వాళ్ళంతట వాళ్ళే తిరస్కరిస్తే తప్ప ఈ నాయకులు తమ వంచనా విధానాలని ఆపరు. కానీ మన ప్రజలకి అంతటి ఐక్యత ఇప్పట్లో వస్తుందంటే అనుమానమే. కనీసం జయప్రకాష్ నారాయణ్ లాంటి నాయకులు మళ్ళీ పుట్టుకు రావాలి. అయితే అలాంటి మహానుభావులు ఈ రోజుల్లో మన గలరా?.....

    ReplyDelete
  3. కుల వ్యవస్థ ని వ్రేళ్ళ తో పెకిలించడానికి ఇంకో శతాబ్దం పడుతుందేమో సార్. అప్పటి వరకూ ఈ లెక్కలు, తిప్పలు తప్పవేమో. ప్రభుత్వం పెట్టే ఖర్చులో కనీసం పావు వంతుకి ప్రామాణికం కులమే ఐతే, ఆ సమాచారం ప్రభుత్వం వద్ద ఉండాల్సిందే. మన మెదళ్ల లోంచి కులం బూజు ని తీయనంత వరకూ.. ఈ లెక్కల వాళ్ళ కొత్తగా వచ్చేదీ, పొయేదీ ఏమీ లేదు అని నా అభిప్రాయం.

    ReplyDelete
  4. ''విశేషమేమిటంటే 'నాది ఫలాన కులం ' అని ఓటరు చెప్పుకోవడం వినా, అవునో కాదో తేల్చుకోగలిగిన, తేల్చవలసిన, తేల్చుకోవలసిన పని ఈ జనాభా లెక్కలవారిది కాదు'' - Valid point sir. But there must be some mechanism.. Isnt it ?

    ReplyDelete