Sunday, August 15, 2010

మంచితనం కూడా అంటువ్యాధే

పధ్నాలుగు సంవత్సరాలుగా మా అబ్బాయి స్మారకార్ధం జాతీయ బహుమతి కార్యక్రమాలు జరుపుతున్నా - ఏనాడూ నేను కాలం రాయలేదు. రాయవలసిన అవసరం లేదని నేను భావించాను. కన్నీళ్ళలోంచి ఓదార్పుని వెదుక్కోవడం - నా దురదృష్టం నాకిచ్చిన విముక్తి. అది నా వ్యక్తిగతం. అయితే నిన్న నాకు ఒకాయన ఉత్తరం రాశాడు. ఆయన మొన్న జరిగిన 13 గొల్లపూడి శ్రీనివాస్ జాతీయ బహుమతి ఉత్సవానికి హాజరయాడు. ఆయనెవరో నాకు తెలీదు. ఆయన్ని నేనెప్పుడూ కలుసుకోలేదు. నిన్నకూడా కలుసుకోలేదు.

4 comments:

  1. మీకు 64 వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.

    - శిరాకదంబం

    ReplyDelete
  2. సేవతో కష్టాలని మరిచిపోవటం..... నిజంగా పరిణతే. మీకు + ఆత్మారాం లకు నమస్సులు.

    ReplyDelete
  3. ఓ రెండేళ్ళ క్రితం అనుకుంటా, అవార్డు ప్రధానోత్సవం లో రాజీవ్ మీనన్ తీసిన ఒక షార్ట్ ఫిలిం ప్రదర్శించారు, శ్రీనివాస్ గురించి. ఆ కెరటాలు నా కళ్ళ ముందు ఇంకా మెదులుతూనే వున్నాయి. అవార్డు కు ఒక popularity కోసమని సెలెబ్రిటీస్ కే ఇవ్వకుండా, నిజాయితీగా ఆ సంవత్సరం లో అర్హత ఉన్న వ్యక్తులకే ఇవ్వడం వలన, ఈ రోజు గొల్లపూడి శ్రీనివాస్ అవార్డు కి ఒక క్రెడిబిలిటీ ఏర్పడింది. ఆ విషయం లో జ్యూరీ (సింగీతం శ్రీనివాస రావు, మొదలగు వారు), మరియు గొల్లపూడి కుటుంబం ఖచ్చితంగా అభినందనీయులు.

    ReplyDelete
  4. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, అంటారు కదా , శ్రీనివాస్ కి ఆ భగవంతుడి దిష్టితగిలింది. అందుకేనేమో తొందరగా తీసికేల్లిపోయాడు. మీకే కాదు, ఎందుకో కడుపులోంచి బాధ తన్నుకువస్తోంది.

    ReplyDelete