Monday, August 9, 2010

తాళం చెవుల కథ

దేశంలో ప్రజాభిప్రాయం రెండుగా చీలిపోయిన అతి విచిత్రమైన సంకట పరిస్థితి గతవారమే తలెత్తింది. స్థూలంగా చెప్పుకుందాం. భారతదేశంలో మొట్టమొదటిసారిగా మరో నలభై రోజుల్లో కామన్వెల్తు క్రీడలు జరగనున్నాయి. ఇందుకుగాను రకరకాలయిన కార్యక్రమాలకి 65 వేల కోట్లు ఖర్చవుతున్నాయి. ఇందులో సూటిగా క్రీడల కయ్యే ఖర్చు కొంత, క్రీడలు కారణంగా రోడ్లు, నగరం, వసతుల ఏర్పాట్ల ఖర్చులు కొన్ని. క్రీడలు కారణంగా ఇవన్నీ మెరుగవుతాయి. కనుక కొంత ఖర్చు - 'వీరయ్య పెళ్ళిలో పేరయ్యకి జందెం పోచ' సామెతగా కలిసి వస్తుంది.
పూర్తిగా చదవండి


2 comments:

  1. మారుతీరావు గారు..వ్యంగ్యంగా, హృద్యంగా చాలా బాగా చెప్పారండి

    రాజన్

    ReplyDelete
  2. ఇప్పుడు జరుగుతున్నది అదేగా .క్రీడలు అయ్యేదాకా ఏం ఖర్మ అయ్యాక కూడా వారే కోన సాగుతారు .
    క్రీడల మద్యలో వర్షాలు వచినప్పుడు పై కప్పు నుంచి నీళ్ళు పడుతుంటే , ఆనందం తో దేవతలు పూల వాన కురిపిస్తున్నారని భావించు కో మంటారు .చెమట తుడుచుకునట్టే వర్షపు చుక్కలు తుడుచు కోడానికి అప్పటి కప్పుడు వెయ్యి రూపాయలకి వొక పేపర్ నాప్కిన్ కొంటారు . కొన్నాళ్ళకి మీడియా వాళ్ళకి యిది పాసి పోయిన అన్నం అవుతుంది మరింత రంజైన ఐశ్వర్య రాయి కి పుట్టిన కొడుకు ఎవరి పోలిక అంటూ కొత్త విషయాన్నీ అందుకుని అది ఎంకాష్ చేసుకునే పనిలో అంటా యి విషయం మర్చి పోతారు . మళ్లీ కధ కంచికి మనం బ్లాగుకి .

    ReplyDelete