Sunday, August 22, 2010

గురి తప్పిన నిరసన

నిన్నకాక మొన్న - స్వాతంత్రదినోత్సవం నాడు కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మీద ఒక మాజీ పోలీసు ఉద్యోగి
బూటువిసిరాడు. అంది కొన్ని అడుగుల దూరంలో తప్పిపోయింది. ఇతను ఉద్యోగంలోంచి ఏవో కారణాలకి బర్త్ రఫ్ అయాడు.
పాకిస్తాన్ వరదల్లో అల్లాడుతూంటే బ్రిటన్ లో పర్యటిస్తున్నందుకు నిరసనగా లండన్ లో ఒక పాకిస్థానీ తమ అధ్యక్షుడు
అసిఫ్ ఆలీ జర్దారీగారిమీద బూటు విసిరాడు. అదీ గురితప్పింది

4 comments:

  1. పోలీసు ఉద్యోగి మాజీ కదండి,బర్తరఫ్ అయి ఉన్నాడు కదా,అందువల్లే అభ్యాసం లేక గురితప్పిందేమో??

    ReplyDelete
  2. మీ తపా లో టు ని తు గా మారిస్తే తపా రూపం మొత్తం మారి పోతుందండోయ్

    అంతే గా క ఇది విసిరే వాళ్ళ అసమర్థత కాదని నా ఉద్దెశ్యం. యథా రాజా తథా ప్రజా. ప్రజల నైపుణ్యం రాజు గారికంటే ఎక్కువ కాబోదు.

    చీర్స్
    జిలెబి.

    ReplyDelete
  3. మీరు రాసిన రెండు రోజులకే మరొక సంఘటన
    *హూడాపై బూటు దాడి హర్యానా సీఎం సభలో నిరుద్యోగి నిరసన *
    చండీగఢ్: జమ్మూకాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లాపై బూటు దాడిని మరిచిపోకముందే హర్యానా సీఎం భూపీందర్ సింగ్ హూడాకూ అదే చేదు అనుభవం ఎదురైంది. ఓ సభలో ప్రసంగిస్తున్న హుడాపై శక్తి సింగ్ అనే నిరుద్యోగి బూటు విసిరాడు. అది సభా వేదికకు 70 అడుగుల దూరంలో పడింది. ఆదివారం మహేంద్రగఢ్‌లో జరిగిన సభలో హూడా ప్రసంగిస్తుండగా.. మీడియా గ్యాలరీ వెనక ఉన్న శక్తి సింగ్, తన కాలి బూటు తీసి, వేదిక వైపు విసిరేశాడు. సభికులు శక్తిసింగ్‌ను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. తనకు ఉపాధి చూపించడంలో సర్కారు విఫలమైనందునే ఈ దాడికి పాల్పడినట్టు శక్తిసింగ్ పోలీసులకు తెలిపాడు. కాగా, ఈ సంఘటనను.. తన ప్రత్యర్థుల కుట్రగా హూడా ఆరోపించారు. నాటి అమెరికా అధ్యక్షుడు బుష్‌పై ఇరాక్‌లో జరిగిన తొలి బూటు దాడి నుంచి ఇప్పటి దాకా నేతలు ఈ నిరసనాస్త్రాన్ని చవి చూస్తూనే ఉన్నారు.
    సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో సీబీఐ వైఖరికి నిరసనగా ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి చిదంబరంపై ఓ సిక్కు జర్నలిస్టు బూటు విసిరేయగా.. మధ్యప్రదేశ్‌లో పార్టీ కార్యకర్తల సమావేశంలో కాంగ్రెస్ ఎంపీ నవీన్ జిందాల్‌పై ఓ రిటైర్డు ప్రిన్సిపాల్ బూటుతో దాడి చేశాడు. సొంత పార్టీ కార్యకర్తే బీజేపీ అగ్రనేత అద్వానీపై.. మధ్యప్రదేశ్‌లో చెక్క చెప్పులతో దాడికి దిగాడు. ఇటీవల బ్రిటన్‌లో పాక్ అధ్యక్షుడు జర్దారీ, జమ్మూకాశ్మీర్ సీఎం ఒమర్‌పై అదే తరహా దాడులు జరిగాయి.

    http://www.andhrajyothy.com/mainnewsshow.asp?qry=2010/aug/23/main/23main30&more=2010/aug/23/main/main&date=8/23/2010

    ReplyDelete
  4. మారుతీ రావు గారు, నవ్వాలో, ఏడవాలో తెలియని పరిస్థితంటే ఇదే కాబోలు..

    ReplyDelete