Sunday, October 31, 2010

తెలుగోడు

నా ఆరోగ్యానికి ముఖ్య రహస్యమొకటుంది. నేనేనాడూ తెలుగు ఛానళ్ళు చూడను. మధ్య కొన్నాళ్ళుగా విశాఖపట్నంలో ఉండడం జరిగింది. వద్దనుకున్నా - ఛానళ్ళు కళ్ళల్లో పడుతున్నాయి. అప్పుడప్పుడు - అక్కడక్కడా ఆగినప్పుడు బోధపడిన (కాదు - బోధపడని) విషయాలు కొన్ని ఉన్నాయి.
పూర్తిగా చదవండి

15 comments:

  1. ఈ స్థాళీపులాక న్యాయం అంటే ఏమిటో కొంచెం వివరిస్తారూ..

    ReplyDelete
  2. గురువు గారూ,
    ఒక్క మన తెలుగు ఛానళ్ళే కాదు, అన్ని భారతీయ ఛానెళ్ళ కూ ఇదే దౌర్భాగ్యం.
    ఏదయినా దురదృష్టకర సంఘటన జరిగితే చనిపోయిన వాళ్ళ ముఖాలూ, ఏడుస్తున్న వాళ్ళ బంధువల ముఖాలూ జూం చేస్తూ వాళ్ళని ప్రశ్నలడుగుతూ శవాన్ని మొదటి గా చూపించిన ఛానల్ మాదే అంటూ రోజంతా (కొన్నిసార్లు, రోజుల తరబడి) ఊదరగొట్టేస్తున్నారు.
    వార్తలని, వాస్తవాలని, చరిత్రనీ, పురాణాలనీ ఎక్సుక్లూజివ్ పేరు తో వక్రీకరిస్తున్నారు.
    ఇంకొక విషయం కూడా ఉంది. ఆధ్యాత్మిక ఛానెళ్ళెక్కువయ్యి, కనీ వినీ యెరుగని స్వామీజీలు ప్రసంగాలు, ప్రవచనాలూ, వింత వింత విన్యాసాలతో పాపులారిటీ కోసం ప్రాకులాడుతున్నారు.
    మీరన్నట్లు పబ్లిక్ గా ఏ విషయం మీద అయినా కామెంట్ చేసేవారికి అర్హత పెట్టాలి. అది మన దేశం లో అయ్యే పనేనా?
    - మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం

    ReplyDelete
  3. "ఇక్కడ వ్రాత పూర్వకంగా ప్రకటిస్తున్నాను. నేను ఏ ఛానల్ నీ పూర్తిగా చూడలేదు. కారణం చూడలేకపోవడమే. తప్పునాదికాదు. రాజకీయ, సాంఘిక, ఆధ్యాత్మిక, సాహిత్య, ప్రసార, ప్రచార, వ్యక్తిగతమైన నీతి, వ్యవస్థాగతమయిన కమిట్ మెంట్ - సంబంధించిన అన్ని రంగాలలోనూ సమగ్రమయిన అవ్యవస్థనీ, అధోగతినీ సాధించిన ఈ నేపధ్యం నాలో ఓ తృప్తినీ, ఉత్సాహాన్నీ మిగిల్చింది. నేను తెలుగు దేశంలో లేనందుకు, తెలుగు ఛానళ్ళ బారిన పడనందుకు. "

    ఇంతకన్నా, ఈ వాక్యాల కన్నా మన మీడియాకు ప్రశంసా పత్రం అవసరం లేదు సార్!....

    అయినా చెవిటివాడి ముందు శంఖం ఊదితే ఆయనకు ఏడు తరాల తర్వాతన్నా వినపడుతుందేమో కానీ, ఈ గొర్రెలకు, కాపరికీ వినపడుతుందనుకోటం అత్యాశేమో సార్!

    ReplyDelete
  4. నమస్కారం. సరిగ్గా, ఓ ఏడాది క్రితం అనుకుంటా, నాకూ ఇలాంటి అనుభవమే ఎదురైంది. చెన్నై లో ఉన్నంత వరకూ, ప్రశాంతం గా ఏదో నా పని నేను చేసుకుపోయే నేను, ఏ పండుగకనో, పని మీదో, వైజాగ్ వెళ్ళినప్పుడల్లా, కోపోద్రేకాలకు గురికావడం, చిరాకు వగైరా.. వగైరా. కాస్త స్థిమితంగా ఆలోచిస్తే తేలింది, మీరు చెప్పిన కారణమే. ఆ రకం గా, తమిళ దేశంలో ఉన్నా మనం అదృష్టవంతులమే మరి. మొన్నెపుడో, కాస్త విలువులున్న ఓ ఇంగ్లీష్ చానెల్ చర్చలో, కరణ్ థాపర్ మాట్లాడుతూ, "ధోనీ-సాక్షి" బీచ్ ఫోటోలతో ఓ రెండు టీవీ ఛానళ్ళు (TV9 తెలుగు, TV9 కన్నడ) అరగంట సేపు కార్యక్రమాన్ని ప్రసారం చేశాయని వాపోయాడు. ప్రక్కనే ఉన్న మా ఆవిడ, "వీళ్ళు ఇప్పుడు చర్చ పేరుతో, ఆ ఫోటోలు అరగంటసేపు ఎందుకు చూపిస్తున్నారు" అని అడిగింది. సమాధానం తెలీక, ఛానల్ మార్చేసాను. ఆ మధ్య, వర్మ ఒక ఫ్లాప్ సినిమా తీసాడు ("రణ్"), అందులో, ఒక న్యూస్ రీడర్ పాత్ర చెప్తుంది - "ఇవి మీకు వార్తలేమో, కాని మాకు ఇవి మేము తీసే ౩౦ నిమషాల సినిమాలు" అని. ఇంగ్లీష్ లో ఓ మాట వుంది, "some thing is better than nothing", అని.. కాని.. "nothing is better than nonsense" కదా!!

    ReplyDelete
  5. బాగా వ్రాసారండి. మనలాంటి దేశంలో కంట్రోల్డ్ మీడియానే బెస్ట్.

    ~సూర్యుడు

    ReplyDelete
  6. విద్య,సాహిత్యం,కళ ఈ ఈ రంగాలలో ప్రమాణాల స్థాయి రాను రానూ దిగజారిపోతున్నాయి. స, శ, ష ఈ అక్షరాలని పలకడంలో తేడా వస్తే వీపు పగిలేది మా తెలుగు తరగతిలో. యిప్పుడు, తెలుగుమీడియంలో చదివే వారే చాలా తక్కువ. ఏవో నాలుగు కంప్యూటర్ ల్యాంగ్వేజీలు నేర్చుకుని పాతికేళ్ళకే లక్షల్లో సంపాదించడం, ఆ డబ్బు వల్ల సంఘంలో ఉన్నతులుగా గౌరవించబడటం వీటి వల్ల, మంచి పుస్తకాలు చదవటానికి తీరుబడి, ఆసక్తి రావట్లేదు. టీవీ, కంప్యూటర్ వీటిని కాసేపు ఆపి ఒక మంచి పుస్తకాన్ని ఆస్వాదించడం ఎంత మంది చేస్తున్నారు?రాజకీయ, సాంఘిక, ఆధ్యాత్మిక, సాహిత్య, ప్రసార, ప్రచార, వ్యక్తిగతమైన నీతి, వ్యవస్థాగతమయిన కమిట్ మెంట్..... ఈ పదాలని రాయాలంటేనే ముందుగా, ప్రశాంతత, ఓపిక, సహనం, పుస్తక పఠనం అంటే ఇష్టం, తృప్తి, మన సంస్కృతి అంటే గౌరవం, ఉండాలి. డబ్బుతో మాత్రమే కాకుండా విడిగాకూడా జీవితాన్ని ఆనందంగా అనుభవించటం ఎలాగో నేర్చుకోవాలి. ఇందుకోసం విఙ్ఞాన ఘనులయిన పెద్దవారితో కొంతసేపు గడపాలి. ప్రత్యక్షంగా వీలుకాకపోతే, కనీసం వారి పుస్తకాలనయినా చదివి తెలుసుకోవాలి.
    ఏమయినా, నేటి అవ్యవస్ఠమీద, అధోగతి మీద మీ అక్షంతలు చూసి మాకు చాలా తృప్తి కలిగింది.

    ReplyDelete
  7. Rightly said. Infact Doordarshan is the only channel that broadcasts programmes on politics and development (they go by the government,ofcourse), education, classical, light, folk arts, artists, children and youth(in a decent manner),senior citizens, urdu programmes, etc. The food for the entertainment and news channels are movies, heroines, heroes, directors and western culture. A very pathetic state.

    ReplyDelete
  8. టీవీ ని ఇంగ్లీష్ లో ఇడియట్ బాక్స్ అని ఎందుకు అంటారో ఈ మధ్య వస్తున్న టీవీ ప్రోగ్రామ్స్ చూస్తే అర్ధం అవుతోంది.
    దసరా సెలవులకు ఇంటికి వెళ్తే నా పరిస్థితి ఇదే. నాకు ఇక్కడ నడిచే యాంత్రిక జీవనం లో టీవీ కి చోటు లేదు. ఇంటికి వెళ్ళగానే అందరు నియంత్రణ యంత్రం నా చేతిలో వదిలారు. ఈ కర్మ నా కేల అనుకోవడానికి ఒక గంట సమయం పట్ట లేదు.
    ఎక్కడ చుసిన అడ విలన్ తో సీరియల్ లు బరించ లేక న్యూస్ ఛానల్ పెడితే ఇదే తంతు.
    రామాయణం ని తప్పు పట్టే వాళ్ళు, ఇందులో అసలైన రామాయణం చదివిన వారు ఎందరో తెలీదు. ఎవరో అన్నారు రామాయణ కావ్యం వాల్మీకి మహర్షి కల్పనా అయితే అద్భుతం అని ..నిజంగా జరిగి ఉంటె మహాద్భుతం అని.. ఏది ఏమైనా రచయిత రాసింది...ఇంకా అయన భావనలు అర్ధం చేసుకోవటమే కష్టం ఒక్కో కరి ఒక రకంగా ఉంటుంది దాని భావం.రామాయణం వాల్మీకి రాసాడు అని కూడా తెలియని వాళ్ళు, మిడిమిడి జ్ఞానం
    ఉన్న వాళ్ళు ....ఆ మాహకవ్యాన్ని తప్పు పట్టడం.
    అన్నిటికి మించి ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే.... సుప్రభాతం లో అర్ధం బాలేదు అని నాస్తిక వాదులు వాదించటం. దేవుడే లేదు అనే వాళ్ళు దేవుడి పూజ లో ఏమి ఉంటె ఏమిటి ఏమి లేకుంటే ఏమిటి. ఏకంగా దేవుడిని తెలుగు దేవుడు తమిళ దేవుడు అని అనటం నాకు ఇంకా నవ్వు తెప్పించింది..
    ఇది ఛానల్ వాళ్ళు తమ publicity కోసం చేస్తే... అక్కా వచ్చిన పెద్దలు (అనబడే ) వాళ్ళు కూడా తమ తమ ప్రతిబ కామెర ముందు చూపించుకోవాలి అని పద్యాలూ భారి భారి గా డైలాగులు చెప్పటం....
    వీరందరినీ చూస్తే రాఖి సావంత్ చేసేది చల్ తక్కువ అనిపించింది నాకు అయితే...

    ReplyDelete
  9. మీ తెలుగోడు వ్యాసం చాలా బాగుంది. మీరు చెప్పినట్లే, ప్రసార మాధ్యమాలు(కొన్ని వార్తా పత్రికలతో సహా) ప్రజల సమస్యల పట్ల దృష్టి పెట్టటం కంటే, సంచలనాలకు ప్రాదాన్యతనిస్తున్నాయి. వార్తయందు జగము వర్ధిల్లుచున్నది అని ఎవరో మహానుభావులు చెప్పారు. కాని సరైన పాత్రికేయులు ఉన్నా, వారిని ప్రోత్సహించే వాతావరణం ఎక్కడుంది? మరీ 24 గంటల వార్తా చానల్స్ వచ్చాక, మేత కరువై, ఏదో చెత్త వార్తలతో కాలం వెళ్ళబుచ్చుతున్నారు. పూర్తి కార్పోరేట్ సంస్థలుగా మారిన ఈ చానల్స్ మనకు ఏ మేరకు మేలు కలిగిస్తున్నాయో అర్థం కాకుండా ఉన్నది. నాకు తెలిసి, ఎక్కువ సార్లు, వ్యక్తుల భావోద్వేగాలను రెచ్చగొట్టి, అగ్నికి ఆజ్యం పోసే పాత్రలో ఈ చానల్స్ ముందుంటున్నాయి. ఇకపోతే, ఎంత తెలుగురాని వారైతే, అంతగా యాంకర్లుగా వెలుగొందే అవకాశం ఈ చానల్స్ అవకాశం కల్పిస్తున్నాయి. ఒకసారి ఈనాడు కార్టూనిస్ట్ శ్రీధర్ గారు నేటి టీవీ యాంకర్లపై ఒక వ్యంగ కవిత వ్రాసారు. అందులో కొన్ని వాక్యాలు ఇక్కద ఉదహరిస్తాను.
    "వచ్చీ రాని తెలుగు మాట్లాడవలయును
    మైకుతో మెదడు తినవలెను
    డయల్ ఇన్ ప్రోగ్రామ్స్ తో డోకు తెప్పించవలెను
    ప్రతిదానికీ థాంక్యూ అండీ అని అనవలెను"
    కాబట్టి, మీలాంటి రచయితలు నేటి తెలుగు చానల్స్ చూసి బాధపడటంలో ఆశ్చర్యం లేదు. చాలా విషయాలలో అందరికీ దారిచూపగలిగే అవకాశం ఉన్నా, నేటి తెలుగు చానెల్స్ ఆ అవకాశాన్ని దుర్వినియోగపరుస్తున్నాయని మనకు తెలియంది కాదు. చివరిగా, మీ ఆరోగ్య రహస్యాన్ని చెప్పినందుకు చాలా కృతఙ్ఞతలు.

    ReplyDelete
  10. nothing is better than nonsense...Great, Vijay Bhaskar garu!

    ReplyDelete
  11. Dear sri Gollapudi Maruthi Rao garu-

    Although I agree on the satire(I laughed through out while was reading)- I do not agree with you in whole. People like you who were/are in the media (radio/cinema/tv/newspapers/weeklies/) especially there is no field you have not touched. Do you not think you should take some active part and do something good for that which you have represented/representing rather than passing side way comments? Any tom dick and harry can do this. But people of calibre should do some action rather than being inactive. This is the problem that crippling our politics. So is the case with media as well. Do you agree?

    Cheers
    Zilebi
    http://www.varudhini.tk

    ReplyDelete
  12. అందరికీ దీపావళి శుభాకాంక్షలు
    - మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం

    ReplyDelete
  13. Zilebi garu, I respect your opinion, and I can understand your perspective too. But dont you think its upto once choice/constraints to decide upon ? and that to at his age, dont you think, we are expecting too much from him. as i see, its not just satire he writes on, he adds his experience, vision and his agony (at times)to it. if at all a change has to come, if at all somebody wants to make a difference, then it has to be the younger generations. నా వరకూ నేను, మారుతి రావు గారి లాంటి రచయతల నుంచి కోరుకునేది ఒక్కటే, వాళ్ళ కున్న విషయ పరిజ్ఞానం, అనుభవం, విలువలతో, సమాజం పట్ల మనకు ఒక wholistic view ని ఇవ్వడం. దానికి మనం ఎలా react అవుతాం, ఎలా progress అవుతామన్నది ఇంక మన మీద ఆధారపడి వుంటుంది.

    I hope you will understand the point which i am trying to make. And kindly dont think otherwise. Thank you.

    ReplyDelete
  14. జిలేబీ గారు, Any tom dick and harry can do this. ఈ వాక్యాన్ని Any layman can do this అనే వాక్యంతో substitute చేస్తే, కొంచెం హుందాగా ఉండేది. ఇది మంచి, ఇది చెడు అని అందరికీ అర్ధమయ్యేలా చెప్పటం(Diagnose) కూడా treatment లో ఒక భాగమే.

    ReplyDelete