Monday, July 20, 2009

ఆనందం ఖరీదు-ఆలోచన

చాలామంది ఆనందానికీ, ఖరీదుకీ లంకె వుంటుంది. ఖరీదయిన కారూ, ఖరీదయిన సూటూ, ఖరీదయిన భోజనం,ఖరీదయిన పరుపూ- మీ యిష్టం -ఏదయినా దాని చివర వున్న చీటీని బట్టి మనస్సులో ఆన్ందానికి తూకం వుంటుంది. మా ఆవిడ షాపులో చీరెల రంగులూ, నాణ్యాన్ని చూసే ముందు ధరని చూస్తుంది. ఖరీదు నాలుగంకెల్లో వున్నాక- ఆమెకి మెల్లగా చీరె నచ్చడం ప్రారంభిస్తుంది. ఆ తరువాతే రంగు, మన్నికా వగైరా. ఓసారి నేను తెచ్చిన చీరెని ఆనందంగా అందుకుంది. తృప్తిగా కట్టుకుంది. ఖరీదుని దాచి నెలరోజుల తర్వాత చెప్పాను-ఫలానా మార్కెట్లో చవకగా తీసుకున్నానని. ఆ క్షణం నుంచీ ఆ చీరెమీద ఆమెకి మక్కువ పోయింది.
పూర్తి కాలం

17 comments:

  1. తెలుగు బ్లాగులోకంలోకి ప్రవేశించిన గౌరవనీయులైన మారుతీరావుగారికి హృదయపూర్వక స్వాగత నమస్సుమాంజలి.

    ReplyDelete
  2. అచ్చంగా గొల్లపూడి వారే ! ఏమి ఈ తెలుగు బ్లాగుల/ బ్లాగు వీక్షకుల అదృష్టము !

    స్వాగతం , సుస్వాగతం ! కౌముదిలో మీ రచనలు చదివే భాగ్యం కలిగింది ! ఇక్కడ ఆ రచనలు పొందుపరచడం చాలా ఆనందంగా ఉంది !

    నేను మీ కోవలోకే వస్తాను ! ధర ఎంత ఆదా చేయవచ్చో అనేందుకే ధర చూస్తాను ! నా దగ్గర బ్రాండు వస్తువు ఒక్కటీ లేదు ! షాపింగు అంటేనే మహా బద్ధకం ఉన్న అమ్మాయిని!

    ReplyDelete
  3. గొల్లపూడి వారా?నమస్కారం.బ్లాగ్లోకానికి సాదర ఆహ్వానం.మొన్న తానా లో పూర్వ తెలుగు కవుల పరిచయ సభలో పుస్తకం మీద మీ ఆటోగ్రాఫు తీసుకున్నాను.గుర్తున్నానని మీరంటే మహదానందం :) లేదంటే ఇప్పటి నుండి దృష్టిలో పడే పనిలో వుంటాను :) మీ జీవిత చరిత్ర చదువుతూ వున్నాను.పూర్తి చేసి కలుస్తాను.

    ReplyDelete
  4. గొల్లపూడి గారికి బ్లాగులోకానికి స్వాగతం. మీలాంటివారు బ్లాగులోకంలోకి అడుగుపెట్టడం నిజంగా బ్లాగరుల అద్రుష్టము!

    ReplyDelete
  5. ఈ బ్లాగు నిర్వాహకులకు ఒక సూచన/విన్నపము: దయచేసి comments moderation పెట్టండి, లేకుంటే ముందు ముందు సమస్యలు ఎదురవగలవు.

    ReplyDelete
  6. ఓసారి నేను తెచ్చిన చీరెని ఆనందంగా అందుకుంది. తృప్తిగా కట్టుకుంది. ఖరీదుని దాచి నెలరోజుల తర్వాత చెప్పాను-ఫలానా మార్కెట్లో చవకగా తీసుకున్నానని. ఆ క్షణం నుంచీ ఆ చీరెమీద ఆమెకి మక్కువ పోయింది.
    _____________________________________________

    Very well said.

    ReplyDelete
  7. గొల్లపూడి గారికి సాదర స్వాగతం!!

    ReplyDelete
  8. నమస్కారం ! Happy to see you here !

    ReplyDelete
  9. గొల్లపూడి గారూ, నమస్కారం.. బ్లాగ్లోకానికి స్వాగతం..

    ReplyDelete
  10. గొల్లపూడి వారికి సాదర సవినయ ఆహ్వానం.

    ReplyDelete
  11. meeku teenmar tho swagatham palukutunna mee chinni abhimani..

    ReplyDelete
  12. nice explanation abt our(some people) nature.
    ur serial "vennala katesindi" in koumudi.net is awesome .

    one Small Request

    "please keep the books list written by u......."

    ReplyDelete
  13. నమస్కారములు
    చాలా సంతోషంగా ఉంది.

    బొల్లోజు బాబా

    ReplyDelete
  14. గొల్లపూడి గారూ నమస్కారం..
    బ్లాగ్లోకానికి స్వాగతం :)

    ReplyDelete
  15. గొల్లపూడి గారికి బ్లాగులోకానికి స్వాగతం

    ReplyDelete
  16. చాలామంది ఆనందానికీ, ఖరీదుకీ లంకె వుంటుంది. ఖరీదయిన కారూ, ఖరీదయిన సూటూ, ఖరీదయిన భోజనం,ఖరీదయిన పరుపూ- మీ యిష్టం -ఏదయినా దాని చివర వున్న చీటీని బట్టి మనస్సులో ఆన్ందానికి తూకం వుంటుంది.....!

    ఎంత కాదని వాదిద్దామని ఉన్నా ఒప్పుకోక తప్పదనిపిస్తోందండీ!

    నమస్కారం! బ్లాగులోకానికి స్వాగతం!

    ReplyDelete
  17. నా పట్ల మీరందరూ చూపే అభిమానానికి నా కృతజ్ఞతలు.ఈవిధంగా మీ అందరికీ దగ్గరవుతున్నందుకు ఆనందంగా వుంది. మీ ప్రతిస్పందనకి ఎదురుచూస్తూంటాను.

    ReplyDelete