నవలలలో తనదైన ముద్రని వేసిన ఓ నవలాచక్రవర్తి కధ
పూర్తి వ్యాసం
Monday, July 20, 2009
Subscribe to:
Post Comments (Atom)
ఏ రచయితకయినా పాఠకుడి స్పందన ప్రాణప్రదం. రచన పదిమంది మనస్సుల్లో మెదలాలి. ఆయితే వారి స్పందన సూటిగా రచయితకి అందగలిగితే – ఆ ఆవకాశం గొప్పదీ, ఆశించదగ్గదీను. ఆ లక్ష్యంతోనే ఈ బ్లాగ్ ని ప్రారంభించడం జరిగింది. నా రచనలకీ, నా ఆభిప్రాయాలకీ, మీ ఆభిప్రాయాలకీ వేదిక ఈ బ్లాగ్. చక్కని సాహితీ సమాలోచనలకీ, చర్చలకీ ఇది చక్కని ఆవకాశం కాగలదని నా ఆశ. - గొల్లపూడి మారుతి రావు
ఈనాడు ఆదివారం పుస్తకంలో రాసినట్టు ఉన్నారుకదా. అప్పుడు చదివాను. కదిలించింది.
ReplyDeleteవ్యాసం చాలా బావుంది. ఇపుడు కొవ్వలి గారి రచనలు మార్కెట్ లో దొరుకుతాయా ? ఇంగ్లీషు పుస్తకాల్లాగా రెండు మూడు నవల్లు కలిపి ఒకే పుస్తకంగా ప్రచురించడం తెలుగులో ఉన్నదా ? ధన్యవాదాలు.
ReplyDeleteవిశాలాంధ్ర ప్రచురణాలయంవారు ఈ మధ్యనే అయిదారు నవలలు కలిపి ప్రచురించారు
ReplyDeleteమారుతీరావుగారు. బ్లాగ్లోకంలో! ఆశ్చర్యానందాలతో, స్వాగతం.
ReplyDeleteథాంక్స్ అబ్రకదబ్రగారూ
ReplyDeleteమిమ్మల్ని ఇక్కడ చూడటం చాలా సంతోషంగా ఉందండీ మారుతీరావు గారు. స్వాగతం.
ReplyDeleteమరోమాటండీ... మీరు కొత్త కదా ఇక్కడ. ఇక్కడ బ్లాగుల్లో ఇంపు ఎంత ఉందో కంపు అంతకు పదిరెట్లుంది. కాబట్టి వ్యాఖ్యలని ఆటోమాటిగ్గా ప్రచురించేంత పెద్దమనసు పెట్టుకోకండి. ముందు మీరు చదివి ప్రచురించదగ్గవైతే అప్పుడు ప్రచురించండి.
ReplyDeleteమీరు వ్రాసిన వ్యాసం చాలా బాగుంది. ఎన్నో విషయాలను తెలియజేశారు. కొవ్వలి గారు వెయ్యి నవలలు వ్రాశారని ఇంతకుముందు విన్నాను. కానీ నమ్మలేకపోయాను. వెయ్యి నవలలు ఎలా వ్రాయగలరబ్బా? అనుకొనేవాడిని. జీవిత చివరి దశలో ఆయన అన్ని కష్టాలు పడటం కదిలించింది.
ReplyDeleteమిమ్మల్ని ఇక్కడ చూడటం చాలా ఆనందంగా ఉంది. మీ రచనా అనుభవాలను, మీకు తెలిసిన రచయితల గురించి మరిన్ని వ్యాసాల కోసం మేమందరం ఎదురు చూస్తూ ఉంటాము.
ధన్యవాదాలు.
మారుతిరావుగారు,
ReplyDeleteనమస్కారం...
ఇన్ని నవలలు రాసిన నవలా చక్రవరిది నేను ఒక్కటంటే ఒక్క నవల చదవలేదంటే అది నా దౌర్భాగ్యం అనుకోనా! లేక తెలుగు పబ్లిషింగ్ రంగానికీ సాహిత్యానికీ పట్టిన తెగులు అనుకోనా!!
ReplyDeleteమారుతి రావు గారు
ReplyDeleteనమస్కారమండి.కొవ్వలి వారి గురించి చిన్నపుడు విన్నాను.అప్పట్లొ అందరిని ఎంతొ ఆకర్షించెవట వీరి రచనలు.ఇక్కడ దొరికితె తప్పక చదివెందుకు ప్రయత్నిస్తాను.
వ్యాసం చివర్లో మీరు చెప్పిన వాక్యాలు చదివి కళ్ళు చమర్చాయి. కీలేజీ రోజుల్లో మీరు ఉటంకించిన "విషకన్య" నవల, "భయంకర్" పేరుతో వచ్చిన నవలలు చదివిన గుర్తు. ఆ రచయిత వెనుక ఇంత విషాదం ఉందని తెలీదు.
ReplyDeleteమారుతీ గారు,
ReplyDeleteనిజ్జంగా మీరు మీరేనా
అంటే మీ పేరుతో ఎవరైనా వ్రాస్తున్నారా అని చిన్న అనుమానం. :)
మీరే టైప్ చేసి మీరే వ్రాస్తుంటే మాత్రం మీరు గ్రేట్. మీ తరం వారు ఎప్పటికైనా బ్లాగుల్లోకి వస్తారా అని నాకు చాలా అనుమానం ఉండేది.
మారుతీ రావు గారికి
ReplyDeleteఈ వ్యాసా్న్ని ఇదివరలో ఓ బ్లాగులో పంచుకోవటం జరిగిందండీ. అక్కడ నేను చేసిన కామెంటు ఇది. ఇప్పుడు మరలా చదివినప్పుడు కూడా అవే ఆలోచనలు. అవే ప్రశ్నలు కలుగుతున్నాయి.
ఆ లింకు ఇది
http://satyasodhana.blogspot.com/2008/10/friday-october-10-2008-16-18hrsist.html
అక్కడ అప్పుడు నే చేసిన కామెంటు ఇది.
ఎంత దారుణమైన వాస్తవం
ఎంత భయంకరమైన దారిద్ర్యం
ఎంత ఉన్మత్త నాటక లీల
సాహిత్యం సాహిత్యం కోసమే తప్ప జీవిక కోసం కాదనీ, కనీసం ఆత్మాభిధనుల కేమాత్రం జీవికనీయజాలదనటానికి ఎంతటి గొప్ప సజీవ ఉదహరణ.
ఇలాంటి దయనీయ పరిస్థితులలో సమాజం పాత్ర ఏమిటి?
మనోలోకంలో పులకరింతలు పొంది రససిద్ది అనే ఆనందాన్ని పొందిన చదువరులు చేయవలసిన భాధ్యతేమిటి?
ఎన్ని ప్రశ్నలు ఏవీ సమాధానాలు.
ఇక ప్రస్తుతానికి వస్తే, వీరి పేరు వినటమే కానీ నేనూ వీరి నవలలు పెద్దగా చదివిన జ్ఞాపకం లేదు. పైన కత్తి మహేష్ గారు అడిగినట్లుగా లోపం ఎక్కడుందో తెలియటం లేదు.
మీతో ఇలా మాట్లాడడమే భాగ్యంగా భావిస్తూ
భవదీయుడు
బొల్లోజు బాబా
నిజంగా నేనే రాస్తున్నానండీ. మీ అందరితో మీ స్పందనల్ని పంచుకోవాలన్నదే నా ఉద్దేశం
ReplyDeleteగొల్లపూడి గారు,
ReplyDeleteమీ సత్వర స్పందనకు నెనర్లు.
మీ రచనా శైలి అన్న నాకు చాలా మక్కువ - అలాగే చదివిస్తుంది అది.
మీ కథల్లో వాతావరణం నాకు పరిచయమున్నా, లేకున్నా , మీరు చెప్పే విషయాలు నాకు అంత అవసరమున్నా లేకున్నా కేవలం మీ శైలిపై మక్కువతో అన్నీ చదువుతుంటాను చాలా తేట తెల్లంగా ఉంటుంది అది.
ఎప్పుడో ఒక కథ మీదే అనుకుంటాను, ఈనాడులో వచ్చింది అనుకుంటాను ఒక పూజారి పల్లె నుండి నగరం వచ్చి అక్కడ గడిలో అంతర్ఘర్షణ చెందటం బాగా వ్రాశారు. వార్తాలో అనుకుంటాని మీకాలం ఆ రోజుల్లో గబుక్కున చదివేది.
మీ ఆత్మ కథ చూడంగనే కొనేశాను, ఇంకా చదవలేదు, చదివాక ఒక టపా కట్టాలి :)
మరో సారి నెనర్లు.
నమస్కారం మారుతీరావు గారు
ReplyDeleteధన్యవాదాలు
అభిలాష లో మీ క్యారెక్టర్ ని మర్చిపోలేము ఎన్నటికి
మీరు ఎప్పుడో ఈనాడు పుస్తకం లో మీ సౌత్ ఆఫ్రికా లో సింహాల సఫారి గురించి రాసారు బాగా నచ్చింది
నిజంగా మీరేనా! నమ్మలేకపోతున్నాం
@ హరేకృష్ణ గారు..సింహాల సఫారీ గురించి టాంజానియా ట్రావెలోగ్ లో వ్రాశాను. ఆ ట్రవెలోగ్ పూర్తి పుస్తకాన్ని ఇక్కడ చదవొచ్చు మీరు.
ReplyDeletehttp://koumudi.net/books/tanzania_travelog_koumudi.pdf
చాలా థాంక్స్ సర్ ! నేను ఊరెళ్ళినపుడు విశాలాంధ్రా లో ఈ నవలలు కొనుక్కుంటాను. ఇప్పటి దాకా నాకూ 'కొవ్వలి' అన్న పేరే తెలియదు. మీరే ఈ బ్లాగు నిర్వహిస్తున్నారంటే, మీకు అభినందనలు. తెలుగు బ్లాగులకే కొత్త కళ వచ్చింది.
ReplyDeleteగొల్లపూడి మారుతీరావుగారికి నమస్కారములు.
ReplyDeleteతెలుగు కళాసాహిత్యసరస్వతి ముద్దుబిడ్డ మీరు. మీ పాదాల దగ్గఱ కూర్చోవడానిక్కూడా అర్హత లేనివాణ్ణి నేను. కానీ ఈ బ్లాగు ద్వారా ఇలా మీతో మాట్లాడగలుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది.
కీ.శే. కొవ్వలివారి నవలల్ని వెలుగులోకి తేవడానికి ఇటీవల ఎవరో కంకణం కట్టుకున్నారని విన్నాను. అది సాధ్యమైనంత త్వరగా జఱగాలని మనసారా కోరుకుంటున్నాను. ఆ నవలలన్నీ వెలుగులోకి వస్తే ఆయన Andhra Hemingway అని పేరు పొందుతారు. (Hemingway ఆంగ్లంలో లక్ష పుటల సాహిత్యాన్ని సృష్టించాడట)
మారుతీరావుగారు. బ్లాగ్లోకంలో! ఆశ్చర్యానందాలతో, స్వాగతం.
ReplyDeleteనేను ఇంతకముందు ఒక మెయిల్ చేసాను మీకు, నా బ్లాగు గురించి. :):)
ధనవాదాలు.
మారుతీరావు గారు, బాపు గారి డైరక్షన్ లో మీ సినిమాలేవయినా చెప్తారా? రమణగారి డైలాగ్స్ మీ స్టైల్ లో ఎలా ఉంటాయో వినాలనుంది.
ReplyDeleteపేదరికమంత బాధాకరమైనది ప్రపంచంలో మరొకటుండదేమో
ReplyDelete"..అంత దాఋణంగా వారి లేమిని వర్ణించాలా..?"
ReplyDeleteఅవును సూర్యుడుగారూ. కాని కొందరు- కొవ్వలి లాంటివారు పేదరికాన్ని వరం చేసుకుని సమాజానికి చరిత్రని సృష్టిస్తారు.
ReplyDeleteఅలాంటి మహానుభావుడు మరొకరున్నారు. అయన పేరు చార్లీ చాప్లిన్. ఆయన కన్నీఎటికే కొత్త అర్ధాన్ని కల్పించి దౄశ్య కావ్యాలనే సృశ్టించాడు. తన చదువు లన్నాడు లే మికి ఆయన కొత్త అన్వయం చెప్పాడు.I was educated, not because I like education, but as a shield againt people's contrmpt towards uneducated!
హరీ పోటర్ కధలా వుంది
Deleteతలకు మించిన వేదనల కడలిలో తలమునకలై, బిడ్డలకి కడుపారా అన్నమైనా పెట్టుకోలేని తల్లి ఏమౌతుందో మనకు చరిత్ర సాక్ష్యముంది, చార్లీ చాప్లిన్ తల్లి. అదే లక్స్మీ దేవి విషయంలోనూ జరిగింది. పిల్లల్ని సరిగ్గా పోషించలేని నిర్వీర్యతా, రేపు మీద బొత్తిగా ఆశలు లేని జీవితం......
ReplyDeleteసంసారాన్ని నిలుపుకోవడంకన్నా ఆత్మాభిమానమే గొప్పా? నమ్ముకున్న సిద్ధాంతాలు బువ్వపెట్టనప్పడు, కట్టుకున్న పెళ్ళాన్నీ పిల్లల్నీ ఆకలిగురిచెసే హక్కు ఎక్కడిదీ?
మారుతీ రావు గారూ - పైన ప్రశ్న చాలా వైడ్ ప్రశ్న కావచ్చు. కానీ, ఈవ్వాల్టి యువతకీ చదువుకున్నా, సరైన ఉద్యోగం దొరక్క, లేక ఉద్యోగం చేస్తూ డబ్బుసంపాదిస్తున్నా, ఆ ఉద్యోగం ఊడితే కలిగే "ఇన్సెక్యూరిటి"నుండి బయటపడగలిగే ముందుచూపులేక అప్పుల్లోచిక్కుకుపొయ్యి కొట్టుమిట్టాడే యువతకి మీరిచ్చే సలహా ఏంటి?
మారుతీగావు గారూ,
ReplyDeleteమీ blog చూస్తే చాలా సంతోషంగా ఉంది. కొవ్వలిగారి పేరు విన్నాను కానీ, ఆయన వెయ్యి నవలలు రాశారనీ, వెనక ఇంత కథ ఉందనీ తెలీదు.
ఆయన కథ చదివిన తర్వాత ఇక్కడి హారీ పాటర్ కథలు సక్సెస్ ఎందుకయ్యాయో కొంత తెలుస్తుంది. భాష మీద సానుభూతితోనో, పిల్లలేదో మిస్సయిపోతున్నారనో చేసే పనులు sustainable కాదేమో. పిల్లలకి చదవాలనిపించేలా రౌలింగ్ రాసింది, చదవటం రానివారికి కూడా చదువు నేర్చుకుని మరీ చదవాలనిపించేలా కొవ్వలి రాశారు. పిల్లలు చదవటం లేదు అనే మాట తెలుగుకే పరిమితం కాదు. హారీ పోటర్ వచ్చిన తర్వాత పోనీలే పిల్లలు ఏదో ఒకటి చదువుతున్నారు అని ప్రపంచమంతా చాలామంది తల్లిదండ్రులు,టీచర్లు ఫీలయ్యుంటారు. లోటుండేది చదవాలనిపించే పుస్తకాలకి. కొవ్వలి మంచితనానికి తార్కాణం అలాంటి పుస్తకాలను చౌకగా అమ్మటానికి సహకరించటం, జీనియస్ కి తార్కాణం అలాంటి పుస్తకాలు (వెయ్యి!) రాయగలగటం.
పిల్లలకి తెలుగు రాదు అనే మాట, వారికి ఆసక్తి కలిగించే పుస్తకాలు రాయలేనందుకు (అవి చౌకగా అందించలేనందుకు) మనం అడ్డుపెట్టుకుంటున్న సాకు అని నాకనిపిస్తుంది. పిల్లలు తెలుగు సినిమాలు చూడటం ఆపలేదు కదా. మన సినిమాల ఆకర్షణ శక్తి తగ్గలేదు కానీ పుస్తకాలది తగ్గింది ఎందుకు?
మీ వ్యాసం చివర్లోని కొవ్వలిగారి లెటర్ చదివితే, లాభాలు చూసుకోకుండా, అందరి లిటరసీ కోసం, చాలా తక్కువకే పుస్తకాలు అమ్మటం వల్లనే ఆయనకు కష్టాలు అని తెలుస్తోంది. అన్ని దశాబ్దాల ముందు, ఒక్క మనిషి, "that was my motive" అంటూ చేసిన పనికి "రెండు తరాలు చదవటం అలవాటు చేసుకున్నాయి". మళ్లీ ఇలాంటిదేదో జరిగితే బాగుండు (ఈసారి కష్టాలు లేకుండా)
విజయ్
నమస్తే మారుతీరావు గారు,
ReplyDeleteఇవాళే కౌముదిలో మీరు రాసిన టాంజానియా ట్రావెలాగ్ చదివాను. ఆయా ప్రదేశాల గురించి పాఠ్య పుస్తకాల్లోనూ, వార్తా పత్రికల్లోనూ చదివితే పొందలేని అనుభూతి మీ ట్రావెలాగ్ చదివితే కలిగింది. యుక్త వయసు కావడం చేతనేమో, మొదటి సారి దేశం విడిచి వెళ్ళినప్పుడు ఫ్రాన్సు దేశంలో మూడు నెలలు ఉన్నా, ఎక్కువ సమయం నగరంలో ఉన్న ఆర్భాటాలలోనే తృప్తిని వెతుక్కున్నాను. కానీ రెండో సారి బయటికి, ఇదిగో ఇప్పుడు, బార్సిలోన వచ్చాక ఈ నగర హంగుల కన్నా, ఇక్కడి ప్రజల మనోభావాలు, వీళ్ళ చరిత్ర గురించి వీళ్ళ మాటల్లోనే వినడమూ, ఒక సాయంత్రం వీళ్ళ సాంస్కృతిక కార్యక్రమాల్లో గడిపితే ఆనందమూ.. ఇలాంటివి ఎక్కువ తృప్తినిస్తున్నాయి. అలాంటి అనుభూతే, టాంజానియా వెళ్లి చూడలేకపోయినా, మీ ట్రావెలాగ్ ద్వారా పొందగలిగాను. నెనర్లు!
కౌముదిలో మీరు రాసే దాదాపు ప్రతి ఆర్టికల్ చదువుతాను. రచనలో వ్యంగ్యానికున్న పదును ఎలాంటిదో మీ రాతల్లో తెలుస్తుంది.