Monday, July 27, 2009

ఉంగరం గరంగరాలు

ఈ మధ్య తమిళనాడులో అద్భుతమైన వితరణ జరుగుతోంది. నిన్నకాక మొన్ననే తమిళనాడు ఉపముఖ్య మంత్రి స్టాలిన్ గారు3.67 లక్షల ఖర్చుతో 250 ఉంగరాలను పంచారు. ఎందుకు? తల్లిదండ్రులు తమ పిల్లలకు తమిళ పేర్లను పెట్టుకుంటే ఒక ఉంగరం యిస్తారు. మొదటి విడతలో తమిళరసి, తమిళరసు, తమిళ చెల్వన్, ఇళక్కియ, తెన్ మొళి, అరవిందన్, మణిమేఖలై-యిలాంటి రకరకాల పేర్లతో తమ పిల్లలకు బారసాలలు చేసి తల్లిదండ్రులు ఆనందంగా ఉంగరాలు సంపాదించుకున్నారు.

6 comments:

  1. చాలా బాగుంది ఆర్టికల్
    "అమ్మవారిని తాకే కాంతి కిరణాన్ని ఈ విధంగా పిలుస్తారు-అన్నాడు. నాకు ఆయన పాండిత్యానికి ఈర్ష్య, నా తెలివితక్కువ తనానికి బాధా కలిగింది."

    సరిగ్గా చెప్పారు. పురాణాల గురించి ఏమీ తెలియని మిత్రులు కూడా "వేదాల్లో ఆ పేరు ఉంది, పార్వతీదేవికి మరో పేరు" అంటూ తమ పిల్లల "హైబ్రిడ్" పేర్లకు వివరణ ఇస్తుంటే ముక్కు తీసి వేలుపైన వేసుకుంటాను అపుడపుడు :)

    ReplyDelete
  2. నమస్తే,ఆర్టికల్ బావుంది
    మీ ప్రొఫైల్ లో లొకేషన్ చెన్నై అని వుంది
    మీరు వుండేది వైజాగ్ లో కళాభారతి ఆడిటోరియం దగ్గర కదా!

    ReplyDelete
  3. చాలా బావుందండీ వ్యాసం! హద్దులు లేని ఈ ప్రాంతీయాభిమానాన్ని ఏమని పిలవాలో మరి! పేర్ల విషయానికొస్తే ఇలా నన్ను ఈ మధ్య బోల్డంత ఆశ్చర్యానికి గురి చేసిన పేర్లు "ఆష్క" "సాన్వి" ! ఈ రెండు పేర్లకు అర్థం "గాడెస్ లక్ష్మి 'అనే అట. ఏమనాలో తెలీలా!

    ReplyDelete
  4. మిమ్మల్ని బ్లాగు ద్వారా పలకరించే అదృష్టం నాకు కలిగిందంటే ఆశ్చర్యం గానూ, ఆనందం గానూ ఉంది.

    ReplyDelete
  5. జనం లో తమ పిల్లవాడి లేదా పిల్ల పేరు unique గా ఉండాలనే తపన ఈ మధ్య బాగా కనిపిస్తోంది. అందుకే వెతికి వెతికి మరీ ఏనాడూ విని ఎరుగని, అర్థం కాని పేర్లని పెడుతున్నారు. వాళ్ళని చూసినపుడు సుబ్బరంగా తెలుగు పేరేదైనా పెట్టుకోవచ్చు కదా వీళ్ళు అనిపిస్తూంది. స్టాలిన్ లాంటి వాళ్ళు తమిళ్ లోనే పేరు పెడితే తాయిలం ఇస్తామని చెప్పి మరీ దాన్ని ఒక ఉద్యమం లా ప్రోత్సహిస్తూంటే తెలుగు లో ఇలా ఎందుకు ఎవరూ చేయరు అనీ అనిపిస్తూంది. అక్కడి దాకే ఆగిపోయింది నా ఆలోచన. కానీ మీరు అంతకంటే ఒక మెట్టు పైనున్న సుదూర పరిణామాన్ని ఊహించి చెప్పాక, ఇవి అంతిమంగా ప్రాంతీయతత్వాన్ని నూరిపోసే గుళికలే అని అర్థం అయింది. మీ ఆలోచనాస్రవంతిని పంచుకుంటున్నందుకు కృతఙ్ఞతలు. మాబోటి వాళ్ళ అభిప్రాయాలూ వింటున్నందుకు అంతకు మించి ధన్యవాదాలు- బ్లాగ్లోకం లోకి సవినయస్వాగతం మీకు!!

    ReplyDelete
  6. మారుతీరావు గారు, మిమ్మలను ఇలా బ్లాగ్ముఖంగా దర్శించుకోవడం ఆనందంగా ఉంది. 1997లో అనుకుంటా చెన్నైలో మొట్టమొదటి గొల్లపూడి శ్రీనివాస్ స్మారక జాతీయ పురస్కారానికి సూపర్ హిట్ సినిమా పత్రిక సబ్ ఎడిటర్ గా పనిచేస్తుండగా హాజరయ్యాను. ఆరోజు సాయంత్రం మీతో, వాణిశ్రీ మేడమ్ మరికొందరు ఆప్తులతో కలిసి డిన్నర్ చేసే అవకాశం కలిగింది. సినిమా ఫీల్డ్ నుండి బయటకు వచ్చి ఇలా కంప్యూటర్ ఫీల్డ్ లో సెటిల్ అయ్యాక మిమ్మలను ఈ మాధ్యమంలోనూ చూడడం చాలా ఆనందంగా అన్పించి పాత జ్ఞాపకాన్ని గుర్తుచేసుకున్నాను. అంతా క్షేమమని తలుస్తాను. ధన్యవాదాలండీ.

    ReplyDelete