Sunday, August 29, 2010

బూతు క్రీడ

మొదట 'కండోం'కి అర్ధం తెలుగు పాఠకులకు చెప్పాలి. గర్భ నిరోధానికి, సెక్స్ వ్యాధులు రాకుండా జాగ్రత్తపడడానికి ఉపయోగించే రబ్బరు తొడుగు. ఇంతకంటే వీధిన పడడం నాకిష్టం లేదు.

Sunday, August 22, 2010

గురి తప్పిన నిరసన

నిన్నకాక మొన్న - స్వాతంత్రదినోత్సవం నాడు కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మీద ఒక మాజీ పోలీసు ఉద్యోగి
బూటువిసిరాడు. అంది కొన్ని అడుగుల దూరంలో తప్పిపోయింది. ఇతను ఉద్యోగంలోంచి ఏవో కారణాలకి బర్త్ రఫ్ అయాడు.
పాకిస్తాన్ వరదల్లో అల్లాడుతూంటే బ్రిటన్ లో పర్యటిస్తున్నందుకు నిరసనగా లండన్ లో ఒక పాకిస్థానీ తమ అధ్యక్షుడు
అసిఫ్ ఆలీ జర్దారీగారిమీద బూటు విసిరాడు. అదీ గురితప్పింది

Sunday, August 15, 2010

మంచితనం కూడా అంటువ్యాధే

పధ్నాలుగు సంవత్సరాలుగా మా అబ్బాయి స్మారకార్ధం జాతీయ బహుమతి కార్యక్రమాలు జరుపుతున్నా - ఏనాడూ నేను కాలం రాయలేదు. రాయవలసిన అవసరం లేదని నేను భావించాను. కన్నీళ్ళలోంచి ఓదార్పుని వెదుక్కోవడం - నా దురదృష్టం నాకిచ్చిన విముక్తి. అది నా వ్యక్తిగతం. అయితే నిన్న నాకు ఒకాయన ఉత్తరం రాశాడు. ఆయన మొన్న జరిగిన 13 గొల్లపూడి శ్రీనివాస్ జాతీయ బహుమతి ఉత్సవానికి హాజరయాడు. ఆయనెవరో నాకు తెలీదు. ఆయన్ని నేనెప్పుడూ కలుసుకోలేదు. నిన్నకూడా కలుసుకోలేదు.

Wednesday, August 11, 2010

నా మాట




నా పేరు శ్రీనివాస్ గొల్లపూడి

మిమ్మలనలరించాలీ

ఆడీ పాడీ..,

మీ నవ్వులు మీ గుబులూ

తెరపైన చూపించే

డైరెక్టరునవ్వాలని..

నే..కోరుకున్నా!

´´´

మొదలెట్టానొక చిత్రం

'ప్రేమ'ను కావ్యంగ ఎంచి

కొన్ని పుటలు లిఖించాక

ఆపదొచ్చెనను వరించి

'మృత్యు 'వన్న పక్షి ఒకటి

నా మీదే వాలిందీ

అలలలోన ముంచివేసి

నా ప్రాణంగైకొందీ

చెమరించని కళ్ళులేవు

దుఃఖించని గుండెలేదు

'అయ్యో ' అని విలపించని

బంధుమితృలొకరు లేరు

ఎగసి పడే సంద్రంలో

నడీ మధ్యన నావలాగ

నా కావ్యం మిగిలింది

నన్ను చూసి నవ్వింది

´´´

అది చూసినవాళ్ళు

గుండె పగిలి ఏడ్చారు

ఇలా ఇలా కావ్యం

మిగలకూడదన్నారు.!

´´´

వందనాలు నాన్నా

తోడు నీవు నిలిచావూ

నేను 'వదిలి ' వచ్చిన పని

నీవు పూర్తిచేశావూ..!

గుండెముక్కలౌతున్నా

మెగాఫోను పట్టావూ

నేను కన్న 'తీపికలను '

కావ్యంగా మలిచావు..!

´´´

నేను 'పొంద 'లేనిదాన్ని

ఇతరులు అయినా పొందే

అవకాశం ఇవ్వాలని

ప్రతిన ఒకటి పూనావూ!.

నాలాగే సరికొత్తగ

చలన 'చిత్ర 'లోకంలో

తమ 'ప్రజ్న 'ను చూపుకుంటె

అదే చాలునన్నావు!

´´´

నా పేరిట.. నా గుర్తుగ

'పురస్కార ' మొకటి చేయ

సంకల్పము చేశావూ

తగిన 'వనరు 'లిచ్చావు!

దిగులు..గుబులు ఇంకేలా

'నా ' కోరిక తీరగా

వత్సరానికొక రోజున

నేను 'మిమ్ము 'కలువగా!

ఇసుక మేడ కూలినచో

బాధపడుట దండగ

కలల అలల ఊయలలో

'ఆత్మ' తేలుచుండగా!

´´´

వత్సరానికొకరోజున

మరలా ప్రభవించనా

'ప్రతిభ ' చూపు 'దర్శ'కులను

ఆకసానికెత్తనా!

´´´

నేనున్నా లేకున్నా

నా వారలు ఉన్నారు!

మీ శ్వాసలో ...మీ గెలుపులో

నన్ను 'చూసు'కుంటారు!

´´´

ఇరుకు ఇరుకు శరీరాన

'నాడు ' నేను బ్రతికున్నా..

విశ్వవ్యాప్తమై 'నేడు'

మీలో జీవిస్తున్నా!

సెలవా మరి ఇక ఉంటా

మరోసారి కలుస్తా

మిమ్మలనలరించేలా

'మరో 'కలని నే తెస్తా...!

ఇట్లు

మీ శ్రీనివాస్ గొల్లపూడి

విన్నది

భువన చంద్ర

Monday, August 9, 2010

తాళం చెవుల కథ

దేశంలో ప్రజాభిప్రాయం రెండుగా చీలిపోయిన అతి విచిత్రమైన సంకట పరిస్థితి గతవారమే తలెత్తింది. స్థూలంగా చెప్పుకుందాం. భారతదేశంలో మొట్టమొదటిసారిగా మరో నలభై రోజుల్లో కామన్వెల్తు క్రీడలు జరగనున్నాయి. ఇందుకుగాను రకరకాలయిన కార్యక్రమాలకి 65 వేల కోట్లు ఖర్చవుతున్నాయి. ఇందులో సూటిగా క్రీడల కయ్యే ఖర్చు కొంత, క్రీడలు కారణంగా రోడ్లు, నగరం, వసతుల ఏర్పాట్ల ఖర్చులు కొన్ని. క్రీడలు కారణంగా ఇవన్నీ మెరుగవుతాయి. కనుక కొంత ఖర్చు - 'వీరయ్య పెళ్ళిలో పేరయ్యకి జందెం పోచ' సామెతగా కలిసి వస్తుంది.
పూర్తిగా చదవండి


Monday, August 2, 2010

చట్టం బలవంతుడి తొత్తు

చాలా సంవత్సరాల క్రితం ఇండియా పాకిస్థాన్ మధ్య యుద్ధం ముగిసాక దూరదర్శన్ లో ప్రతి ఆదివారం అద్భుతమయిన సీరీస్ ని ప్రసారం చేశారు. యుద్ధంలో మరణించిన జవాన్ల కథలు. ప్రతీవారం అంత గొప్ప యువత దేశం కోసం ప్రాణాలర్పించినందుకు గర్వపడి, అంత గొప్ప బిడ్డని పోగొట్టుకున్నందుకు కుటుంబంతో కంటతడి పెట్టుకోని వారం ఉండేది కాదు. దూరదర్శన్ చరిత్రలో ప్రసారం చేసిన గొప్ప సిరీస్ లో అవి ఒకటి.