Monday, July 27, 2009

ఉంగరం గరంగరాలు

ఈ మధ్య తమిళనాడులో అద్భుతమైన వితరణ జరుగుతోంది. నిన్నకాక మొన్ననే తమిళనాడు ఉపముఖ్య మంత్రి స్టాలిన్ గారు3.67 లక్షల ఖర్చుతో 250 ఉంగరాలను పంచారు. ఎందుకు? తల్లిదండ్రులు తమ పిల్లలకు తమిళ పేర్లను పెట్టుకుంటే ఒక ఉంగరం యిస్తారు. మొదటి విడతలో తమిళరసి, తమిళరసు, తమిళ చెల్వన్, ఇళక్కియ, తెన్ మొళి, అరవిందన్, మణిమేఖలై-యిలాంటి రకరకాల పేర్లతో తమ పిల్లలకు బారసాలలు చేసి తల్లిదండ్రులు ఆనందంగా ఉంగరాలు సంపాదించుకున్నారు.

Thursday, July 23, 2009

జుజుమురా

ఇది నేను దాదాపు 38 సంవత్సరాల క్రిందట వ్రాసిన కథ. అనేక మంది అభిమానులని సంఫాదించి పెట్టిన ఈ కథని బ్లాగులోకం మిత్రులతో పంచుకుంటున్నాను.
పూర్తి కథ

Wednesday, July 22, 2009

డైరీలో కొన్ని పేజీలు

1962 - జూన్ 16ఆర్ట్ లవర్స్ యూనియన్ పోటీల్లో 'ఆశయాలకు సంకెళ్ళు ' ప్రదర్శనం . సి.ఎస్.ఆర్ వచ్చారు. డిక్షన్, రచనని మెచ్చుకున్నారు. బి.కె. రావు గారున్నారు ప్రేక్షకుల్లో..
పూర్తిగా చదవండి..

Monday, July 20, 2009

కొవ్వలి- వెయ్యి నవలల రచయిత

నవలలలో తనదైన ముద్రని వేసిన ఓ నవలాచక్రవర్తి కధ
పూర్తి వ్యాసం

THE JOURNEY-POEM

In the path you tread
Stretches the lonely night
The morning is sleeping
On the other side of the hills,
That stretch their long arms of shadows-
The stars are counting minutes
They are whispering wordless joy
And waiting to hear your footsteps
The moon is swimming through
Shady clouds-searching his path-
Even if your eyes cannot find your way
Walk on wherever softness touches your feet
I kissed the dust on your naked path
So that your feet can sense my touch
A memory your lips shared before-
(3.9.76)

ఆనందం ఖరీదు-ఆలోచన

చాలామంది ఆనందానికీ, ఖరీదుకీ లంకె వుంటుంది. ఖరీదయిన కారూ, ఖరీదయిన సూటూ, ఖరీదయిన భోజనం,ఖరీదయిన పరుపూ- మీ యిష్టం -ఏదయినా దాని చివర వున్న చీటీని బట్టి మనస్సులో ఆన్ందానికి తూకం వుంటుంది. మా ఆవిడ షాపులో చీరెల రంగులూ, నాణ్యాన్ని చూసే ముందు ధరని చూస్తుంది. ఖరీదు నాలుగంకెల్లో వున్నాక- ఆమెకి మెల్లగా చీరె నచ్చడం ప్రారంభిస్తుంది. ఆ తరువాతే రంగు, మన్నికా వగైరా. ఓసారి నేను తెచ్చిన చీరెని ఆనందంగా అందుకుంది. తృప్తిగా కట్టుకుంది. ఖరీదుని దాచి నెలరోజుల తర్వాత చెప్పాను-ఫలానా మార్కెట్లో చవకగా తీసుకున్నానని. ఆ క్షణం నుంచీ ఆ చీరెమీద ఆమెకి మక్కువ పోయింది.
పూర్తి కాలం

Friday, July 17, 2009

చీమకుట్టిన విప్లవం

ఒక విధంగా పాత కథే! కానీ ఈ కొత్త అన్యాయం అందరూ వినదగ్గది. నేటి రాజకీయమైన బ్లాక్ మెయిల్ ని కుండబద్దలు కొట్టినట్టు విశ్లేషించేదీనూ..
పూర్తి కాలమ్..