Thursday, October 30, 2014

మరో గాంధీగిరి

ఈ వారమ్  జీవనకాలమ్ - సాక్షి దినపత్రిక నుంచి...
కౌముది ఆడియోతో కలిపి...

పూర్తిగా చదవండి

Tuesday, October 14, 2014

విజ్ఞానం – విశ్వాసం

...... చిన్నప్పుడు తేలు కుడితే మా నాన్నగారు నన్ను విశాఖపట్నంలో మంగళగిరి సీతారామయ్యగారింటికి తీసుకువెళ్ళడం గుర్తుంది. ఆయన నా ముందు కూర్చుని పెదాలు కదుపుతూ ఏదో వర్ణించేవాడు. నాకు భయంకరమైన బాధ. తర్వాత నన్ను నోరు తెరవమని నోట్లో ఏదో వేసాడు. విచిత్రం మరో పదినిముషాలకు బాధ తగ్గడం ప్రారంభించేది. ఇప్పుడాలోచిస్తే సీతారామయ్యగారు రెండు స్థాయిలలో వైద్యం చేశాడు. 'మంత్రాలకు చింతకాయలు రాలుతాయి ' అనే విశ్వాసాన్ని పునరుద్దరించాడు. నొప్పికి అసలు మందు ఏదో ఇచ్చాడు. మందు వల్ల నొప్పి పోయింది. మంత్రం వల్ల విశ్వాసం బతికింది. ఇది అపూర్వమైన చికిత్స....

Wednesday, October 8, 2014

అంతరిక్షంలో అద్భుతం


నేను ఆనర్స్ చదువుకునే రోజుల్లో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అణుశాస్త్ర విభాగాన్ని ప్రారంభించారు. దాని ఆచార్యుడిగా ఆయన్ని ఆహ్వానించారు. ఆయన పేరు స్వామి జ్ఞానానంద. సన్యాసం స్వీకరించకముందు ఆయన లౌకిక నామం భూపతిరాజు లక్ష్మీ నరసింహరాజు. ఆయన సన్యసించి హిమాలయాల్లో పదేళ్ళు గడిపి, తపస్సు చేసుకుని - 1936లో అణుశాస్త్రంలో పరిశోధనలు జరిపి, జర్మనీలో పనిచేసి, మిచిగన్ విశ్వవిద్యాలయంలో పనిచేసి భారతదేశానికి వచ్చారు.
పూర్తిగా చదవండి 
  

Monday, September 29, 2014

ఓ ఉద్యమం అస్తమయం



29 సంవత్సరాల కిందట ఓ 16 ఏళ్ల కుర్రాడికి మిత్రులు రమణయ్య రాజాగారు రాజాలక్ష్మి ఫౌండేషన్‌ పురస్కారం యిస్తున్నప్పుడు నేను ఆడియన్స్‌లో ఉన్నాను. మాండలిన్‌ శ్రీనివాస్‌ గురించి అప్పటికి నేను వినలేదు. రాజాగారికి మతిపోయిందా అనుకున్నాను.
పూర్తిగా చదవండి 

Monday, September 22, 2014

మంచి - మతం


సరిగ్గా ఏభై సంవత్సరాల క్రితం ఎన్టీ రామారావు గారి నట జీవితాన్ని పెద్ద మలుపు తిప్పిన ''నిప్పులాంటి మనిషి'' సినీమా రాశాను. క్లైమాక్స్‌లో పోలీసు ఇనస్పెక్టర్‌ (ప్రభాకరరెడ్డి) అంటాడు -ముగ్గురు వీరుల్ని -విజయ్‌ (ఎన్టీఆర్‌), షేర్‌ ఖాన్‌ (కైకాల), డిసౌజా (రేలంగి) -చూసి: ''ఒకరు హిందువు, ఒకరు ముస్లిం, ఒకరు క్రిస్టియన్‌'' అని.
హీరో సమాధానం: ''మంచితనానికి మతం లేదు ఇనస్పెక్టర్‌. కన్నీరు ఎవరు కార్చినా అది కష్టానికి గుర్తే...'' ఇది నా కిష్టమయిన, నేను రాసిన డైలాగ్‌.
పూర్తిగా చదవండి 

Sunday, September 14, 2014

ముద్దుకి వేలం

ఈవారంతో కౌముదిలో ఆరు సంవత్సరాలు పూర్తిచేసుకుంటున్న  గొల్లపూడి కాలమ్
----------------------------------------------------------------------------------
 
ఈమధ్య కెనడాలో 49 ఏళ్ల సినీతార ముద్దుని వేలం వేయగా 48 లక్షల రూపాయలు వచ్చింది. ఆ ముద్దుని ఎల్టన్‌ జాన్‌ ఎయిడ్స్‌ సంస్థ విరాళం కోసం వేలం వేశారు. ఇంగ్లండ్‌ మోడల్‌, నటీమణి ఎలిజబెత్‌ హర్లీ ఈ ముద్దుని పెట్టుబడి పెట్టింది. ప్రముఖ భారత కెనేడియన్‌ వ్యాపారవేత్త జూలియన్‌ భారతీ 48 లక్షలు చెల్లించి ముద్దుని కొనుక్కుని పదిమంది మధ్య ముఖ్యంగా భార్య సమక్షంలోనే ఎలిజబెత్‌ హర్లీని గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు. ఈ ముద్దుకి సామాజికమయిన ప్రయోజనం ఉంది కనుక -ఆయన బార్య అంతగా బాధ పడలేదట.
 పూర్తిగా చదవండి.

Sunday, September 7, 2014

ఓ చరిత్రకి తెర

ఓ గొప్ప చరిత్రకి తెరపడింది. దాదాపు ఆరు దశాబ్దాలు చిరునవ్వుకీ, చిత్తశుద్ధికీ, రమ్యతకీ, నవ్యతకీ, తెలుగుదనానికీ, వెలుగుదనానికీ, భక్తికీ, రక్తికీ చిరునామాగా నిలిచిన ఇద్దరు జీనియస్‌లు -బాపూ, ముళ్లపూడి శకం ముగిసింది. ఈ తరంలో బహుశా ఇంత విస్తృతంగా, ఇంత గొప్పగా తెలుగుదేశాన్ని ప్రభావితం చేసిన జంట మరొకటి లేదేమో! 

Monday, September 1, 2014

ఆశ్లీలం - బూతు

సృష్టిలో చాలా అసహ్యకరమైన దృశ్యం -నగ్నత్వం. అందునా మిక్కిలి అసహ్యకరం -స్త్రీ నగ్నత్వం. కనుకనే ప్రపంచంలో కళాకారులు వారు శిల్పులయినా, చిత్రకారులయినా, ఫొటోగ్రాఫరులయినా స్త్రీ నగ్నత్వాన్ని దృశ్యరూపం చెయ్యడాన్ని ఛాలెంజ్‌గా తీసుకుంటారు.
 పూర్తిగా చదవండి

Monday, August 25, 2014

'భారతరత్న ' సంతర్పణ

     ఈ మధ్య 'భారతరత్న' పురస్కారం మీద మనదేశంలో మోజు బాగా పెరిగింది. నిజానికి 'భారతరత్న' నిజమైన భారతరత్నలకు అందని సందర్భాలెన్నో ఉన్నాయి. మైనారిటీలను దువ్వడానికో, ఆయా పార్టీలను సంతోషపరచడానికో, వోట్ల బాంకులను కాపాడుకోడానికో, మరేవో రాజకీయ కారణాలకో 'భారతరత్న'లను పంచే రోజులు చాలాకాలం కిందటే వచ్చాయి. సుప్రీంకోర్టు కనీసం రెండుసార్లు ఈ 'భారతరత్న' వితరణను ఆపుజేసింది
పూర్తిగా చదవండి 

Sunday, August 17, 2014

జైహింద్

ఈ దేశానికి స్వాతంత్య్రం వచ్చి 67 సంవత్సరాలయింది. ఒక వ్యక్తి జీవితంలో అది వృద్ధాప్యం. ఒక వ్యవస్థ జీవనంలో అది పరిణతి. ఈ 67 ఏళ్లలో ఏం జరిగింది? ప్రజాస్వామ్యాన్ని ఆసరాగా చేసుకుని దేశాన్ని దోచుకునే బెల్లింపునీ, చాకచక్యాన్నీ పెంచుకునే శక్తులు రెచ్చిపోయి, మెజారిటీని బలం చేసుకుని రెచ్చిపోయే రోజులొచ్చాయి. ఈ దేశంలో మకుటాయమానంగా నిలవగల ఒక కార్పొరేట్‌ సంస్థ అధిపతి సహారా సుబ్రతా రాయ్‌ దేశానికి కోట్ల రూపాయలు బాకీపడి గత రెండు నెలలుగా జైల్లో ఉన్నారు. అలాంటి పనిచేసిన మరొక కార్పొరేట్‌ సంస్థ అధిపతి సత్యం రామలింగరాజు- కొన్ని సంవత్సరాలు జైల్లో ఉన్నారు.
పూర్తిగా చదవండి 

Monday, August 11, 2014

మాటకి తెరలు


ఆఫ్రికా మేక తెలుగు మేకతో తనగోడు చెప్పుకోలేదు. తమిళం ఎద్దు హిందీ ఎద్దు కష్టసుఖాలను అర్థం చేసుకోలేదు. కాని ఆఫ్రికా మనిషి -కాస్త ప్రయత్నిస్తే తెలుగు మనిషితో మాట్లాడగలడు. తమిళం మనిషి హిందీ మనిషి కష్టసుఖాలను తెలుసుకోగలడు. తెలుసుకోగలగడమే సమిష్టి జీవనం అర్థం. ప్రయోజనం. అవకాశం కూడా. జాతి సమైక్యంగా ఉండాలంటే అందరూ ఒక ఆలోచన చెయ్యకపోయినా, చెయ్యలేకపోయినా -ఒక భాష మాట్లాడాలి.
పూర్తిగా చదవండి..
 

Sunday, August 3, 2014

అధికారం అభిమానం

ఓ తెల్లవారుఝామున హైదరాబాద్‌ ఎయిర్‌ పోర్టులో ఒకాయన పెద్ద పెద్ద కేకలు పెడుతూంటే విమానాశ్రయం అంతా షాక్‌ అయి చూసింది. ఆయన రాజకీయ నాయకుడు. రాత్రి తాగిన మందు దిగక -పొద్దుటే నిద్రమత్తులో ఎయిర్‌ పోర్టుకి వచ్చారు. వ్యక్తుల్ని తణిఖీ చేసే ఉద్యోగి ఉత్తర హిందూదేశంవాడు. ఈయన గొప్పతనం తెలీదు. జేబులు తణిఖీ చేస్తున్నాడు. అతనిమీద ఒంటికాలుతో లేచాడు. అదీ సీను. అమెరికాలో మన రాష్ట్రపతి అబ్దుల్‌ కలాంగారిని రెండుసార్లు ఇలా తణిఖీ చేసిన విషయం విన్నాం. ఆయన చెప్పలేదు. మరెవరో చెప్పారు.
పూర్తిగా చదవండి

Monday, July 28, 2014

కథలూ - కళలూ

ఏమిటి ఈ దేశ సంస్కృతి వైభవం? సానియా ముస్లిం అమ్మాయా? పాకిస్థానీ కోడలా? ఫలానా కుర్రాడు ఆంధ్రా కుర్రాడా? అతనికి తెలంగాణా డబ్బు చెల్లించాలా? ఆంధ్రా అడ్రసు ఉన్న నీళ్లనీ, కావేరీ అడ్రసు ఉన్న నీళ్లనీ గుర్తులు పెట్టుకోడానికి మల్లగుల్లాలు పడుతున్న ఈనాటి నేపథ్యంలో కేవలం 'విలువలు' ప్రాతిపదికగా ఆసేతు హిమాచలం ఈ జాతిని ఏకీకృతం చేసిన దేమిటి?
పూర్తిగా చదవండి

Sunday, July 20, 2014

పెద్దల పెద్ద తప్పులు

ఈ కాలమ్‌లో ఒక్క వాక్యం కూడా నా మాటకాదు. కేవలం జరిగిన విషయాల్ని పత్రికల్లో చదివింది చదివినట్టు చెప్పే ప్రయత్నం మాత్రం.
మొన్న బీహార్‌లో వినయ్‌ బిహారీ అనే ఓ మంత్రిగారు మొబైల్‌ ఫోన్లలో సినీమాలు చూడడంవల్లా, మాంసాహారం తినడం వల్లా మన:ప్రవృత్తిలో ఉద్రేకాల్ని రెచ్చగొట్టే ధోరణి పెరుగుతుందని, తద్వారా స్త్రీల మీద దౌర్జన్యాలు పెరుగుతున్నాయని అన్నారు. ఇలాంటి మాటే ఓ గోవా మంత్రిగారు అన్నారు. పాలీగంజ్‌ ఎమ్మెల్యే ఉషా విద్యార్థి అన్నారు కదా? ''ఈ మంత్రిగారి భాషణ నాన్సెన్స్‌. మొబైల్‌ ఫోన్లవల్లా, మాంసాహారం వల్లా రేపులు జరగవు. పిల్లల పెంపకం లోపం వల్ల జరుగుతాయి'' అని. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్నేహితులు వారికి మంచి బుద్ధి నేర్పాలన్నారు. పాట్నా విశ్వవిద్యాలయ విద్యార్థినాయకుడు ఈ మంత్రి యువతకి క్షమాపణ చెప్పాలన్నారు. ''సొల్లు కబుర్లు చెప్పకు. నీపని నువ్వు చూసుకోవయ్యా'' అని మంత్రికి హితవు చెప్పారు.
పూర్తిగా చదవండి 

Sunday, July 13, 2014

హిందుత్వ బడ్జెట్

ఈ మధ్య బిజెపి ప్రభుత్వం ప్రతిపాదించిన బడ్జెట్‌ మీద జరిగిన విమర్శలలోకల్లా నాకు బాగా నచ్చిన విమర్శ -అది బొత్తిగా హిందుత్వ వాసన కొడుతున్న బడ్జెట్‌ అన్నది.
మన దేశంలో ఎందరో మేధావులు ఉన్నారు. మతాతీత దృక్పథంతో రాజకీయాలతో ప్రమేయం లేని తటస్థులు ఉన్నారు. మతం అంటే మండిపడే పాత్రికేయులున్నారు. వారంతా మహానుభావులు. వారిని దృష్టిలో పెట్టుకోకుండా ఈ ప్రభుత్వం హిందుత్వ బడ్జెట్‌ ప్రతిపాదించడం అన్యాయం. కుట్ర.
ఏమిటా హిందుత్వ ఛాయలు?
పూర్తిగా చదవండి

Sunday, July 6, 2014

మదర్ మమతా

కిందటి వారం ఒక్కరోజు కలకత్తాలో ఉండడం తటస్థించింది. ఆ 24 గంటలూ రాజకీయవాతావరణం అక్కడ అట్టుడికినట్టు ఉడికిపోయింది. కారణం -తృణమూల్‌ కాంగ్రెస్‌ రాజకీయనాయకుడు, (నేనూ సిగ్గుతో తలవొంచుకోవలసిన కారణం) సినీనటుడు తపస్‌ పాల్‌ తన పార్టీ కార్యకర్తలను ఎదిరించే వారిళ్లకు తమ కార్యకర్తల్ని పంపించి వాళ్ల భార్యల్ని రేప్‌ చేయిస్తామని ఒక బహిరంగ సభలో పేర్కొన్నారు.
పూర్తిగా చదవండి  

Sunday, June 29, 2014

బరితెగించిన బూతు

  ఈ వ్యాపార ప్రకటనని ఇప్పుడిప్పుడు టీవీ ప్రేక్షకులు రోజూ చూస్తూనే ఉంటారు. ఇంటి హాలులో -పడకగదిలోకాదు -ఒక యువతిమీద ఒక కుర్రాడు సోఫాలో పడుకుని ఉన్నాడు. హఠాత్తుగా వీధి తలుపు చప్పుడయింది. అమ్మాయి స్నేహితుడిని మీద నుంచి కిందకి తోసేసింది. కుర్రాడికి పారిపోయే అవకాశంలేదు. తండ్రి చర్రున లోపలికి వచ్చేశాడు...
పూర్తిగా చదవండి..

Sunday, June 22, 2014

ది బ్యూటిఫుల్ గేమ్

 ప్రపంచంలో మన ప్రాంతాలలో క్రికెట్‌ ఒక జీవన విధానం. అదిలేని జీవితాన్ని మనం ఈ రోజుల్లో ఊహించలేం. క్రికెట్‌కి ప్రత్యేకమైన ఛానళ్లు, ప్రత్యేకమైన అభిమానులూ, దానికి మాత్రమే సంబంధించిన అవినీతులూ ఈ దేశంలో వెల్లివిరుస్తున్నాయి. కాని మన దేశానికి అంతగా అర్థంకాని, ప్రపంచ దేశాలలో ఊహించలేని ప్రాముఖ్యం ఉన్న ఆట -బంతి ఆట. .....
పూర్తిగా చదవండి 

Sunday, June 8, 2014

తెగిపోయిన జ్నాపకాలు

రెండు రాష్ట్రాలుగా విడిపోయిన రెండింటిలో ఎన్నో సమస్యలు, ఎన్నో సౌకర్యాలు, మరెన్నో సర్దుబాట్లు తప్పనిసరికావచ్చు. తప్పదు. ఈ దేశం రెండుగా విడిపోయినప్పుడు -సరిహద్దుల్లో ఒక అమ్మాయి చదువుకునే బడి పొరుగుదేశంలో ఉండిపోయింది. ఆమె ప్రతీరోజూ స్కూలుకి వెళ్లిరావాలి. అంటే సరిహద్దుదాటి పొరుగుదేశానికి వెళ్లాలి. ఆమెని ఇటు ఉద్యోగులు అప్పగిస్తే అటుపక్క ఉద్యోగులు ఆమెని స్కూలు దగ్గర వదిలిపెట్టి మళ్లీ సరిహద్దుకి తీసుకువచ్చి అప్పగించేవారు. ఒకావిడ పుట్టిల్లు పొరుగు దేశంలో ఉండిపోయింది. నాకు సంబంధించినంతవరకూ నా గొప్ప జ్ఞాపకాలన్నీ పొరుగు రాష్ట్రంలో ఉండిపోయాయి.
పూర్తిగా చదవండి

Monday, June 2, 2014

చరిత్ర తప్పటడుగులు

ఈ వారం గొల్లపూడి కాలమ్
----------------------
   మానవ జీవన గమనాన్ని నిర్దేశించడంలో చరిత్ర తిరుగులేని నియంత. తనదైన బాణీ, ధోరణీ, సరళీ, స్వారస్యం వున్న గమనం చరిత్రది. చరిత్ర అర్థంకాని విదేశీ లిపి -అన్నాడో -కవి. ఎప్పుడో కాలం గడిచాక -వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు -వేడుకగా ఎకసెక్కం చేసే వింత వినోదం చరిత్రది.
పూర్తిగా చదవండిః 

Sunday, May 11, 2014

అసలు కాదు కొసరు..

.....కాన్బెరాలో శాసనసభా భవనం మీద ఒక దీపం ఉంది. శాసనసభ జరుగుతున్నప్పుడు ఆ దీపం వెలుగుతుంది. దారినపోయే ఏ పౌరుడయినా నిరభ్యంతరంగా వచ్చి అతిధుల గాలరీలో కూర్చుని తాను ఎన్నుకున్న ప్రతినిధులు ఏం చేస్తున్నారో నిరభ్యంతరంగా చూడవచ్చు. నేనలా లండన్‌లో కామన్స్‌ సభలో కూర్చుని వచ్చాను. కాని మనదేశంలో మన నాయకులు దీపాలు ఆర్పేసి, సభ్యుల్ని చీకట్లో ఉంచి తాము ఆశించిన నిర్ణయాన్ని మనకు చెప్తారు. మన పార్లమెంటులో జొరబడడానికి ఒక్కరికే అవకాశముంది -దౌర్జన్యకారులకి! అది మన తలరాత...
పూర్తిగా చదవండి..

Monday, May 5, 2014

ఉపశమనం


ఎండలు మండిపోతున్నాయి. వేసవికాలాన్ని తట్టుకుని భరించడానికి భగవంతుడు రెండు ఉపశమనాల్ని ఇచ్చాడు. మామిడికాయ, మల్లెపువ్వు. ఆంధ్రు డు భోజనప్రియుడు. మామిడికాయతో చెయ్యగలిగినన్ని వంటకాలు, చూపించగలిగినన్ని రుచులు మరే విధంగానూ సాధ్యంకావు. వేసవికాలంలో తలనిండా మల్లెపువ్వులు తురుముకోని ఆడపిల్ల కనిపించదు
పూర్తిగా చదవండి..

Sunday, April 27, 2014

ఎన్నిక(ల)లు!

    నేను తేలికగా 51 సంవత్సరాలుగా సినీరంగంలో ఉన్నాను. రచనలు చేశాను. నటించాను. గొప్ప గొప్ప సినీమాలను చూశాను. కళ్లముందు పంచ రంగుల కలల్ని ఆవిష్కరించే అతి ఆకర్షణీయమైన మాధ్యమం సినీమా అని మొన్న మొన్నటిదాకా నమ్మాను. కాని ఆ నమ్మకం ఇప్పుడిప్పుడే సడలిపోయింది. సినీమా కంటే -కళ్ల ముందు వెయ్యి రంగుల కలల్ని ఆవిష్కరించగలిగిన శక్తీ, సామర్థ్యం వున్నది రాజకీయరంగమని, ఏ నటుడూ రాజకీయ నాయకునికి సాటిరాడని ఇప్పుడిప్పుడే రుజువవుతోంది.

Sunday, April 20, 2014

కాశీ మామయ్యలు

ఇటీవల ఒక దినపత్రికలో ఒక ప్రకటనని చూశాను -'కనబడుటలేదు' అంటూ. ఏలూరు వోటర్లు నగరంలో గోడల మీద ఈ ప్రకటనని అంటించారట. ''మా ఏలూరు లోక్‌సభ ప్రతినిధిగా మేము ఎన్నుకున్న ఎం.పి., కేంద్ర మంత్రి... గత కొన్ని రోజులుగా కనిపించుటలేదు. వారి ఆచూకీ తెలిపిన -వారికి తగిన బుద్ధి చెప్పబడును'' -ఇదీ ప్రకటన.
పూర్తిగా చదవండి

Tuesday, April 15, 2014

బూతు పురాణం!

కాంగ్రెసుని దారుణంగా దుయ్యబట్టే కార్యక్రమాన్ని ఈ మధ్య ఛానల్లో చూశాను. ఇటీవల కాంగ్రెసు మీద ఎవరు దుమ్మెత్తిపోసినా అది ప్రేక్షకులకు ఆనందాన్ని కలిగిస్తోంది సమృద్దిగా. ఆ అమ్మాయికి పాపం -తెలుగురాదు. ఆ విధంగా టీవీ ఏంకరు కావడానికి మొదటి అర్హతను సంపాదించుకుంది. ఆమె మాటకన్నా - మాట్లాడే విషయం రాణిస్తోంది కనుక - ప్రేక్షకులు ఆమెని భరిస్తున్నారు.
పూర్తిగా చదవండి

Monday, April 7, 2014

నీ బాంచెన్, కాల్మొక్కుతా


ఈసారి ఎన్నికలలో నన్ను గొప్పగా ఆకర్షించిన ఎడ్వర్టైజ్‌మెంట్‌ -కాంగ్రెస్‌ది. మేడమ్‌ సోనియా గాంధీ ఓ నేలబారు పల్లెటూరు ముసలమ్మని చిరునవ్వుతో కావలించుకోవడం అతి అపురూపమైన, అరుదైన సుందర దృశ్యం. నేను సినిమా నటుడిని. నా ఉద్దేశంలో ఈ పల్లెటూరి మనిషి -ఏ సినిమా నటో కావచ్చు
పూర్తిగా చదవండి

Sunday, March 30, 2014

దేవుడు క్షమించుగాక!

  గత సోమవారం శ్రీలంక నెదర్లాండ్‌ల ఆట ముగించే సమయానికి ముందుగానే టీ20 క్రికెట్‌ ఆటలో ఓడించింది. ఇంకేం చెయ్యాలో తెలీక నాకు చాలా యిష్టమైన ఛానల్‌ 'టైమ్స్‌ నౌ'కి వెళ్లాను. అప్పుడే శ్రీరామ సేన నాయకులు ప్రమోద్‌ ముతాలిక్‌ గారి వీరంగాన్ని చూసే అదృష్టం కలిగింది. అయ్యో! కాస్తముందుగానే ఈ అదృష్టాన్ని పుంజుకోలేకపోయానే అని బాధపడుతూ ఈ వినోద ప్రదర్శనని తిలకించాను.
పూర్తిగా చదవండి

Sunday, March 23, 2014

ముసుగుల్లో నాయకులు

ఈ మధ్య షూటింగుకి రాజమండ్రికి వచ్చాను. అక్కడ ప్రతీ వీధి జంక్షన్‌లోనూ కనిపించిన దృశ్యం నాయకుల విగ్రహాల మీద ముసుగులు. మా మిత్రుడిని అడిగాను -కారణమేమిటని. ఎన్నికల నిబంధనలు -అన్నాడాయన. పాపం, మన నాయకులు -తమ ప్రచారానికి విగ్రహాల్ని ప్రతిష్టించారు. 
పూర్తిగా చదవండి

Sunday, March 16, 2014

మళ్ళీ అవినీతికి పెద్దపీట

ఈ దేశంలో రాజకీయ నాయకుడు అన్నిటికీ తెగించి అయినా ఉండాలి లేదా వోటరు ఉత్త తెలివితక్కువ దద్దమ్మ అనయినా అనుకొని ఉండాలి. వోటరు కన్ను కప్పి ఏపనయినా చెయ్యవచ్చుననే కుత్సితపు ధీమాతో ఉండి ఉండాలి. లేదా వోటరుకి మరో గతి లేదన్న అలసత్వమయినా పెంచుకుని ఉండాలి. ఈ వ్యవస్థ బలహీనతల్ని కాచి వడబోసి అయినా ఉండాలి.
పూర్తిగా చదవండి

Sunday, March 9, 2014

XXX

నా ఆరోగ్య రహస్యం నేనెప్పుడూ తెలుగు ఛానల్స్‌ చూడను. అందువల్ల ముఖ్యంగా మనశ్శాంతి, అదనంగా ఆరోగ్యం కలిసివచ్చింది. కారణం ఛానల్స్‌లో జరిగేది ఎక్కువగా వ్యాపారం. సినిమాల సంగతి సరే. ఛానల్స్‌ కూడా ప్రేక్షకులకి కావాల్సిన ప్రోగ్రాంలు పంచే వ్యాపారాన్నే సాగిస్తున్నాయి. వాటిపని కేవలం అమ్మకం. 
పూర్తిగా చదవండి

Sunday, March 2, 2014

'నపుంసక ' పుంసత్వం ..!


రాజకీయ సిద్ధాంతాలు, సామాజిక బాధ్యత, ప్రజా సంక్షేమం, నైతిక విలువలు వంటి పదాలు రాజకీయ రంగంలో బూతుమాటలయి ఎన్నాళ్లయింది? ఈ మధ్య ఏ నాయకులయినా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారా? పోనీ, అసలు ఇలాంటి మాటలకు వీరికి అర్థం తెలుసా?

పూర్తిగా చదవండి

Sunday, February 23, 2014

మిరియాల పిచికారీ

బిక్షాటనకు వెళ్లిన వటువు -బిక్ష యివ్వలేని యిల్లాలి నిస్సహాయతను ఎరిగి ఆమెకు లక్ష్మీకటాక్షాన్ని కల్పించిన అపూర్వమైన సంస్కృతి మనజాతిది. మిరియాల పిచ్చికారీతో పశ్చాత్తాపానికి లోనయి -లక్ష్యాన్నీ, సంస్కారాన్నీ నష్టపోయిన దయనీయత ఈనాటి జాతిది.

పూర్తిగా చదవండి - 

Sunday, February 16, 2014

ఓ నియంత ఆఖరి రోజులు

కొన్ని లక్షల మంది మారణహోమానికి కారణమయి, ఒక శతాబ్దపు దౌష్ట్యానికి, పాశవిక ప్రవృత్తికీ కారణమయిన ఓ నియంతకి ఇంత మర్యాద అక్కరలేదు నిజానికి. 'ఓ నియంత దిక్కుమాలిన చావు' -అన్నా సరిపోతుంది. కాని హిట్లర్‌ చావుని పదేపదే చరిత్ర గుర్తుచేసుకునే సందర్భాలు ఎక్కువ. చాలాకాలం క్రితం -హాలీవుడ్‌ ఓ గొప్ప చిత్రాన్ని నిర్మించింది. ''హిట్లర్‌ ఆఖరి రోజులు'' దాని పేరు. ప్రముఖ నటుడు ఎలెక్‌ గిన్నిస్‌ హిట్లర్‌ పాత్రని ధరించి -నటనకు ఆస్కార్‌ బహుమతిని పుచ్చుకున్న గుర్తు. మరొక మహానటుడు -ఆయన జీవితకాలంలోనే ఓ గొప్ప పారిహాసికని నిర్మించారు: చాప్లిన్‌ 'ది గ్రేట్‌ డిక్టేటర్‌'. ఎందుకని? ఎవరిని ఉద్ధరించడానికి ఈ చిత్రాలు? నిజానికి ఎందుకు ఈ కాలమ్‌? సమాధానం ఉంది.
పూర్తిగా చదవండి

Monday, February 10, 2014

"రేపు" కథలు

రేపుని తెలుసుకోవాలనుకోవడం మానవుని బలహీనత. అది తన గురించే అయితే ఆ బలహీనత వెర్రితలలు వేస్తుంది. అది స్వప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని తెలుసుకోవాలనుకుంటే ఇక ఆ రోగానికి అవధులు ఉండవు. ఈ ఒక్క కారణానికే మన దేశంలో జ్యోతిషాన్ని చాలామంది గబ్బుపట్టించారు. గ్రహాల గమనం, తత్కారణంగా భూమిమీదా, మానవుల మీదా వాటి ప్రభావం, ఏతావాతా ఇందువల్ల మానవునికి జరిగే ప్రయోజనానికీ సంబంధం ఒక దృష్టితో చూస్తే కనిపించకపోవచ్చు.....
పూర్తిగా చదవండి..
http://goo.gl/NYvSGE

Sunday, February 2, 2014

సత్తలేని దినములు.

.
 157 సంవత్సరాల కిందట త్యాగరాజస్వామి వాపోయిన తీరు ఇది. కలిలో ప్రథమ పాదంలోనే యిన్ని అనర్థాలు జరుగుతున్నాయన్నారు. 2014 లో ఆయా సందర్భాల విశ్వరూపాన్ని చూస్తున్నాం. ఇంకా ఇది కలిలో ప్రథమ పాదమే.
... పూర్తిగా చదవండి 

Sunday, January 26, 2014

స్థితప్రజ్ఞుడు

అక్కినేనిని 51 సంవత్సరాలుగా అతి సమీపంగా చూస్తున్నవాడిగా, 65 సంవత్సరాలుగా ఆయన చిత్రాలని అభిమానిస్తున్నవాడిగా -అక్కినేనిలో అతి విచిత్రమైన విపర్యయాలు కనిపిస్తాయినాకు. ఆయన దేవుడిని నమ్మరు. ఆయన యింట్లో గోడలకి దేవుడి పఠాలను చూసిన గుర్తులేదు. కాని దేవుడి పాత్రల్నీ, భక్తుల పాత్రల్నీ ఆయన నటించిన తన్మయత్వం, తాదాత్మ్యం అపూర్వం. కాళిదాసు, తుకారాం, నారదుడు, విప్రనారాయణ, భక్త జయదేవ -యిలా ఎన్నయినా ఉదాహరణలు మనస్సులో కదులుతాయి
పూర్తిగాచదవండి

అంజనమ్మకు నివాళి

నా జీవితంలో మొదటిసారిగా - నా ఎనిమిదో ఏట - విశాఖపట్నం మినర్వా టాకీసులో అంజనమ్మని చూశాను. ఆ సినీమా 'బాలరాజు '. అందులో ప్రముఖంగా ముగ్గురు నటీనటులు - అక్కినేని, ఎస్.వరలక్ష్మి, అంజలీదేవి. నా అదృష్టం ఏమిటంటే - నా జీవితంలో ఆ ముగ్గురితోనూ నటించే అవకాశం కలిసి వచ్చింది. మరో 14 సంవత్సరాలకు అక్కినేని కంపెనీ అన్నపూర్ణా సంస్థ ద్వారా సినీరంగ ప్రవేశం చేసి వారికి సంభాషణలు రాశాను. తర్వాతి కాలంలో వారితో ఎన్నో చిత్రాలలో నటించాను.
పూర్తిగా చదవండి

Thursday, January 16, 2014

మంచి పోలీసు - చెడ్డపోలీసు

మీరెప్పుడైనా గమనించారో లేదో మంచి పోలీసు - చెడ్డపోలీసు చాలా సరదా అయిన ఆటరోడ్డు మీద టోపీ లేకుండా వెళ్ళేమోటార్ సైకిల్ మనిషిని ఒక పోలీసు పట్టుకుంటాడునెలాఖరు రోజులుబేరం ప్రారంభమవుతుందిఅలాక్కాక - అవతలి మనిషి మంత్రిగారి వియ్యంకుడోఎమ్మెల్యే గారి బావమరిదో అయితే  పోలీసు ఇరుకులో పడతాడుఅప్పుడేమవుతుంది?

Wednesday, January 8, 2014

ఓ గొంతు - ఓ గర్జన

అరవై ఐదు సంవత్సరాలు కుళ్ళి, అహంకారంతో, స్వార్థంతో నేరచరిత్రతో గుండెలు దీసిన ధైర్యంతో చట్టాల్నీ, చట్టసభల్నీ కైవశం చేసుకుని దేశాన్ని దోచుకుతింటున్న పాలక వ్యవస్థలో కేవలం 9 నెలల్లో రూపు దిద్దుకుని --ప్రజల మద్దతుని సాధించి, మైనారిటీ వోటుతో మెజారిటీని నిరూపించుకోవడానికి అసెంబ్లీలో నిలబడిన- ఏనాడూ నిలబడాలని,నిలబడతానని ఊహించని ఓ సాదా సీదా నేలబారు ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ గొంతు విప్పితే ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది.
పూర్తిగా చదవండి