వెనకటికి ఒకాయన బెర్నార్డ్ షా నాటకాల్లో నీకు నచ్చిందేమిటని నాటకాల అభిమానిని అడిగాడట.
“ఆండ్రోకిస్ అండ్ ది లైన్” అన్నాడట అభిమాని.
“అందులో నీకు నచ్చిన పాత్ర?”
తడువుకోకుండా సమాధానం చెప్పాడట అభిమాని “సింహం” అని.
ఏ రచయితకయినా పాఠకుడి స్పందన ప్రాణప్రదం. రచన పదిమంది మనస్సుల్లో మెదలాలి. ఆయితే వారి స్పందన సూటిగా రచయితకి అందగలిగితే – ఆ ఆవకాశం గొప్పదీ, ఆశించదగ్గదీను. ఆ లక్ష్యంతోనే ఈ బ్లాగ్ ని ప్రారంభించడం జరిగింది. నా రచనలకీ, నా ఆభిప్రాయాలకీ, మీ ఆభిప్రాయాలకీ వేదిక ఈ బ్లాగ్. చక్కని సాహితీ సమాలోచనలకీ, చర్చలకీ ఇది చక్కని ఆవకాశం కాగలదని నా ఆశ. - గొల్లపూడి మారుతి రావు
వెనకటికి ఒకాయన బెర్నార్డ్ షా నాటకాల్లో నీకు నచ్చిందేమిటని నాటకాల అభిమానిని అడిగాడట.
“ఆండ్రోకిస్ అండ్ ది లైన్” అన్నాడట అభిమాని.
“అందులో నీకు నచ్చిన పాత్ర?”
తడువుకోకుండా సమాధానం చెప్పాడట అభిమాని “సింహం” అని.
ఈ తరంలోనే కాదు ఆ నాటి తరంలో కూడా చాలామందికి అంతగా తెలియని రేడియో తాతయ్య గురించి సాక్షి లో నేను వ్రాసిన వ్యాసాలు. ఇంతవరకూ మీరు చదివి ఉండకపోతే ఇప్పుడు చదవండి.
బహుశా ఎవరూ ఈ విషయాన్ని ఆలోచించి ఉండరు. మనల్ని ప్రతిరోజూ, ప్రతీ క్షణం ఎవరో ఒకరు దోచుకుంటున్నారు. నమ్మించి మోసం చేస్తున్నారు. మనల్నికాపాడవలసిన వాళ్ళే మనల్ని కబళిస్తున్నారు. పోలీసు స్టేషన్లో పోలీసులు మానభంగాలు చేస్తున్నారు. నిన్ననే చెన్నైలో పోలీసులు ఇన్ కమ్ టాక్స్ అధికారులుగా నటించి ఓ నగల వ్యాపారిని కొల్లగొట్టారు. రాజకీయ నాయకులు మోసాలు చేసి సమర్థించుకొంటున్నారు, అధికారులు లంచాలు తీసుకుని సమాజాన్ని గుల్ల చేస్తున్నారు. కాని మనిషి మనుగడ సజావుగా , ఏ పొరపొచ్చాలూ లేకుండా , నమ్మకంగా, తనగురించి ఆలోచించకపోయినా ఎటువంటి మోసమూ, కల్తీ లేకుండా మనకి సేవ చేసే శక్తి ఒకటి ఉంది. దాని పేరు ప్రకృతి.
పూర్తిగా చదవండి..