Sunday, December 25, 2011

వ్యక్తి - వ్యవస్థ

చాలా కాలంగా చాలామంది రాజకీయ నాయకుల మనస్సుల్లో ఉన్న భావమే నాకూ ఉండేది. సమాజంలో ఎంత అవినీతి పేరుకున్నా, దాని నిర్మూలన ఎంత అవసరమయినా-దేశంలో ఓ వ్యక్తి చేసే ఉద్యమమో, చెప్పే నినాదమో దాన్ని నిర్ణయించాలా? 543మంది సభ్యులున్న ప్రజా ప్రతినిధుల సభకు ఆ దక్షత లేదా? ఓ వ్యక్తి చేసే ఉద్యమం పాలక వ్యవస్థని బ్లాక్‌ మెయిల్‌ చెయ్యడం సబబా? యిలాంటి ఆలోచనలకు నా మనస్సు కూడా ఓటు వేసింది.
పూర్తిగా చదవండి

Sunday, December 18, 2011

Butchi Babu Story

'ముళ్ల' పెరియార్‌ భాగోతం

చెన్నైలో మాయింటికి ఎదురుగా ఓ ముసలాయన ఉండేవాడు. మా యింటి ఆవరణలో గన్నేరు, మందార పువ్వులు పూసేవి. ఉదయమే వచ్చి ఆ పువ్వులు కోసుకునేవాడు. ఎప్పుడైనా -మేం నిద్రలేవడం ఆలశ్యమయి, వీధి గేటు తీయడంలో జాప్యం జరిగితే కోపం తెచ్చుకునేవాడు -గేటు మూసేస్తారేమని.

Sunday, December 11, 2011

Mullapudi Venkata Ramana

స్వేఛ్చ

'స్వేచ్ఛ' అన్నది చాలా దుర్మార్గమైన విషయం. వివరించడానికి వీలులేనిదీను. ఎంత స్వేచ్ఛ? దేనికన్న స్వేచ్ఛ? ఎంతవరకూ స్వేచ్ఛ? ఎందుకు స్వేచ్ఛ -యిలా బోలెడన్ని మీమాంసలు.
ప్రజాస్వామ్యంలో మరో దుర్మార్గం ఉంది. దాని పేరు స్వేచ్ఛ. ఎవరికి వారు ఎవరి కిష్టమయింది, ఎవరికి సాధ్యమయింది చేసుకోవచ్చును. ఎంతవరకు? మిన్ను విరిగి మీదపడే వరకూనా? మూతిపళ్లు రాలే వరకూనా? మీదపడే దురవస్థల్ని ఎలా అరికట్టాలో తెలీక గింజుకునే వరకూనా?
పూర్తిగా చదవండి

Monday, December 5, 2011

ఒక 'ఏడుపు ' కథ

ప్రజాస్వామిక వ్యవస్థ బలం నాయకత్వం. ఒకనాటి నాయకత్వం ఆ నిజాన్ని నిరూపించింది. జవహర్‌లాల్‌ నెహ్రూ, వల్లభాయ్‌ పటేల్‌, మౌలానా అజాద్‌, గోవింద వల్లభ్‌పంత్‌, టంగుటూరి ప్రకాశం, భోగరాజు పట్టాభి సీతారామయ్య -యిలాగ. వీళ్లకి మద్దతుగా బ్రిటిష్‌ పాలన ఇచ్చిపోయిన మరొక గొప్ప వ్యవస్థ దన్నుగా నిలిచింది

Monday, November 28, 2011

Malathi Chandur Story - Laz Corner

నిజం వద్దు - అబద్ధం ముద్దు

ప్రపంచ ప్రఖ్యాత డచ్‌ చిత్రకారుడు రెంబ్రాంట్‌ ఒకమాట అన్నాడు: చిత్రాల్ని దగ్గరగా చూడకు. కంపుకొడతాయి -అని. చిత్రాల మాటేమోగాని ఈ మాట మనదేశంలో ప్రజా నాయకులకీ, డబ్బుని కూడవేసే చాలామంది పెద్దలకీ వర్తిస్తుంది.
పూర్తిగా చదవండి

Monday, November 21, 2011

Devulapalli Gari Story

దేవదూతలకు ఆహ్వానం

నేరం ఎప్పుడూ నిర్దయగా, కర్కశంగానే ఉంటుంది. అయితే జాలిగా, సానుభూతితో, కసితో పీకకోసే సందర్భాలూ, కథలూ ప్రపంచ సాహిత్యానికి దగ్గర తోవలు. గోవిందనిహలానీ 'ఆక్రోష్‌', కాళీపట్నం రామారావుగారి 'యజ్ఞం' ఇందుకు మచ్చుతునకలు. ఇవి మినహాయింపులు. మిగతా అన్ని సందర్భాల్లోనూ నేరం నేరమే. నేరానికి శిక్షకి రెండు పార్శ్వాలు. అలాంటి నేరం జరగకుండా 'శిక్ష' ఒక ఆంక్ష కావడం, చేసిన నేరస్థుడిని హింసించడం ద్వారా అలాంటి నేరం పునరుక్తి కాకుండా అరికట్టడం. ఇది ఆయా సమాజాలు సమష్టిగా ఏర్పరుచుకున్న వ్యవస్థలు. అదే న్యాయ వ్యవస్థ.

Sunday, November 13, 2011

Narendra Madhurananthakam

కడుపు చించుకుంటే

చాలా సంవత్సరాల కిందట నేనో ఆస్తిని కొన్నాను. రిజిస్ట్రేషన్‌ చార్జీలు కట్టింది పోగా మరో 30 లక్షలు చెల్లించాల్సి ఉంది. రూలు ప్రకారం అది అనవసరం. అన్యాయం. కనుక కోర్టుకి వెళ్లి ఆ మొత్తాన్ని తగ్గించే ప్రయత్నం చెయ్యవచ్చన్నారు లాయరు. ఇందువల్ల మరో లాభం. కేసు తేలేవరకూ డబ్బు చెల్లించనక్కరలేదు. ఈ వ్యవధిలో వడ్డీ పడదు. కోర్టులో కేసు వేశాను. 30 లక్షల బాకీ వుంచుతూ -ఒక ఆరు నెలలు చెల్లించడానికి గడువునిచ్చి ఆస్తిని రిజిస్టర్‌ చేశారు.

Sunday, November 6, 2011

Kaloji Narayana Rao Story

కర్ణుని పరివేదన

ఆయన తల్లిదండ్రులెవరో పురాణాల్ని బాగా తెలిసినవారు. పుట్టుక గొప్పదయినా
పెంపు తక్కువయిన కర్ణుడి పేరు కొడుక్కి పెట్టుకున్నారు. ఆయన దళితుడు. అయినా బాగా చదువుకుని న్యాయమూర్తి అయ్యారు. ప్రస్తుతం ఆయన తమిళనాడులో హైకోర్టు న్యాయమూర్తి

Monday, October 31, 2011

vandella kathaku vandanalu episode - 3 1_10_11

మిత్రులు అవసరాల

అవసరాల కాస్త ఆలస్యంగా నా జీవితంలో ప్రవేశించారు. ఆయన రచనలూను. అంతవరకూ ఎక్కడో ప్రవాసంలో ఉంటూ కథలు రాసే రచయితగానే నాకు తెలుసు.
సరసమైన సరదా రచనల రచయిత అని నా మనస్సులోని భావన. అవసరాలని కలిశాక నా ఆలోచనలెన్నింటినో మార్చుకున్నాను. చుట్టూ ఉన్న అస్తవ్యస్త ప్రపంచంలోంచి చాలా రుగ్మతల్ని వడబోసి - వాటిలోంచి 'సరదా'ని పిండిన రచయిత. ఆయన ఇబ్బందులు నాకు తెలుసు. చుట్టూ ఉన్న ప్రపంచంలో ఒదగక తప్పని ఇరకాటాలూ తెలుసు. కానీ ప్రతి చాలా ఛాలెంజ్ నుంచి మొండిగా వెలుగు రేఖని చూడడం అలవాటు చేసుకున్న మనిషి
పూర్తిగా చదవండి

Monday, October 24, 2011

TV1_GOLLAPUDI MARUTHIRAO_PART-1

TV1_GOLLAPUDI MARUTHIRAO_PART-2

TV1_GOLLAPUDI MARUTHIRAO_PART-3

చెప్పుడు మాట

ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు నేనూ మా రెండో అబ్బాయీ వేసుకునే పడికట్టు ప్రశ్నలు కొన్ని ఉన్నాయి.
''ఈ పని వల్ల వచ్చే నష్టం ఏమిటి?''
''దాన్ని తట్టుకునే శక్తి మనకి ఉన్నదా?''
''లేకపోతే ఈ సమస్యకి మొదటి ప్రత్యామ్నాయం ఏమిటి?''
''రెండో ప్రత్యామ్నాయం ఏమిటి?''
''వీటిలో ఏది మంచిది?''
ఏ సమస్యకీ వీటికి భిన్నంగా పర్యవసానాలుండవు.

Monday, October 17, 2011

మెజారిటీ రాజకీయాలు

ఇది అపర ప్రహ్లాదుల కాలం. దేశాన్ని పాలించే రాజునీ, రాజు ఆలోచనల్నీ, పాలక వ్యవస్థనీ, పాలన సరళినీ నిలదీసి, ఎదిరించి, ఎదిరించడం తమ హక్కుగా బోరవిరుచుకుని, అవసరమయితే వీధినపెట్టే అద్భుతమైన రోజులు వచ్చాయి. అన్నా హజారే పాలక వ్యస్థని ఎదిరిస్తున్న పెద్దమనిషి. పెద్దమనిషి. ఈ దేశ చరిత్రలో పాలక వ్యవస్థకి వోటు వెయ్యవద్దని ఎన్నికల్లో ప్రచారం చేసిన స్వచ్ఛంద సంస్థ -పోనీ, ఉద్యమం ఆయనది. ఇది విడ్డూరం. ఇందులో ఒకనీతి ఉంది
పూర్తిగా చదవండి

Monday, October 10, 2011

మెక్సికో మార్కు పెళ్ళిళ్ళు

ఈ మధ్య మెక్సికోలో కొత్తరకమైన పెళ్లి చట్టాలు అమలులోకి తేవాలని తలపోస్తున్నారు. ప్రేమించి పెళ్లిళ్లు చేసుకుని -తీరా ఇద్దరి మధ్యా సంబంధం పొసగక విడిపోవాలని -విడాకులు తీసుకోవాలని తంటాలు పడే నూతన దంపతులు ఎక్కువగా కనిపిస్తున్నారట. వారి సౌకర్యార్థం అసలు పెళ్లిళ్ల లైసెన్సులనే రెండేళ్లకు పరిమితం చెయ్యాలని ఆలోచిస్తున్నారట.

Sunday, October 2, 2011

చట్టానికి గాజులు

మన రెండో ప్రపంచ యుద్ధంలో హిట్లర్‌ రాక్షస ప్రవృత్తి గురించి ఇప్పటికీ కథలు కథలుగా చెప్పుకుంటాం. ఇప్పటికీ ఆ పీడకల నుంచి తేరుకోలేని దేశాలు, వ్యవస్థలు, కుటుంబాలూ, వ్యక్తులూ ఉన్నారు. ఈ పీడకలలను తమ కథల్లో, నవలల్లో, సినిమాల్లో ఇప్పటికీ తల్చుకు దు:ఖిస్తున్న సందర్భాలున్నాయి. మానవాళి చరిత్రలో అది మాయని, మానని గాయం. అంతకన్న పైశాచికమైన 'ఇండియా' మార్కు దౌర్భాగ్యమిది.
పూర్తిగా చదవండి

About me in HANSINDIA news paper

Sunday, September 25, 2011

ఒక 'కీర్తి ' శేషురాలు

మంచి పని ఎప్పుడూ ఒద్దికగా జరుగుతుంది. దౌర్భాగ్యపు పని బాహాటంగా ఒళ్ళు విరుచుకుంటుంది. ఒక 70 సంవత్సరాలలో మానవాళి మరిచిపోలేని దౌర్భాగ్యపు పని రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో యూదుల మారణ హోమం. మూలపురుషుడు హిట్లర్.
పూర్తిగా చదవండి

Monday, September 19, 2011

అధికారం అహంకారం

అధికారం అంటే ఎదుటి వ్యక్తి స్వేచ్చకి అంతరాయం కలిగించే శక్తి. అరాచకం అంటే ఆ అధికారం అదుపు తప్పడం. అనర్ధం అంటే ఈ రెండూ విచ్చలవిడిగా సాగడం. అహంకారం సాగించుకునే నిష్పత్తి.

Monday, September 12, 2011

'మాయా ' ప్రదేశ్

ప్రపంచంలోకల్లా ఆసక్తికరమైన విషయాలు మూడు ఉన్నాయి. పక్కవాడి రహస్యాన్ని కనిపెట్టడం, ఎదుటివాడి అవినీతిని బయటపెట్టడం, పొరుగువాడి రంకు గురించి కబుర్లు చెప్పుకోవడం. ఇంతకన్నా రుచికరమైన వ్యావృత్తి ప్రపంచంలో మరొకటి లేదు.
"నీకు తెలుసా - మన గోవిందుగాడు - వాళ్ళ వంటమనిషితో మొన్న --" ఆ రుచి అద్భుతం
పూర్తిగా చదవండి

Wednesday, September 7, 2011

Rogues' Gallery

RECENTLY I STARTED WRITING A COLUMN FOR AN ENGLISH DAILY ''THE HANS INDIA'' A DAILY PAPER STARTED FROM HYDERABAD. THESE ARE THE COLUMNS THAT APPEAR EVRY WEDNESDAY THERE. YOU CAN READ THE PAPER IN THE INTERNET.PLEASE VISIT http://www.thehansindia.info/epaper.asp
This week's column




Monday, September 5, 2011

'చావు'తెలివి

ఈ విషయాన్ని గురించి చాలాసార్లు రాసిన గుర్తు అయినా మరోసారి మననం చేసుకునే అతి ముఖ్యమయిన ఘట్టం ఇది.
20 ఏళ్ళ క్రితం ఈ దేశానికి ప్రధాని కావలసిన ఒక మాజీ ప్రధానిని - రాజీవ్ గాంధీని - ఎల్ టీ టీయీ బృందం దారుణంగా హత్య చేసింది. అది నిజానికి హత్యకాదు. మారణకాండ. అందులో రాజీవ్ గాంధీతోపాటు మరో 17 మంది చచ్చిపోయారు.

పూర్తిగా చదవండి

Thursday, September 1, 2011

A hope and a predicament


It was truly a defining moment in the history of India. A moment that celebrates, yet again, the power of non-violence and the collective will of the people.
In spite of several voices expressing their dissent for undermining the Parliament and thereby the constitution of this country and despite the skepticism about a movement of this nature, people raising cudgels against the maddening crowds engulfing the Institution and vehement protest of teaming millions trying to settle the laws of this country in the streets, one wily old man of 74, with his burning righteous indignation evoked the entire country and bulldozed into the mighty law making citadel leaving no option to it except to give in to his demands. They did give in, however, not with a majority voice vote as envisaged and expected, but by thumping of the desks, an apology to the ordained method. One can hear a few disgruntled voices in the house, a few twitching eyebrows, another few with petulant and sullen composures allowed a grudging compromise to diffuse the volatile situation. The two major parties made all the right noises while the discomfiture of other minor voices were either submerged or engulfed in the din.
A politician is one who perfects the art of saying “yes’’ while he meant an unequivocal “no’’, while a diplomat deliberates with a cool “no’’, as he ponders whether he can accommodate a “yes’’. There are about 540 of the former hue in the august house. While millions across the country celebrated it as a victory of the people, Narendra Modi went even a little further to compare it with the peaceful movement of the Independent era. A few others sang homilies, spoke about patriotism with choked voices and moistened eyes. The melodrama is palpable- though for good reasons.
Medha Patkar, the lone team member of Anna, who tasted betrayal more than once in the hands of the establishment was guarded when she said: “I will continue myself to join the party and will not say much at this historical time when people’s power is at its peek’’.
There was a lone voice- only one- which was candid, categorical and even emphatic. That was Anna Hazare, who said that this is only half of the victory and there is even a bigger impediment to face. A battle is won, but there is a war ahead.
The congress spokesperson claimed that this is not a victory of the teaming millions and a bow down of the government- but a win-win situation. I have no doubt that this statement is fully loaded and one should be able to read the fine print to understand the meaning between the lines.
Sometime back, I did a cameo role in a film “Leader’’. It was a two scene appearance and I never thought much about it. But, surprisingly the character was a big hit and it caught the imagination of many viewers. I often wondered why. And slowly the realization dawned on me. Here is the character. A senior politician- who was an ardent follower of Mahatma in his early days, practiced the crafty side of the political know how and became seasoned. He is so senior that he could call the Chief Minister by his first name. When CM tries to push a bill in the assembly (almost exactly on the lines of the present Lok Pal bill) bringing everybody to book-including the members of the house, all the hell is let loose in the house. When the young CM is baffled, this politician says in confidence:”Which school taught you your basics?How the hell do you think that this house would approve a bill that sends most of them to jail? Exclude them from its purview and see what happens’’. CM does exactly that and the house says “Yes’’ in one voice.
I have no doubt that this scene has a relevance to the present situation in the Parliament. I will explain the reasons for this prevarication.
In July 2008, Washington Post reported that nearly a fourth of the 540 Indian Parliament members faced criminal charges,”including human trafficking, immigration rackets, embezzlement, rape and even murder’’. A whopping sum of 20 lakh crores has been drained out of this country between 1948 and 2008. We have at least 4 serving MPs sent to Tihar jail by this very government , for scandals never heard in the history of this nation. Then, we have any number of Dayanidhi Marans,Madhu Khodas, Thomases, Sens etc.etc. And this country has a unique history of shelving this Lok Pal bill ten times-during 1968,1971,1977,1985,1996,1998,2001,2005 and 2008. If as the senior politician in “Leader’’(that is, me)said in the movie- all the 120 members will end up in jail when once this bill becomes law. What is more, they don’t belong to a single party. Every party has a share in this exalted list..
Suffice to quote one instance, as told by Arvind Kejriwal at a meeting in Chennai IIT- an official of the National Highway Authority of the rank of an additional secretary was raided by CBI and found huge amounts of unaccounted money. But they have to take permission from his boss Kamalnath, Minister for Surface Transport to file a case against him. What happened? The permission was NOT granted and the official enjoyed the benefit of doubt. Not a single case against any official in the Government was taken to the court, in spite of several instances provided by Vigilance Commission with evidences, because the government slept on these cases, with a mild reprimand to the concerned officer. National Vigilance Commissioner N.Vittal said once that corruption in this country is high profit zero risk business. In the last couple of years at least 13 RTI activists were murdered. Their only crime was whistle blowing.
I may sound cynical as I say this, but it is better to be cynical and realsitic than being unrealistic pretending to be prudent.
Having wriggled out of a tricky corner, without causing much harm, the parliament will have all its cards sorted out for the standing committee and sitting law making body to sleep on it for the 11th time. Anna, while rejoicing with his fellow members at the first taste of success, might be having a gut feeling that there is every need for a third fast, and very soon too.
Yes, the battle is half won, but whether the other half will be won by the people or the politicians is anybody’s guess.
Shocked? I will quote yet another example:Women’s reservation bill.

Monday, August 29, 2011

మరో 'లీడర్'కథ

ఆ మధ్య 'లీడర్ ' సినీమాలో ఓ తమాషా అయిన పాత్ర వేశాను. పాత్ర చిన్నది. రెండు సీన్ల వ్యవహారం. ఏదో తేలికగా సాగిపోయే పాత్ర అని సరిపెట్టుకున్నాను. కానీ ఆ పాత్రకి వచ్చిన స్పందన చూసి ఆశ్చర్యపోయాను. అంతకు మించి నివ్వెరపోయాను. ఎంతోమంది ఆ పాత్రని మెచ్చుకున్నారు.
కారణం? నేను బాగా నటించడం కాదు.
పూర్తిగా చదవండి

Monday, August 22, 2011

అన్నా వెనుక మనిషి

మా ఇంట్లో ఇద్దరు అవినీతిపరులున్నారు - నేనూ, మా అబ్బాయి. మేమిద్దరం ఈ దేశంలో సగటు అవినీతికి నమూనాలం కాము. అయినా మాకూ ఈ గుంపులో స్థానం ఉంది.
చాలా ఏళ్ళ కిందట మా పెద్దబ్బాయి మంచి డ్రస్సు వేసుకుని టై కట్టుకుని సిద్ధం అవుతున్నాడు. ఎక్కడి కన్నాను. కోర్టుకి అన్నాడు. అర్ధంకాలేదు. అయిదారు రోజుల కిందట రోడ్డు మీద పోలీసు అతన్ని ఆపాడట. ఏదో నేరం చేశాడో, చేశాడని పోలీసు భావించాడో. (నీతికీ అవినీతికీ అభిప్రాయబేధాలు తప్పవు కదా?) న్యాయంగా పోలీసు చేతిలో ఆమ్యామ్యా పడితే తేలిపోయే వ్యవహారమది. కానీ కోర్టుకే వచ్చి తాను రైటని నిరూపిస్తానన్నాడు మా వాడు. పోలీసు తలవూపాడు. సమన్లు వచ్చాయి. ఇప్పుడు కోర్టుకి వెళుతున్నాడు. యువకుడు, ఉడుకు రక్తం కలవాడు. రోడ్డు మీద అవినీతిని ఎదుర్కోవాలనే చిత్తశుద్ధి కలవాడు. మంచిదే అన్నాను.
ఇంకా చదవండి

Monday, August 15, 2011

ముష్టి పెత్తనం

ఒక ముష్టివాడు ఒక ఇంటికి బిచ్చానికి వెళ్ళాడట. ఇంటి కోడలు ఏమీ లేదు వెళ్ళమంది. బిచ్చగాడు బయలుదేరిపోయాడు. వెళుతున్న బిచ్చగాడిని అత్తగారు పిలిచారట. ఏమయ్యా వెళ్ళిపోతున్నావని.
కోడలమ్మగారు వెళ్ళమన్నారండి అన్నాడట బిచ్చగాడు. అత్తగారు చర్రున లేచింది. "అదెవరయ్యా చెప్పడానికి. నువ్వు రా" అన్నది. ఇతను వెళ్ళాడు. అప్పుడు అత్తగారు చెప్పిందట సాధికారికంగా "ఇప్పుడు నేను చెపుతున్నాను. ఏమీలేదు వెళ్ళు" అని.
ఇచ్చినా, పొమ్మన్నా అత్తగారికే చెల్లును - అన్నది సామెత. ఈ దేశానికంతటికీ అలాంటి ఓ అత్తగారుంది. తిట్టినా తిమ్మినా, శిక్షించినా, రక్షించినా, పొమ్మన్నా ఉండమన్నా ఆ అత్తగారికే చెల్లును. ఆ అత్తగారు - సుప్రీం కోర్టు.
పూర్తిగా చదవండి

Monday, August 8, 2011

సెన్స్ ఆఫ్ హ్యూమర్

ఇది తెలుగు కాలం కనుక ఇంగ్లీషులో మొదలెడతాను. సెన్సాఫ్ హ్యూమర్ అంటే కష్టాన్నీ, నష్టాన్నీ చూసి కడుపారా నవ్వుకోవడం. మనకి ఆ అలవాటు బొత్తిగా తక్కువంటాను. స్థాళీపులాకన్యాయంగా ఇక్కడ కొన్ని ఉదాహరణలు.
ఆ మధ్య పేపర్లో ఓ వార్త చూశాను. తమిళనాడులో ఎక్కడో ఓ కుర్రాడు ఓ కక్కుర్తి దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడు. కోర్టు ఆ కుర్రాడిని జైల్లో పెట్టింది. తీరా విచారణ జరుపుతూ బెయిల్ ఇవ్వడానికి 1200 రూపాయలు కట్టమంది. వెనకటికి ఓ పూర్వసువాసిని 'మా ఆయనే ఉంటే మంగలి ఎందుకు బాబూ' అన్నదట. ’నా దగ్గర అంత డబ్బుంటే దొంగతనం ఎందుకు చేస్తాను బాబూ?!’ అన్నాడట ఆ కుర్రాడు.
పూర్తిగా చదవండి

Gollapudi Memorial Award Function








Monday, August 1, 2011

డిమెన్షియా

ప్రపంచ సాహిత్యంలోనే గొప్ప కథల్లో ఒక కథ జర్మన్ రచయిత ఫ్రాన్స్ కాఫ్కా "ది మెటొమార్ఫొసిస్". ఒక రోజు కథానాయకుడు నిద్రలోంచి లేవగానే తను ఒక పెద్దు 'పురుగు' అయిపోయినట్టు భావిస్తాడు. అధివాస్తవికత, అద్భుతమైన 'సింబాలిజం'తో కథ సాగుతుంది. ఇప్పటికీ ఈ కథని ఎంతో మంది విశ్లేషిస్తున్నారు. ఎన్నో రకాల రచనా రూపాలను ఈ కథ సంతరించుకుంది. ప్రపంచ సాహిత్యంలో ఇది చరిత్ర. ఇంతవరకూ దీని ప్రసక్తి చాలు.

Monday, July 25, 2011

దౌర్జన్య కారులకు ఓ బహిరంగలేఖ

ప్రియమైన సోదరులారా!
ఈ మధ్య కాలంలో మీ గురించి ఈ దేశ ప్రజలు ఆలోచిస్తున్నట్టు మా తల్లిదండ్రులు, ఆత్మీయుల గురించి కూడా ఆలోచించడంలేదు. అందుకు బోలెడన్ని కారణాలున్నాయి. పాకిస్థాన్ మిత్రులకి 'కాశ్మీర్' ఊతపదం. కానీ మాకు మీ దౌర్జన్యకాండలు ఊతపదం. అయితే మీరు చిన్న చిన్న తప్పులు చేస్తున్నారు. మీలో చిన్న అవగాహనా లోపం ఉంది. దాన్ని తొలగించడానికే ఈ ఉత్తరం. చిత్తగించండి.

Monday, July 18, 2011

అమెరికా కర్మ సిద్ధాంతం

అమెరికాలో అన్నిటికన్నా ఆకర్షించే విషయం- వ్యాపారం. సర్వకాలసర్వావస్థలలోనూ వీటిని అమ్మవచ్చా, వీటికి బేరం ఉంటుందా, యిలాకూడా వ్యాపారం చెయ్యవచ్చా అనిపించేరీతిగా నిత్యనూతనంగా- ఎప్పుడూ కొత్త కొత్త తాయిలాలను, వరాలను కురిపిస్తూ- ఎన్నటికీ అలసిపోని, ఎప్పుడూ సాగే కర్మకాండ వ్యాపారం

Monday, July 11, 2011

ఓ అరుదైన సాయంకాలం

మహానటి సావిత్రి నా మొదటి సినీమా (డాక్టర్ చక్రవర్తి) హీరోయిన్. నా ఆఖరి రేడియో నాటకం హీరోయిన్. ఈ రెండు సంఘటనల మధ్య ఆమె జీవితంలో జరిగిన అన్ని ముఖ్యమయిన ఘట్టాలూ పరుచుకున్నాయి. ఆకాశం ఎత్తుకి ఎగసిన కీర్తి ప్రతిష్టలున్నాయి. కృంగదీసిన అపజయాలున్నాయి. అనారోగ్యం ఉంది. నిస్సహాయమైన జీవన విధానం ఉంది

Monday, July 4, 2011

దేవుడికి జ్వరమొచ్చింది

మన దేవుళ్లు ఒకొక్కప్పుడు మనకంటే బలహీనులు. బొత్తిగా ఆరోగ్యాన్ని నిలుపుకోలేనివాళ్లు.
ప్రతీ సంవత్సరం ఆషాడమాసంలోనే జగన్నాధుడికి జ్వరం వస్తుంది. ఎందుకని? ఆయనకి
108
కలశాలతో అభిషేకం జరిగినందుకు. జలుబుచేసి, ముక్కు దిబ్బడవేసి జ్వరం ప్రారంభమవుతుంది. భక్తులు ఆయనకి రకరకాలయిన లేహ్యాలను సిద్ధం చేస్తారు. అంతేకాదు. ఆయన సోదరుడు బలభద్రుడు, దేవేరిలతో మూడు రధాలతో బయల్దేరదీసి- వేరే ఏకాంతమందిరంలో వుంచుతారు. అక్కడ ఆయనకి 15 రోజులపాటు అభిషేకాలు లేవు. దేవుడు పత్యం చేస్తాడు. జలుబు తగ్గి ఆరోగ్యం పుంజుకున్నాక- మళ్లీ స్వస్థలానికి వస్తాడు.



Sunday, June 26, 2011

ఆసుపత్రికి తోవ ఎటు?

ఈ మధ్య టీవీలో ఒక ఆలోచనాభరితమైన చర్చని చూశాను.
మందు ఆ చర్చకి ప్రాతిపదిక. మహారాష్ర్ట ప్రభుత్వం పిల్లలు మద్యం తాగే వయస్సుని 21 నుంచి 25కి పెంచారు. అమితాబ్ బచ్చన్ గారికి కోపం వచ్చింది. అలా పెంచడం అన్యాయమని ఆయన వాపోయారు. ఈ టీవీ చర్చ ముఖ్యోద్దేశం ఏమిటంటే - అలా పెంచడం ద్వారా పిల్లలు తమకేం కావాలో నిర్ణయించుకునే హక్కుని కోల్పోతున్నారని పెద్దలు కొందరు వాక్రుచ్చారు. పెద్దల బుద్దులు ఎలా వెర్రితలలు వేస్తున్నాయో మనం అనునిత్యం చూసి ఆనందిస్తున్నాం. జైల్లోనే డాక్టర్ సచాన్ హత్య, బీహార్ లో ధర్నా చేస్తున్న రైతును తొక్కి చంపిన పోలీసుల వీరంగం, కోట్ల ధనం దోపిడీ- ఇవన్నీ మనం రోజూ చూసే సుందర దృశ్యాలు. పాతికేళ్ళ లోపునే మందు తాగే విచక్షణ యువకులకు ఉన్నదని వీరి వాదన. టీవీలో ఈ చర్చ వీలయినంత అసహ్యంగా, అసందర్భంగా, ఆలోచనారహితంగా కనిపించింది నాకు.
పూర్తిగా చదవండి

Monday, June 20, 2011

పుణ్య దొంగలు

'దొంగలందు మంచి దొంగలు వేరయా ' అన్నారు పెద్దలు. ఒకాయనకి తరుచుగా ఫోన్ కాల్స్ వచ్చేవి. అటు పక్క పెద్దమనిషి 'నమో వెంకటేశ!' అని మొదలెట్టి "బాబూ! తిరుమల తిరుపతి దేవస్థానం ఫోన్ నంబరు చెప్పగలరా!?" అని అడిగాడు. అటువంటి భక్తుడు అడిగితే కాదనలేక తెలుసుకుని మరీ చెప్పాడీయన. రెండు రోజుల తర్వాత మళ్ళీ ఆ భక్తుడే ఫోన్ చేసి 'జై శ్రీరాం!' అంటూ బిర్లామందిర్ నంబరు అడిగాడు.
పూర్తిగా చదవండి

Monday, June 13, 2011

వయస్సుని జయించినవాళ్ళు

ఉదయం పార్కులో నడిచే మిత్రులలో నోరి రామకృష్ణయ్యగారొకరు. ఆయన వయస్సు 82. ఆ మధ్య హిందీ ప్రచార సభ స్నాతకోత్సవాన్ని చూశారు. అక్కినేని ముఖ్య అతిధి. పట్టభద్రులందరికీ ముతక ఖద్దరు శాలువాలు కప్పారట. శాలువాకి నాలుగు అంచుల్లో మూడు హృదయాలు (ఆటీన్లు) ముద్రలుంటాయి. "ఏక్ రాష్ర్ట భాషా హిందీ హో, ఏక్ హృదయ్ హో భారత జననీ" (హిందీ రాష్ర్ట భాష, భారతమాత హృదయం) అని రాసి ఉంటుంది. ఆ శాలువా కొనుక్కోవాలని హిందీ ప్రచార సభకి వెళ్ళారు
పూర్తిగా చదవండి

Wednesday, June 8, 2011

బ్రహ్మముహూర్తం

"చెడు స్నేహాలు అనర్ధదాయకం.." అన్నారు కరుణానిధిగారు తన పుట్టినరోజునాడు. ఇన్నాళ్ళకి - 88 వ ఏట - వారికి జ్ఞ్నానోదయమైంది. 'మంచి ' కోణం నుంచి చూడగలిగే మరో మహానుభావుడు - ఆదిశంకరులు - మంచి స్నేహాలు మిమ్మల్ని జీవన్ముక్తుల్ని చేస్తాయి - అన్నారు. సజ్జన సాంగత్యం జీవన్ముక్తి హేతువు అంటూ.
పూర్తిగా చదవండి

Monday, June 6, 2011

కల్మాడీకి బోరుకొడుతోంది

నన్నెవరయినా "మీరేం చేస్తూంటారు?" అనడిగితే - " వెధవ్వేషాలు వేస్తూంటాను - సినిమాల్లో" అంటూంటాను. మరోసారి "ముఖాన్ని అమ్ముకుని బతుకుతూంటాను" అంటాను. నేనే వేషం వేసినా, మిత్రులు రావుగోపాలరావుగారూ నేనూ షూటింగులలో కలవక పోయినా 'క్లైమాక్స్ లో కలుస్తాం లెండి ' అనుకునేవాళ్ళం. ఎందుకంటే తప్పనిసరిగా క్లైమాక్స్లో మా ఇద్దరినీ శిక్షిస్తే కాని కథ పూర్తికాదు. ఇద్దరం కనీసం రెండు రోజులయినా కోర్టు బోనులో నిలబడేవాళ్ళం. హీరో మమ్మల్ని దుయ్యబడతాడు.
పూర్తిగా చదవండి

Sunday, May 29, 2011

భక్తిమార్గాలు

'మతం' రేపర్లో చుట్టడం వల్ల - మన చుట్టూ ఉన్న ప్రపంచంలో చాలా విషయాల పరమార్ధం మరుగున పడిపోతుంది. మతం నిజానికి రంగు కళ్ళద్దం. ఈ దేశంలో మతం అన్నమాట శతాబ్దాల క్రితం లేదు. ఆ మాటకి వస్తే ఎక్కడా లేదు. ఏ పురాణాల్లోనూ ఈ మాట కనిపించదు. ఆ రోజుల్లో మనకున్నది సనాతన ధర్మం. న్యాయంగా 'ధర్మం' అంటే చాలు. అది ఆనాటిది కనుక 'సనాతనం' చేర్చాం. నిజానికి ఈ ధర్మం ప్రతి మతానికీ వర్తిస్తుంది. మనిషి చెయ్యాల్సిన విధి. ప్రవక్తల, మహానుభావుల, ప్రవచనాల, ప్రభోధాల అర్ధం ఇదే. ఈ గొడవ ఇక్కడికి చాలు.

Monday, May 23, 2011

పాపం..?

తమిళనాడు ఎన్నికలకు ముందు ఎన్ డీ టీవీ పాత్రికేయురాలు బర్ఖాదత్ కరుణానిధిగారిని చెన్నైలో ఓ ప్రశ్న వేసింది. "జయలలిత గురించి తమరు చెప్పేదేమైనా ఉన్నదా?" అని. కరుణానిధిగారు క్లుప్తంగా "పాపం" అన్నారు. బర్ఖాదత్ కిసుక్కున నవ్వుకుంది.
కరుణానిధిగారు నాస్తికులు కనుక, వారికి పాపపుణ్యాల మీద నమ్మకం ఉండదు కనుక ఈ పాపానికి అర్ధం జయలలిత మీద జాలో, రోగం కుదురుతుందన్న వ్యంగ్యమో అనుకోవాలి . ఇది జరిగి కేవలం నెలరోజులు కూడా కాలేదు.

Monday, May 16, 2011

చీకట్లోకి ప్రయాణం

దాదాపు 40 ఏళ్ళు పైగా నా మనస్సులో నిలిచిన ఒక వాక్యం ఉంది."కథ బ్రహ్మ దేవుడి ఆఖరి వ్యసనం" అని. ఇది ఎప్పుడూ నాకు గుర్తొచ్చే వాఖ్య. బ్రహ్మదేవుడు అందమయిన ముఖాన్ని,శరీరాన్ని, సౌష్టవాన్ని సిద్ధం చేశాక ఆయన చెయ్యాల్సిన ఆఖరి పని - ఆ బొమ్మకి ఒక కథని నిర్దేశించడం. ఈ సృష్టిలో కోట్లాది కథల్ని సిద్ధం చేసిన గొప్ప కథా రచయిత, సృష్టి కర్త - బ్రహ్మ దేవుడు. ఇది చాలా అందమయిన ఆలోచన.
ప్రస్తుతం నేను అబూదాబీలో ఉన్నాను.

Monday, May 9, 2011

తోటికోడలు నవ్వింది

పాకిస్తాన్ కి తనదైన గొప్ప చరిత్ర ఉంది. ఆ దేశం అవతరించినప్పటి నుంచీ ఇప్పటి వరకూ ఎక్కువగా సైనిక నియంతల పాలనలోనే ఉంది. కాగా, ఇప్పటి ప్రజాస్వామ్యానికీ గొప్ప చరిత్ర ఉంది. ఎన్నో అవినీతి నేరాలకి అరెస్టయి, జైలుకి వెళ్ళి, దేశాన్ని వదిలి పారిపోయిన ఒక నేరస్థుడు జర్దారీగారు - కేవలం బేనజీర్ భుట్టో భర్త అయినందుకే, అదృష్టవశాత్తూ ఆమె హత్య జరిగినందుకే ఆ దేశపు అధ్యక్షుడయారు. ఇది ఆ దేశానికి గొప్ప కిరీటం.
నిజానికి రాజకీయ దౌత్యంలో - ఒక దశలో - అద్భుతమైన అవగాహన చూపించి, ప్రపంచమంతటికీ - ఒక్క ఇండియాకి తప్ప -స్నేహితుడయిన దేశంగా పాకిస్థాన్ ని నిలిపింది అయూబ్ ఖాన్ అని చెప్పుకుంటారు

Monday, May 2, 2011

కుక్కమూతి పిందెలు

ఈ కాలమ్ కీ సత్యసాయిబాబా దేవుడా? అవతార పురుషుడా? అన్న ప్రశ్నలకీ ఎటువంటి సంబంధంలేదు.
1964 మే 27 సాయంకాలం ఢిల్లీ నుంచి తెలుగువార్తల ప్రసారం ప్రారంభమయింది. "మన ప్రియతమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఇకలేరు" అని న్యూస్ రీడర్ చదువుతూంటే అతని గొంతు వణికింది. దుఃఖంతో గొంతు బొంగురుపోయింది. ఆ రీడర్ పేరు రామచంద్రరావు. ఆ ఒక్క కారణానికే అతని ఉద్యోగం పోయింది.

Monday, April 25, 2011

అవినీతికి గొడుగు

మనం అవినీతికి 'నీతి' గొడుగు పట్టడం ప్రారంభించి చాలా ఏళ్ళయింది. తమకు గుర్తుందా? ఆ మధ్య ప్రభుత్వం మనతో లాలూచీ పడింది. "మీరు నల్లధనం ఎలా, ఏ అవినీతి పనిచేసి సంపాదించారని మేం అడగం. మీ దగ్గర ఎంత ఉందో చెప్పండి.40 శాతం మాకివ్వండి. మిగతా 60 శాతం మీ దగ్గరే ఉంచుకోండి" అన్న స్కీము పెట్టింది. ఎందరో పెద్ద మనుషులు సంతోషించారు. వేలకోట్ల ధనం పాతర్లోంచి బాంకుల్లోకి బదిలీ అయిపోయింది. ఇది ఊళ్ళని కొట్టేవాళ్ళని మంగళహారతి ఇచ్చి సత్కరించడం లాంటిది. అయితే లాభసాటి వ్యాపారం. ఎవరికి? కొల్లగొట్టేవాళ్ళకి..

Monday, April 18, 2011

ఓ గుండయ్య కథ

నేను దైవ భక్తుడిని. కాని చదువుకున్న దైవభక్తుడిని. చదువుకోని దైవభక్తుడు తన విశ్వాసానికి సమాధానం చెప్పలేడు. కాని అతను నాకంటే చాలా విధాలుగా, చాలా కారణాలకి నాకంటే గొప్ప దైవభక్తుడు కావచ్చు. నేను కారణాలు చెప్పగలను.
మన దేశంలో రకరకాల ఛానల్స్ ఉన్నాయి. ఇవన్నీ వ్యాపార కేంద్రాలు. నేను 20 సంవత్సరాలు ఆకాశవాణిలో పనిచేశాను. కాని ఏనాడూ ఆకాశవాణి గొప్పతనాన్ని బేరీజు వేసే ప్రయత్నం చెయ్యలేదు. పక్కన హిరణ్య కశిపుడు ఉంటేగాని ప్రహ్లాదుడి గొప్పతనం అర్ధం కాదు. ఇన్ని ఛానళ్ళు సామూహికంగా ఆ ఉపకారం చేస్తున్నాయి. నేను ఎక్కువగా ఛానళ్ళు చూడను. చూడకుండా జాగ్రత్త పడతాను. అది నా ఆరోగ్య రహస్యం.

Monday, April 11, 2011

అన్నా..ఆహా..ఆహాహా.

ఉద్యమాలూ, నిరాహార దీక్షలూ, నినాదాలూ, బుకాయింపులూ దైనందిన కార్యక్రమాలుగా మారిపోయిన ఈ రోజుల్లో - మహాత్మాగాంధీని 'పాత చీపురుకట్ట'లాగా వాడుకుంటున్న కాలంలో, 'దేశసేవ' అనే బూతుమాటని 'మాటలు కూడా సరిగ్గా చెప్పలేని ప్రతీ దోపిడీదారుడూ వాడుకుని నిచ్చెన ఎక్కుతున్న ఈనాటి వైకుంఠపాళీ రాజకీయాల్లో, లాప్ టాపులూ, గ్రైండర్లూ, మంగళసూత్రాలూ వొడ్డి - ఎవడి బాబు సొమ్ముతోనో ఓట్లు కొనుక్కోడానికి పందెం కాస్తున్న పార్టీలు పేట్రేగిపోతున్న నేపధ్యంలో, ఈ దేశంలో 'అవినీతి' ముద్రపడిన నాయకులు పిఏసి సమావేశాలకి అలా షికారు వెళ్ళినట్టు వెళ్ళి మాయమవుతున్న తమాషాని చూస్తున్న ఓ మామూలు, నేలబారు మనిషి - కేవలం 'నీతి' పెట్టుబడిగా ఎంత సాధించవచ్చునో, దాని ప్రభావం ఎంత ఉండగలదో - అన్నా హజారే గతవారం రోజులుగా నిరూపించారు. ప్రజల నైరాశ్యం, ఆవేశం అనే కార్చిచ్చు ఎంత ఉధ్రుతంగా దేశమూ, రాష్ర్టమూ, జిల్లా, గ్రామం స్థాయిని దాటి ఎలా రేగిందో కోట్లాది మంది విస్తుపోయేలాగ, ఆవేదనతో రెచ్చిపోయేలాగ చేయగలదో గత ఏడురోజులూ నిరూపించాయి. గంటల్లో ఢిల్లీ సింహాసనం పునాదుల్తో కదిలింది. నాయకులు అర్ధంకాక దిక్కులు చూశారు.
పూర్తిగా చదవండి

Monday, April 4, 2011

కాలం గురించి ' కాలమ్'

నేను 30 ఏళ్ళుగా కాలం రాస్తున్నాను. ఆ మధ్య మిత్రులు, ప్రముఖ సినీనటులు వంకాయల సత్యనారాయణ అమ్మాయి నా రచనల మీద పరిశోధన చేస్తానంటూ వచ్చారు. నేను నా కాలంల మీద చెయ్యమన్నాను. తెలుగు పత్రికా ప్రపంచంలో ఎందరో మహానుభావులు కాలంస్ రాస్తూ వచ్చారు. ఆ విధంగా ఈ పరిశోధన మార్గదర్శకం కాగలదని నా ఆలోచన. నిన్ననే డాక్టరేట్ సిద్ధాంత గ్రంధాన్ని నాకు చూపించింది చి.లావణ్య.

Monday, March 28, 2011

దేశసేవ

ఈ దేశంలో ఎందరో రాజకీయనాయకులు లక్షలు, కోట్లు ఖర్చుచేసి, రాత్రింబవళ్ళు శ్రమించి, అవసరమయితే హత్యలు చేసి, చేయించి ఎందుకు నాయకులవుతున్నారో ఎప్పుడయినా ఆలోచించారా? వాళ్ళని అడగండి. కళ్ళు ఎర్రబడేలాగ ఆవేశపడి 'దేశ సేవ ' కోసమని చెపుతారు. వీళ్ళని దేశసేవ చేయమని ఎవడేడ్చాడు? వీళ్ళు 'చెయ్యని' రోజు ఏనాడయినా వస్తుందా అని ఆశగా ఎదురు చూసే ఎందరో నాయకుల పేర్లు, మొహాలు మనకు తెలుసు.
పూర్తిగా చదవండి

Monday, March 21, 2011

Gollapudi Srinivas Memorial Award - 2011

Direct Link: http://www.koumudi.net/gollapudi/srinivas_memorial_2011.htm







సెల్ ఈజ్ హెల్

పీవీ నరసిం హారావుగారి ధర్మమాంటూ టెలిఫోన్ డిపార్ట్ మెంట్ వారి నిరంకుశత్వం అణగారి ప్రజలకి స్వేచ్ఛ లభించింది. ఆ రోజుల్లో టెలిఫోన్ సౌకర్యం ఒక ఆస్తి సంపాదనలాగా తయారయి - ఎంతో భయంకరమైన అవినీతి ఎన్నో దశల్లో ఆవరించుకోవడం చాలామందికి ఇంకా గుర్తుండే ఉంటుంది. ఇవాళ ఆ డిపార్ట్ మెంట్ రకరకాల రాయితీలతో ప్రజల్ని దేబిరించే స్థితికి వచ్చింది. అది దాని ఖర్మ. అక్కసుతోనే ఈ నాలుగు మాటలూ అంటున్నాను.

Monday, March 14, 2011

నవ్య వారపత్రికలో నా ఇంటర్వ్యూ




--------------------------------





నీతి - అవినీతి

నేను చదువుకునే రోజుల్లో భాగల్పూర్ వెళ్ళి హిందీ పరీక్షలు రాసే సౌకర్యం ఉండేది. నేను కొన్ని పరీక్షలకి చదివిన గుర్తు. దేశంలో ఇన్ని రాష్ర్టాలు, ఇన్ని జిల్లాలు ఉండగా భాగల్పూర్ ప్రత్యేకత ఏమిటా అని ఆ రోజుల్లో నేను ఆలోచించలేదు. ఆలోచిస్తే ఇన్నాళ్ళకి, ఇన్నేళ్ళకి సమాధానం దొరికేది. ఈ ప్రత్యేకత ఆ ఊరుదీ, ఆ విశ్వవిద్యాలయానిదీ కాదు. ఆ రాష్ర్టానిది - బీహారుది. ఈ విషయం నిన్న టీవీలో కనిపించిన ఓ సుందర దృశ్యం విశదపరచింది. ఇదీ ఆ దృశ్యం.
పూర్తిగా చదవండి

Monday, March 7, 2011

'చావు' హక్కు

నాకు చాలా ఇష్టమైన ఆల్ర్ఫెడ్ హిచ్ కాక్ సినిమాల్లో 'ది రోప్' ఒకటి. ఒక సాయంకాలం - కేవలం ఊసుపోకకి, తమ తెలివితేటల్ని నిరూపించుకోవాలనే వికారమైన, విపరీతమైన ఆనందానికి ఇద్దరు యువకులు తన మిత్రుడిని హత్యచేసి ఒక సందుగ పెట్టెలో శవాన్ని ఉంచి, ఆ పెట్టె మీదే ఆ సాయంకాలం మిత్రులకి విందుని ఏర్పాటు చేస్తారు. వాళ్ళ టీచరు హత్యని గుర్తుపడతాడు. అప్పటి ప్రముఖ నటుడు జేమ్స్ స్టూవర్ట్ ఆ పాత్రని నటించాడు. విషయం తెలిసి షాక్ అయి వాళ్ళిద్దరినీ నిలదీస్తాడు. "మరొక వ్యక్తిని చంపేహక్కు మీకెవరిచ్చారు? మీరేం దేవుళ్ళా?" అంటాడు. సంవత్సరాలు గడిచినా ఆ సన్నివేశం నాకు జ్నాపకం వస్తూంటుంది.
పూర్తిగా చదవండి

Monday, February 28, 2011

ఇద్దరు పెద్దలు ఒక నివాళి

ఒక మహానటుడు:
ఈ వారం ఇద్దరు పెద్దలు వెళ్ళిపోయారు. ఇద్దరూ వారి వారి రంగాలలో ప్రసిద్ధులు, ప్రతిభావంతులు, నిష్ణాతులు, చరిత్రని తిరగరాసినవారు.
కిందటి జనవరి మొదటి తేదీన పుస్తక ప్రదర్శన ప్రారంభించడానికి ఆహ్వానించినప్పుడు - నేను కలుసుకోవాలని ఎదురు చూసిన మిత్రులు, హితులు మిక్కిలినేని. ఉదయం రైలు దిగుతూనే భార్యా సమేతంగా వెళ్ళాను.

Monday, February 21, 2011

'పేద' మెలో డ్రామా

ఆనాటి బ్రిటిష్ విన్ స్టన్ చర్చిల్ తన అనుభవాలలో చెప్పిన కథ ఇది. రెండవ ప్రపంచ యుద్ధం రోజుల్లో - ఇద్దరే పాపులర్ నాయకులు - హిట్లర్, చర్చిల్. మిగతా వారంతా వీరి తర్వాతే. ఇద్దరూ అమోఘమైన వక్తలు. రెండు వేర్వేరు దృక్పధాలకి ప్రపంచాన్ని ఆకట్టుకున్న నాయకులు - ఇద్దరూ విరోధి పక్షాలవారు.

Sunday, February 13, 2011

నీచనాయకులు

చాలా ఏళ్ళ క్రితం ఒకానొక పత్రికలో నేను టంగుటూరి ప్రకాశం గారి మీద కాలం రాశాను. వెంటనే ఒక పాఠకుడు ఈ సందర్భాన్ని ఉటంకిస్తూ సంపాదకునికి లేఖ రాశాడు. ఆ లేఖలో వివరాలివి. ఇది ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో జరిగిన సంఘటన. ప్రకాశం గారు అతిధి బంగళా గదిలోంచి ఎంతకీ బయటికి రావడం లేదట. బయట కొందరు ఎదురు చూస్తున్నారు. తీరా ఆలశ్యానికి కారణం అయిన (ముఖ్యమంత్రి) చొక్కాకి తెగిపోయిన రెండు బొత్తాములు కుట్టించుకుంటున్నారట!

Sunday, February 6, 2011

అయ్యో మగాళ్ళు

దాదాపు 50 సంవత్సరాల కిందట నేనో పెద్ద కథ రాశాను. పేరు: అహంకారపు అంతిమ క్షణాలు. నాతో ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ఆనర్స్ చదివే సీనియర్ ఒకాయన ఉండేవాడు. నాగభూషణం. ఏలూరు దగ్గర ఏదో ఊరిలో ఉంటున్న ఓ హెడ్మాష్టరుగారబ్బాయి. తల్లిదండ్రుల్ని కాదని, ఓ టెలిఫోన్ ఆపరేటర్ని పెళ్ళిచేసుకున్నాడు. తండ్రి చదువుకి డబ్బు పంపడం నిలిపేశాడు. ఆమెకి సంపాదన ఉంది. ఇతన్ని చదివించేది. నరకయాతన పడిపోయేవాడు. మించి ఆమెని యాతన పెట్టేవాడు. సంస్కారే. చదువుకున్నవాడే.

Sunday, January 30, 2011

'పద్మ 'త్రయం

ఒకరు పద్మశ్రీ. మరొకరు పద్మ భూషణ్. ఇంకొకరు పద్మవిభూషణ్ . ఆటా పాటా నటనలకు పెద్ద పీట - వి.వి.యస్. లక్ష్మణ్, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, అక్కినేని నాగేశ్వరరావు.
పూర్తిగా చదవండి

Monday, January 24, 2011

'ఆదర్శ' అవినీతి....

ముంబైలో 'ఆదర్శ ' హౌసింగ్ సొసైటీ కుంభకోణం 31 అంతస్థుల భవనాన్ని కూలద్రోయాలని కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మంత్రి జైరాం రమేష్ గారు ఈ నిర్ణయాన్ని కుండబద్దలు కొట్టి మరీ చెప్పారు. ఇది మరీ పెద్ద అవినీతి అని నా ఉద్దేశం. ఒక రొట్టెముక్క ఉంది. వెంకయ్య తినాలా రామయ్య తినాలా అన్నది తగువు. మధ్యవర్తి వచ్చి ఎవరూ తినకూడదు అంటూ తను నోట్లో వేసుకోవడం ఫక్తు 'కాంగ్రెసు' తీర్పు. దీనికే పాతకాలం సామెత ఒకటుంది - పిల్లీ పిల్లి తగువు కోతి తీర్చిందని. కాని ఎవరూ తినకూడదు అంటూ సముద్రంలోకి గిరాటు వెయ్యడం - జైరాం రమేష్ గారు ఇవ్వవలసిన తీర్పు కాదు.

Sunday, January 16, 2011

చందూర్ స్మృతి....

చెన్నైలో ఆగస్టు 7న సవేరాలో ఆనాటి ముఖ్యమంత్రి రోశయ్యగారికి కొందరు తెలుగు మిత్రులు విందు చేశారు. ఇలాంటి కార్యక్రమాలలో సాధారణంగా అందరు తెలుగు ప్రముఖులు హాజరుకావడం రివాజు. ఆనాడు చందూరు దంపతులు (ఎ.ఆర్.చందూర్, మాలతీ చందూర్) వచ్చారు. భోజనాలయాక హోటల్ ప్రాంగణంలో అతి అందమయిన కారెక్కారు ఎన్.ఆర్.చందూర్ గారు. "కారు చాలా ముద్దుగా ఉంది" అన్నాను ఆయనతో. వెనకనే వస్తున్న మాలతీ చందూర్ గారు అందుకుని "నేను లేనా? దుర్మార్గుడా! అన్నారు. చేతులు జోడించి "80 ఏళ్ళ మీ గురించి 94 ఏళ్ళ మీ ఆయనకి ఏం చెప్పనమ్మా" అన్నాను. కారు వెళ్ళిపోయింది. అదీ నేను చందూర్ గారిని ఆఖరుసారి చూడడం. అదీ ఆ దంపతులూ సెన్సాఫ్ హ్యూమర్కి, అన్ని సంవత్సరాల జీవితంలో సరసత్వానికీ మచ్చుతునక.
పూర్తిగా చదవండి

Sunday, January 9, 2011

మానవుడు... మానవుడు....

ఈ మధ్య నన్నో మిత్రుడు అడిగాడు: ఏమండీ, ఈ సృష్టిలోంచి త్వరలో పులి మాయమవుతోంది కదా? అలాంటి పరిస్థితి మనిషికి వస్తుందా? అని. సమాధానమే ఈ కాలం. "వస్తుంది బాబూ వస్తుంది" అనాలో "వస్తోంది బాబూ వస్తోంది" అనాలో "వచ్చేసింది బాబూ వచ్చేసింది" అనాలో తెలియడం లేదు. అంతే తేడా. అయితే 'ఈ ప్రకృతి ఊహించినంత ఆలశ్యంగా కాదు.' మానవుడి చేతలకు 'ఊహించనంత తొందరగా ' అని చెప్పుకోవాలి
పూర్తిగా చదవండి

Thursday, January 6, 2011

ఎర్రసీత

దాదాపు పదిహేను సంవత్సరాల క్రిందట సీరియల్ గా నేను వ్రాసిన నవల ఇది. ఈ నవలకి వచ్చిన అభినందనలన్నీ ఒక ఎత్తు ఐతే నాలుగేళ్ళ క్రిందట , కరడుగట్టిన హంతకుడిగా పేరుతెచ్చుకున్న చర్లపల్లి జైలులోని ఒక ఖైదీ వ్రాసిన ఉత్తరం ఒక ఎత్తు. ఆ ఉత్తరాన్ని ముందుమాటగా ప్రస్తావిస్తూ - ఈ నెల నుంచీ ఈ నవల 'కౌముది ' మాసపత్రికలో సీరియల్ గా వస్తోంది. ఆసక్తికకరమైన ఆ ఉత్తరంతో కూడిన మొదటి భాగాన్ని ఈ నెల కౌముదిలో చదవొచ్చు.

Sunday, January 2, 2011

మూడుకథలు

ప్రతీ ఏడూ ఆఖరి రోజుల్లో పత్రికలకీ, టీవీ ఛానళ్ళకీ ఓ వార్షికం ఉంది. ఈ సంవత్సరంలో జరిగిన గొప్ప విషయాలూ, గొప్ప అరిష్టాలూ, గొప్ప అవినీతులూ, గొప్ప హత్యలూ, గొప్ప మోసాలూ - ఇలా మరోసారి అన్నిటినీ తలుచుకుని 'అయ్యో ' అనో 'ఆహా! ' అనుకుని కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టడం రివాజు.
పూర్తిగా చదవండి