Sunday, December 23, 2012

మానవత్వమా! ఎక్కడ నువ్వు ?

 ఆడవారికి స్వాతంత్య్రం వచ్చిందని భుజాలు చరుచుకుంటున్న రోజులివి. కాని ఆడవారి స్వేచ్ఛని ఆరోగ్యకరమైన దృష్టితో చూడడం చేతకాని పశువులున్న రోజులు కూడా ఇవే.
వాళ్లు చిన్న కుటుంబాలకు చెందినవాళ్లు. కార్లలో డ్రైవర్లతో తిరిగే స్తోమతు చాలని వాళ్లు. తప్పనిసరిగా బస్సుల్ని నమ్ముకోవలసినవాళ్లు. వాళ్లు పడే కష్టాలు, అవమానాలూ ఇళ్లలో చెప్పుకుంటే ఆ చదువుకొనే అవకాశం పోతుందేమోనని గుండెల్లోనే మంటల్ని దాచుకునేవాళ్లు. జీవితంలో ఏ కాస్త అవకాశాన్నయినా అందిపుచ్చుకుని ఆ మేరకి, తమ, తమ కుటుంబాలకి ఆసరా కావాలనే కలలు కనేవాళ్లు.
పూర్తిగా చదవండి

Monday, December 17, 2012

నిజం నిద్రపోయింది

 దాదాపు 50 సంవత్సరాల కిందట నేనో నాటిక రాశాను. దాని పేరు 'నిజం నిద్రపోయింది '. ఆ రోజుల్లో అది - అప్పటి నాటక ప్రక్రియకి పదేళ్ళు ముందున్న రచన. ఈ సృష్టిలో అన్ని నిజాలూ చెప్పుకోదగ్గవి కావు. ఒప్పుకోదగ్గవికావు. పంచుకోదగ్గవి కావు. ఎంచుకోదగ్గవికావు. కొన్ని నిజాలు బయటికి రావు. రానక్కరలేదు. ఆ కారణానే మన జీవితాలు ఆనందంగా, ప్రశాంతంగా సాగుతున్నాయి.
పూర్తిగా చదవండి

Sunday, December 9, 2012

అభినవ కీచకులు

రాబిన్ పాల్ 23 ఏళ్ళ అమ్మాయి. న్యాయంగా ఆమె మీద ఈగవాలడానికి కూడా వీల్లేదు. కారణం ఆమె అమృతసర్ లో పోలీసు అసిస్టెంటు సబ్ ఇన్ స్పెక్టర్ రవీందర్ పల్ సింగ్ కూతురు. కానీ హెడ్ కానిస్టేబుల్ గారి కొడుకే ఆమెని ఏడిపిస్తూంటే? అదే స్టేషన్ లో పనిచేస్తున్న గుర్ బీర్ సింగ్ బీరా కొడుకే వెంటబడుతున్నాడు. ఆ అమ్మాయి - 20 రోజుల కిందట పోలీసు స్టేషన్ లో పిర్యాదు చేసింది. ఎవరూ పట్టించుకోలేదు. నిన్న తన కూతుర్ని ఏడిపిస్తున్నవాళ్ళకి తండ్రి అడ్డుపడ్డాడు.
పూర్తిగా చదవండి 

Sunday, December 2, 2012

రెడీమేడ్ జీవితాలు

ఇప్పుడిప్పుడు జీవితం మరింత సుఖవంతమయిపోయింది. మన సుఖాల్ని ఎరిగిన పెద్దలూ, మన అవసరల్ని తెలుసుకున్న నాయకులూ, మన కష్టాల్ని గుర్తించిన మంత్రులూ - జీవితం ఎన్నడూ లేనంత హాయిగా మూడు పువ్వులూ ఆరుకాయలుగా తీర్చిదిద్దుతున్నారు.
పూర్తిగా చదవండి

Monday, November 26, 2012

ఎక్కడికి పోతోంది ఈ వ్యవస్థ?

1948 నాటికి నాకు సరిగ్గా తొమ్మిదేళ్ళు. మహాత్మాగాంధీ హత్య జరిగింది. అదెంత నష్టమో, జాతి ఎంతగా కృంగిపోయిందో అర్ధం చేసుకునే వయస్సు కాదు. కానీ ఆనాడు విశాఖపట్నమంతా - ముస్లింలు, హిందువులు, పెద్దా చిన్నా - అంతా సముద్రతీరానికి వచ్చి కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ సముద్ర స్నానం చెయ్యడం నాకు గుర్తుంది. నా చేత కూడా మా అమ్మా నాన్నా స్నానం చేయించారు. ఓ మహాత్ముడి నిర్యాణానికి దేశ ప్రజలు సమర్పించిన నివాళి అది. అది హత్య. మరణం కాదు.
మరో 39 సంవత్సరాల తర్వాత ప్రముఖ సినీనటుడు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.జి.రామచంద్ర అనారోగ్యంతో మరణించారు. ప్రజలు చెలరేగిపోయి దుకాణాలు ధ్వంసం చేసారు. బస్సుల్ని తగలెట్టారు. మందు షాపుల్ని దోచుకున్నారు. 23 మంది చచ్చిపోయారు. 47 మంది పోలీసులు గాయపడ్డారు.. కనీసం ఒక్కడు దోచుకున్న మందు షాపుల్లో మందుని తప్పతాగి రోడ్డుమీద పడి చచ్చాడు.
పూర్తిగా చదవండి

Monday, November 19, 2012

హాస్యపు కరువు

ఆ మధ్య నాగపూర్ కార్టూనిస్టు ఆసీం త్రివేదీని - కార్టూన్లు వేసినందుకు దేశద్రోహ నేరానికి అరెస్టు చేసినప్పుడు - ఈ పాలక వ్యవస్థకి, నాయకులకీ బొత్తిగా హాస్యపు రుచి తెలియదని చాలామంది దుమ్మెత్తిపోశారు.
పార్లమెంటుని పాయిఖానా తొట్టిగా, సత్యమేవ జయతే అన్న జాతీయ ఆదర్శాన్ని 'భ్రమేవ జయతే ' అన్నప్పుడు, ఆజ్మాల్ కసాబ్ ఈ దేశపు రాజ్యాంగం మీద ఉచ్చ పోసినప్పుడు - పాలక వ్యవస్థకి, నాయకులకీ బొత్తిగా హాస్యపు రుచి తెలియదని చాలామంది దుమ్మెత్తిపోశారు.
పూర్తిగా చదవండి

Sunday, November 4, 2012

అన్నీ ఉన్నవాడే..ఏమీ లేనివాడు

ఇంటర్నెట్ లో చాలా మంది మిత్రులు - ప్రపంచం అన్ని మూలల నుంచీ రకరకాల కథలు, సందర్భాలను ఉటంకిస్తూంటారు. ఇది నలుగురితో పంచుకోవలసినంత గొప్ప సగతి:


1923 లో అమెరికాలోని చికాగోలో ఉన్న ఎడ్జి వాటర్ బీచ్ హోటల్ లో దేశంలో కల్లా శ్రీమంతులైన తొమ్మిది మంది కలుసుకున్నారు. వాళ్ళందరి ఆస్తుల్ని కలిపితే ఆనాటి అమెరికా దేశపు సంపద కన్నా ఎక్కువ. డబ్బుని ఎలా సంపాదించాలో, ఎలా కూడబెట్టాలో వంటబట్టించుకున్న మహానుభావులు వీరు తొమ్మిది మంది.

పూర్తిగా చదవండి

Monday, October 29, 2012

గాంధీ పుట్టిన దేశం

గాంధీ పుట్టిన దేశమిది. చిన్న అంగవస్త్రం చుట్టుకుని, చేతికర్ర పట్టుకుని, గొర్రెపాలు తాగి, మూడో తరగతి కంపార్టుమెంటులో ప్రయాణం చేస్తూ రవి అస్తమించని బ్రిటిష్‌ సామ్రాజ్య పాలకుల్ని గద్దెదించిన ఓ'బికారి' పుట్టిన దేశం. ఈ దేశంలో మంత్రిగారు 71 లక్షలో దుర్వినియోగం చేస్తే తప్పులేదని సమర్థించే ఓ కేంద్ర మంత్రి, పని సజావుగా చేశాక, కాస్త దోచుకున్నా తప్పులేదని ఐయ్యేయస్‌ అధికారులకు హితవు చెప్పే ఓ రాష్ట్ర మంత్రీ ఉన్నారు. భారతదేశం అవకాశవాదులు, రోగ్స్‌, అవినీతి పరుల పాలిట పడుతుంది -అని ఆనాడే వక్కాణించిన మాజీ బ్రిటిష్‌ ప్రధాని విన్‌స్టన్‌ చర్చిల్‌ జోస్యాన్ని అక్షరాలా నిజం చేసే రోజులొచ్చాయి.
పూర్తిగా చదవండి 

Monday, October 22, 2012

కీర్తి

ప్రముఖ అమెరికన్ రచయిత్రి ఎమిలీ డికిన్సన్ కీర్తి గురించి అతి చిన్న కవిత రాసింది. కవిత చిన్నదయినా కవితా హృదయం ఆకాశమంత ఉన్నతమయింది. ఆవిడ అంటుంది: "కీర్తి తేనెటీగలాంటిది. పాట పాడి లాలిస్తుంది. కాటువేసి జడిపిస్తుంది. ఆఖరికి రెక్కలు విప్పుకు ఎగిరిపోతుంది" అని.
పూర్తిగా చదవండి

Tuesday, October 16, 2012

అరాచకానికి ఆఖరి మలుపు

ఇంటికి పెద్దవాడుంటాడు. పెద్దరికం ఒకరిచ్చేది కాదు. ముఖ్యంగా ఇంటి పెద్దరికం. తండ్రినో, తాతనో మనం నిర్ణయించలేదు. మన ఉనికిని వారు నిర్ణయించారు. ఆ పెద్దరికాన్ని ఎదిరిస్తే ఏమవుతుంది? మన ఉనికికి కారణమయిన పాపానికి వారు తలొంచుతారు. నిస్సహాయంగా బాధపడతారు. కృతఘ్నతకి పరిహారం లేదు. "నువ్వెంత?" అని ముసిలి తండ్రిని ఎదిరిస్తే అతని గుండె పగులుతుంది.
 పూర్తిగా చదవండి

Tuesday, October 9, 2012

భూమి పు(శ)త్రులు

పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను ఈ తరం గుర్తించినట్టు - ఒకడుగు ముందుకు  వేసి చెపితే గుర్తించవలసి వచ్చినట్టు - మరెప్పుడూ రాలేదు. 193 దేశాలకు చెందిన 8000 మంది ప్రతినిధులు 19 రోజులపాటు - తమ తరం చేస్తున్న ఘోర తప్పిదాలను లేదా తమ తరం తప్పనిసరిగా అవలంభించక తప్పని కనీస మర్యాదలను హైదరాబాదులో జరిగే సదస్సులో చర్చించుకుంటారు. ఇది మానవుడి మనుగడకు సంబంధించిన అతి విలువయిన - అవసరమయిన, తప్పనిసరయిన - ఇంకా తెగించి చెప్పాలంటే ఇప్పటికే ఆలశ్యమయిన, చెయ్యక తప్పని పని.
పూర్తిగా చదవండి

Sunday, September 30, 2012

ఎత్తయిన ఆకాశం

మరో 48 గంటల్లో గాంధీ జయంతి. 143 సంవత్సరాల కిందట గాంధీ పుట్టిన రోజు. 64 సంవత్సరాల కిందట గాంధీ నిర్యాణం. గాంధీ తత్వాన్ని భ్రష్టు పట్టించడం ప్రారంభమయి అప్పుడే 65 సంవత్సరాలయిపోయింది.
ఈ తరంలో చాలామందికి గాంధీ చరిత్ర. కొందరికి జ్ఞాపకం. మరీ ఇటీవలి తరానికి గాంధీ ఓ సినిమా. రాజకీయ నాయకులకి గాంధీ కొంగుబంగారం. ఉద్యమకారులకి సాకు. కాని ఆయా దేశాల చరిత్రల్నే మార్చిన ఇద్దరు ఉద్యమకారులకి గాంధీ స్ఫూర్తి, ఆదర్శం, ఆకాశం.
పూర్తిగా చదవండి

Sunday, September 23, 2012

గురజాడ 'దేశం' పాట

గురజాడ పుట్టి మొన్నటికి 150 సంవత్సరాలయింది. వెళ్లిపోయి 97 సంవత్సరాలయింది. అజరామరంగా నిలిచిన 'దేశమును ప్రేమించుమన్నా' పాట ఆయన కలం నుంచి జాలువారి 102 సంవత్సరాలయింది. ఆ పాట పాఠకుల చేతుల్లోకి వచ్చి 99 సంవత్సరాలయింది. దానికి ప్రముఖ వాయులీన విద్వాంసులు ద్వారం వెంకటస్వామి నాయుడుగారు బాణీని ఏర్పరిచి 98 సంవత్సరాలయింది. ఆ తర్వాత మరో 26 నెలలకు మహాకవి కన్నుమూశారు. ఆ పాటని 1913 ఆగస్టు 9న కృష్ణాపత్రికలో ముట్నూరి కృష్ణారావుగారు ప్రచురించారు 
పూర్తిగా చదవండి

Sunday, September 16, 2012

ఈల వేసే వాళ్ళు

తెలుగులో ఈ మాట లేదు కానీ -ఇంగ్లీషులో ఓ అందమైన మాట ఉంది -ఈల వేసేవాళ్లు (విజిల్‌ బ్లోయర్స్‌). తమ చుట్టూ జరిగే వ్యవహారాల్లో అన్యాయాన్ని ధైర్యంగా బట్టబయలు చేసేవాళ్లు. దీనికి ప్రధానంగా మూడు కావాలి. మొక్కవోని నిజాయితీ. నిజాన్ని చెప్పి నిలవగల దమ్ము, రెంటినీ సాధించే చిత్తశుద్ధి. వీటిలో ఏదిలోపించినా ఈల గోల అవుతుందేతప్ప -అసలు అవినీతికీ వీరి ప్రత్యేకమైన అవినీతికీ తేడా కనిపించదు.
పూర్తిగా చదవండి

Sunday, September 9, 2012

కొప్పరపు కవులు

విదేశీయులకు నమ్మే అవకాశం ఎలాగూ లేదుకాని, స్వదేశీయుల్ని కూడా నమ్మించాల్సిన రోజులొచ్చేశాయి. ఎందుకంటే మన తెలివితేటలు ఎక్కువగా అక్కడినుంచే దిగుమతి అవుతున్నాయి కనుక. అయితే చూడాలనుకున్నవారికీ, తెలసుకోదలిచిన వారికీ ఈ వైభవం కనిపించే దాఖలాలు ఈ సంస్కృతిలో ఇంకా ఇంకా మిగిలే ఉన్నాయి. ఇంతకీ ఏమిటి ఆ వైభవం?
పూర్తిగా చదవండి

Sunday, September 2, 2012

నందో రాజా భవిష్యతి !

ఎంతమందినయినా అడిగాను ఈ లోకోక్తి వెనుక కథేమిటని. ఈ కథ నాకు బాగా నచ్చింది. ఓ రాజుగారికి ఇద్దరు భార్యలు. పెద్ద భార్యకి పెద్దకొడుకు. చిన్న భార్యకి చిన్న కొడు కు. అతని పేరు నందుడు. చిన్న భార్యమీద రాజుగారికి మోజు తీరిపోయింది. చిన్న భార్య తమ్ముడు ఏదో నేరం చేశాడు. ఉరిశిక్షని విధించింది న్యాయస్థానం.
పూర్తిగా చదవండి

Monday, August 27, 2012

కోటికొక్కడు !

వి.వి.యస్.లక్ష్మణ్ క్రికెట్ కెరీర్ కి స్వస్తి పలికాడు. అందరూ ఏదో ఒక సమయంలో ఆ పని చెయ్యాల్సిందే. కానీ నేటి నుంచీ జరగబోతున్న న్యూజిలాండ్ మాచ్ లో జట్టుకి ఎంపిక అయిన తర్వాత - తన ఆటని చాలించుకోబోతున్నానని ప్రకటించాడు. ప్రపంచ చరిత్రలో ఇది మరొక రికార్డు. మనిషి జీవితంలో తనంతట తాను 'ఇకచాలు' అనుకోవడం అతని హుందాతనానికీ, ఆత్మతృప్తికీ, సమ్యమనానికీ - వెరసి వ్యక్తి గంభీరమైన శీలానికీ తార్కాణం.
పూర్తిగా చదవండి

Monday, August 20, 2012

Vandhella kathaku vandanalu _ Karuna Kumar Rikashawala Story

మనకి స్వాతంత్య్రం వచ్చింది!

మనకి 65 ఏళ్ల కిందట స్వాతంత్య్రం వచ్చింది.
మనం గర్వపడే అభివృద్ధిని చూసుకుందాం
ఈ దేశ చరిత్రలో మొదటిసారిగా ఓ కేంద్ర మంత్రి అవినీతి ఆరోపణలకి జైలుకి వెళ్లాడు.
అతని మీద క్రిమినల్‌ చర్యని ప్రారంభించవచ్చునని సుప్రీం కోర్టు ఆదేశించింది.

Sunday, August 12, 2012

ఈ శతాబ్దపు హిమనగం

నాకు తెలిసి గత వంద సంవత్సరాలలో ముగ్గురే ముగ్గురికి తమ జీవితకాలంలోనే శతజయంతి ఉత్సవాలు జరిగాయి. ఒకరు: ప్రముఖ ఇంజనీరు, భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య, కంచి కామకోటి పీఠాధిపతి, పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతీస్వామి, మూడవ వారు సంగీత కళానిధి, పద్మభూషణ్‌, కళాప్రపూర్ణ డాక్టర్‌ శ్రీపాద పినాకపాణి.
పూర్తిగా చదవండి

Sunday, August 5, 2012

Smile Khali seesalu Story

రెండు పుస్తకాలు- రెండు ప్రపంచాలు

అనుకోకుండా రెండు వేర్వేరు కారణాలకి రెండు విచిత్రమైన, విభిన్నమైన పుస్తకాలను ఒకదాని వెంట మరొకటి చదివాను. ఒకటి: దలైలామా ఆత్మకథ (మై లైఫ్‌ అండ్‌ మై పీపుల్‌, మెమొరీస్‌ ఆఫ్‌ హిజ్‌ హోలీనెస్‌ దలైలామా). రెండోది: ఒక నేర పరిశోధకుడు హుస్సేన్‌ జైదీ రాసిన దావూద్‌ ఇబ్రహీం జీవిత కథ (డోంగ్రీ టు దుబాయ్‌).

Sunday, July 29, 2012

ఒలింపిక్స్‌:ఒకఅద్భుతం

.కొన్ని క్రీడల్ని చూస్తున్నప్పుడు -ఇంత చిన్నవయసులో -యింత సుతిమెత్తని శరీరాల్లో ఈ క్రీడాకారిణులు ప్రపంచాన్ని జయించాలనే వజ్రసంకల్పాన్నీ, జయించే ప్రతిభనీ భగవంతుడు ఎలా సిద్ధం చేశాడా అని ఆశ్చర్యం కలుగుతుంది. తొలి వింబుల్డన్‌ విజయం నాటి మేరియా షారాపోవా, అలనాటి మార్టినా హింగిస్‌, 16 ఏళ్లనాటి ఒలింపిక్స్‌ క్రీడాకారిణి కెర్రీ స్ట్రగ్‌ కొన్ని ఉదాహరణలు. సరిగ్గా 16 ఏళ్ల కిందట అప్పటి 18 ఏళ్ల అమ్మాయి కెర్రీ స్ట్రగ్‌ ప్రపంచాన్ని జయించిన అద్భుతమయిన కథని ఆ రోజుల్లోనే ఒక కాలమ్‌ రాశాను
పూర్తిగా చదవండి

Monday, July 23, 2012

Vandella Kadhaki Vandanalu _ Munimanikyam Narasimha Rao

ఒక అసాధారణుడు

హత్యలు చేసినందుకు, ఏసిడ్‌ ముఖం మీద జల్లినందుకు, ప్రజల సొమ్ము దోచుకున్నందుకు, ప్రభుత్వ ఖజానాలు కొల్లగొట్టినందుకు -అలవోకగా కీర్తి ప్రతిష్టలు పెరిగి రోజూ పత్రికలలో దర్శనమిచ్చే ప్రాచుర్యం పెరుగుతున్న ఈ రోజుల్లో 40 ఏళ్ల కిందట యివేవీ చెయ్యకుండానే మంచిమాటతో, పాటతో, చక్కని నటనతో 4 దశాబ్దాల పాటు ప్రజల మనస్సుల్లో నిలిచిన ఓ సరళమయిన సినీ నటుడి కథ ఈ మధ్యనే ముగిసింది. ఆయన రాజేష్‌ ఖన్నా..

Sunday, July 15, 2012

చరితార్ధులు

2001లో నా నవల 'సాయంకాలమైంది'కి వరంగల్లు సహృదయ సాహితీ సంస్థ 'ఒద్దిరాజు స్మారక ఉత్తమ నవలా' పురస్కారాన్ని ఇచ్చింది. ఒద్దిరాజు కవుల పేర్లు నేను అదే వినడం. ఎవరీ ఒద్దిరాజు కవులు? వారిని ఇంతగా స్మరించుకునే కృషి ఏం చేశారు? అని తెలుసుకోవడం ప్రారంభించాను. తెలిసిన విషయాలు విన్నకొద్దీ నిర్ఘాంతపోయాను. నమ్మశక్యం కాలేదు.
పూర్తిగా చదవండి

Tuesday, July 10, 2012

గతమెంతొ ఘనకీర్తి

ఈ మధ్య టీవీలో ఏదో ఛానల్‌లో ఓ సరదా అయిన కార్యక్రమాన్ని చూశాను. రామబాణం అణ్వస్త్రమా? ఆ విస్ఫోటనానికీ నిన్నకాక మొన్న (పోనీ 77 సంవత్సరాల కిందటి) విస్ఫోటనానికీ ఏమైనా పోలికలున్నాయా అంటూ ఎన్నో చిత్రాలు, రుజువులతో ఓ కార్యక్రమాన్ని ప్రసారం చేశారు. ఇదేమిటి దేశం ఇంత వెనక్కు పోతోందా అని ఆశ్చర్యపోయాను. ఇంతలో ఈ ’దైవ కణం ’ ప్రసక్తి. వివరాలు మనకి చాలా అర్థం కావు.

Monday, July 2, 2012

Hmtv - Vandella kathaku Vandanalu _ Kalpana Rentala aidho goda story _ E...

తప్పు(డు)మాట

ప్రజాస్వామ్యం పెద్ద గాడిద అన్నాడొకాయన. ఈ మాట అక్కసుతో, నిష్టూరంగా, కాస్త అన్యాయంగానూ అన్న మాటగా నాకనిపిస్తుంది. మరి ఎందుకన్నాడాయన?
ప్రజాస్వామ్యంలో ఒక సుఖం ఉంది. ఏ పనిచెయ్యడానికయినా, ఎవరికయినా హక్కు ఉంది. అర్హతలతో పనిలేదు. "అందరికీ అన్నీ తెలుసు. అదే మన అజ్నానం" అనంది మరో అన్యాయమైన శ్రీశ్రీ ఉవాచగా మనం సరిపెట్టుకోవచ్చు. నిన్న రాష్ట్ర పతి ఎన్నికల నామినేషన్ల కథని తీసుకుందాం
పూర్తిగా చదవండి

Monday, June 25, 2012

Hmtv - Vandhella kathaku vandanalu _ Indraganti Hanuma Sastry..

నిజం నిద్రపోయింది

చాలా సంవత్సరాల కిందటిమాట. ఒక ఆస్తి రిజిస్ట్రేషన్‌కి 30 లక్షలు అదనంగా స్టాంపు చార్జీలు కట్టాలి. మినహాయింపుని కోరుతూ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాను. లాయరుగారు చిరునవ్వు నవ్వుతూ రెండు మూడు సుళువులు చెప్పారు. ఈ చార్జీలు ఎంతకాలం కట్టకుండా వాయిదా వెయ్యాలి? అయిదేళ్లా? ఆరేళ్ల? సుళువులు వున్నాయి. మీ ఫైలు అయిదేళ్లు కనిపించకుండా మాయమయిపోతుంది. అసలు పూర్తిగా కట్టకుండా దాటెయ్యాలా? ఫైలు శాశ్వతంగా మాయమైపోతుంది.
పూర్తిగా చదవండి

Monday, June 18, 2012

Hmtv - vandella kathaku vandanalu _ Dasarathi Rangacharya

గిరీశం ఆవేదన

వెనకటికి ఒకాయన రేడియోలో కర్ణాటక సంగీతాన్ని వింటూ పక్కాయన్ని అడిగాడట;
''ఏమండీ, ఆ పాడేది ఎమ్మెస్‌ సుబ్బులక్ష్మే కదా?'' అని. ''తమకెందుకూ అనుమానం వచ్చింది?'' అన్నాడట పక్కాయన. ''ఏం లేదు. పాట మధ్యలో అపశ్రుతి వస్తేను'' అన్నాడట. ఎమ్మెస్‌ సుబ్బులక్ష్మి అయినంత మాత్రాన అపశ్రుతి రాకూడదన్న రూలు లేదు. తప్పటడుగు మానవమాత్రులకి సహజం. మొన్న పేపరు చదువుతూ ఒకాయన గుండె బాదుకున్నాడు
పూర్తిగా చదవండి

Sunday, June 10, 2012

మాకొద్దీ నల్లదొరతనమూ...

విమానయాన శాఖ మంత్రి అజిత్‌ సింగ్‌ గారు ఎయిర్‌ ఇండియా విమానాల్లో ప్రయాణాలు చేసేవారందరినీ పార్లమెంటు మెంబర్లుగా గౌరవించాలని యాజమాన్యానికి విన్నవించారు. ఇది చాలా అన్యాయమని నా మనవి. బెర్నార్డ్‌ షా ''ఆండ్రోక్లిస్‌ అండ్‌ లైన్‌'' నాటకంలో ననుకుంటాను. ఒకాయన పక్కవాడిని 'కుక్కా' అని తిడతాడు. వెంటనడుస్తున్న అతని కుక్క అభ్యంతరం తెలుపుతుంది. ''స్వామీ! ఇది అన్యాయం. నేనేం తప్పు చేశాను?'' అని. కుక్కకీ మనిషికీ ఉన్న తేడాని చక్కగా విశ్లేషించిన ఒకే ఒక్క రచయిత మార్క్‌ట్వేన్‌. ''ఆకలి వేస్తున్న కుక్కకి అన్నం పెడితే అది నిన్ను కరవదు. కుక్కకీ మనిషికీ ఉన్న తేడా యిదే'' అన్నాడు.

Monday, June 4, 2012

Vandella kathaku vandanalu _ pothukuchi sambasiva rao Amma katha ...

తెలుగు బురద

తెలుగు అధికార భాష అయిన రోజులివి. మన నాయకులు తెలుగుని అందలం ఎక్కిస్తున్న రోజులివి. కాకపోతే ఇందులో చిన్న తిరకాసు ఉంది. చాలామంది నాయకులకే సరైన తెలుగు రాదు. అందువల్ల వారు అప్పుడప్పుడు పప్పులో కాలు వేయడం, తప్పులో కాలు వేయడం జరుగుతూంటుంది.

Sunday, May 27, 2012

గొర్రెదాటు

చాలా సంవత్సరాల క్రితం అమెరికాలో ప్రదర్శనలకు వెళ్లినప్పుడు నా నాటిక ''దొంగగారొస్తున్నారు స్వాగతం చెప్పండి'' ప్రదర్శించాం. అందులో తాగుబోతు మేనమామ జే.వీ. సోమయాజులు లాయరు. మేనకోడలు తులసి. నెక్లెసు దొంగతనం జరిగింది. పడకగదిలోనే దొంగ పట్టుబడ్డాడు. ''తలుపు వేసియున్న కారణాన మీకు సహాయం చెయ్యాలన్న ఆతృతతో ఫలానా పెద్దమనిషి కిటికీలోంచి దూకి నీ వస్తువు మీకు ఇచ్చిపోదామని వచ్చివుండొచ్చుకదా?'' అంటాడు మత్తులో ఉన్న లాయరుగారు
పూర్తిగా చదవండి

Monday, May 21, 2012

Vandella kathaku vandanalu _ Shankaramanchi satyam

'సీత' అనే బూతు

దాదాపు 30 ఏళ్ళ కిందట 'ఆరాధన' అనే సినీమాకి మాటలు రాశాను. (మహ్మద్ రఫీ పాట పాడిన సినీమా అంటే చాలా మందికి జ్నాపకం వస్తుంది - నా మది నిన్ను పిలిచింది గానమై) ఎన్.టి.రామారావు పశువుల కాపరి. వాణిశ్రీ సంపన్నురాలయిన నర్తకి. పట్నం తీసుకు వస్తుంది అతన్ని. గోపీ మూగవాడయాడు.
పూర్తిగా చదవండి

Monday, May 14, 2012

Vandella kathaku vandanalu Peddibotla Subbaramaiah Musuru Katha

ఖరీదైన ’నిజం ’

సత్యమేవ జయతే అన్నది పాత నానుడి. సత్యం వల్ల మాత్రమే జయం లభిస్తుంది - అంటే ఈ రోజుల్లో చాలామందికి నవ్వు వస్తుంది. అయితే 'అసత్యం'తో 18 సంవత్సరాలు స్వేచ్ఛగా ఉన్న పండిత్ సుఖ్ రాం ని చూసినా, తెల్లరేషన్ కార్డులతో మద్యం వ్యాపారం చేసే బడాబాబుల కథలు చదివినా 'సత్యం' ఎంత నిస్సహాయమయిన జడపదార్ధమో అర్ధమౌతుంది. మరెందుకీ నానుడి? దీనిని 'కర్మ'అని సరిపెట్టుకున్న వేదాంతులూ, 'ఖర్మ' అని తలవంచిన వాస్తవిక వాదులూ ఎందరో ఉన్నారు.
పూర్తిగా చదవండి

Monday, May 7, 2012

Vandella Kathaku Vandanalu Malladi Ramakrishna Shastri _ Sarvamangala

అవ్యవస్థ

నిన్న ఇంగ్లీషు వార్తల ఛానల్‌లో నలుగురయిదుగురు మహిళలు -'త్వరగా విడాకులు' ఇచ్చే చట్టం గురించి చర్చిస్తున్నారు. వారందరూ స్త్రీలకు ఇంకా దక్కని స్వాతంత్య్రం గురించీ, ఆర్థిక స్తోమతు గురించీ, భర్త ఆస్తిని పంచుకునే హక్కుని గురించీ -యిలాంటివన్నీ ఆవేశంగా, అర్థవంతంగా, అనుభవపూర్వకంగా మాట్లాడుతున్నారు
పూర్తిగా చదవండి

Sunday, April 29, 2012

మృత్యువు ఒక మీమాంస

ఒక దయనీయమైన కథ. అత్యంత హృదయ విదారకమైనది. పొలాల్లో కూలి చేసుకునే భార్యాభర్తలకి ఒక్కడే కొడుకు. విమానయాన శాస్త్రంలో పట్టభద్రుడయాడు. ఆస్ట్రేలియాలో ఉద్యోగానికి సిద్ధపడుతూండగా ఆక్సిడెంటయింది.
పూర్తిగా చదవండి

Sunday, April 22, 2012

Vandella katha _ Illindala saraswati devi baliyasi kevalamishvaragna kat...

అరచేతిలో వైకుంఠం

నేను భారతీయుడినైనందుకూ అందునా ఆంధ్రుడి నయినందుకూ ఈ మధ్య మరీ గర్వంగా ఉంది. అంతా మన నాయకుల చలవ అని మరిచిపోలేకుండా ఉన్నాను. బ్రతుకు బంగారు బాటలో నడుస్తున్నందుకు గర్వంగా ఉంది.
పూర్తిగా చదవండి

Monday, April 16, 2012

సెక్సీకథ

సెక్స్ వస్తుతః జంతు ప్రవృత్తి. సంస్కారం దానికి ముసుగు. అందం సాకు. పరపతి పెట్టుబడి. వ్యభిచారం వ్యాపారం. పోలీసు దర్యాప్తు ముఖం దిగదుడుపు.
పూర్తిగా చదవండి

Sunday, April 8, 2012

చీకటి 'తెర '

ఫ్రెంచ్‌ దర్శకుడు లూక్‌ గొదార్ద్‌ సినిమా ప్రభావాన్ని గురించి చెబుతూ ఒక మాటన్నాడు. సినిమా సెకెనుకి 24సార్లు నిజాన్ని చెబుతుందట. సినిమా ప్రక్రియ తెలియని వారికి ఒక నిజం చెప్పాలి. సినిమా రీలు 24 ఫ్రేములు కదిలితే తెరమీద బొమ్మ కదులుతుంది. అదీ రహస్యం. గొదార్ద్‌ అనే నిజాయితీపరుడు రొమ్ము చరుచుకున్న మాధ్యమం ప్రభావం అంత గొప్పది
పూర్తిగా చదవండి

Monday, April 2, 2012

A Story by Munipalle Raju

'రక్షణ' నీతి సరస్వతీ నది

ఈ దేశంలో ఇంకా పూర్తిగా గబ్బు పట్టని వ్యవస్థలు రెండు ఉన్నాయి. న్యాయ వ్యవస్థ, సైనిక వ్యవస్థ. ఒకటి వ్యక్తి నైతిక జీవనాన్ని, మరొకటి వ్యక్తి స్వాతంత్య్రాన్ని కాపాడే ఆదర్శాలు. కానీ ఈ రెండింటి మీదా ప్రజల నమ్మకం క్రమంగా సన్నగిల్లే చాలా దయనీయమైన పరిణామాలు ఈ మధ్య మరీ ముమ్మరంగా కనిపిస్తున్నాయి. మొన్నటిదాకా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వున్న కె.జి.బాలకృష్ణన్‌ ఆదాయానికి మించిన ఆస్తులను కూడబెట్టిన కేసు నడుస్తోంది. ఇది న్యాయవ్యవస్థకి పట్టిన గ్రహణం. ఇక సైనిక వ్యవస్థలో అడపా తడపా పునాదుల్ని కదిపే చారిత్రక కుంభకోణాలు ఎన్నో తలెత్తుతూనే ఉన్నాయి.
పూర్తిగా చదవండి

Monday, March 26, 2012

చెవిలో తుఫాను

చాలా సంవత్సరాల తర్వాత మా మిత్రుడొకాయన నైరోబీ నుంచి వచ్చాడు. ఆ మాటా ఈ మాటా మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో మన దేశం సాధించిన గొప్ప అభివృద్ధి ఏమిటని అడిగాను.
తడువుకోకుండా 'సెల్‌ ఫోన్‌' అన్నాడు.
పూర్తిగా చదవండి

Story by Vakati Panduranga Rao

Monday, March 19, 2012

పిదప బుద్ధుల 'పెద్దక్క'

'క్షణ క్షణముల్‌ జవరాండ్ర చిత్తముల్‌' అన్నారు. జవరాండ్ర మాటేమోగానీ తృణమూల్‌ కాంగ్రెస్‌ పెద్దక్క మమతా బెనర్జీ విషయంలో ఆ మాట నిజం. మొన్నటిదాకా వారి పార్టీలో సీనియర్‌ సహచరుడు, ప్రభుత్వంలో తృణమూల్‌ ప్రతినిధి రైల్వేమంత్రి దినేష్‌ త్రివేదీ. కానీ నిన్ననే ఆయన 'ద్రోహి' అయిపోయాడు. ఆయన చేసిన ద్రోహం అల్లా పెద్దక్కని సంప్రదించకుండా బడ్జెట్‌ని తయారు చేయడం, కాంగ్రెస్‌తో కుమ్మక్కయి సామాన్య ప్రజల మీద అదనపు ఖర్చుల భారాన్ని వేయడం. అది తప్పే కావచ్చు.
పూర్తిగా చదవండి

hmtv vandella kathaku vandanalu aakupacchani gnyapakam _ 18_03_12

Tuesday, March 13, 2012

Story by Adavi Bapi Raju

తెలుగు తెగులు

ఈ దేశంలో తెలుగు మీద తెగులు 120 సంవత్సరాల క్రితమే ప్రారంభమయింది. ఆ రోజు అది సరదా. ఓ ముచ్చట, గొప్ప. ఇంకా చెప్పాలంటే అభివృద్ధి. కాకపోతే ఇప్పటికీ అదే అభివృద్ధి అని భావించేవాళ్లే ఎక్కువగావున్నారు. అందులో ఈనాడు చదువుచెప్పే పాఠశాలల ప్రిన్సిపాళ్లూ ఉన్నారు. 1890 ప్రాంతంలో రాసిన కన్యాశుల్కంలో గురజాడ అప్పారావు గారు పాత్ర చేత కూడా అనిపించారు. అగ్నిహోత్రావధాన్లు భార్య సుబ్బమ్మ గిరీశాన్ని అడుగుతుంది
పూర్తిగా చదవండి

Sunday, March 4, 2012

చట్టాలనేవి ఉన్నాయా?

టెలికాం శాఖకీ, అవినీతికీ అనాదిగా అవినాభావ సంబంధం వుంది. 1996 నుంచీ ఈ చరిత్రకి పునాదులు ఉన్నాయి. అలనాడు పండిట్‌ సుఖ్‌రాం పూజా మందిరంలో, పడక గదిలో 3.6 కోట్ల రూపాయల సొమ్ము దొరికింది. ఇవాళ ఏదో పత్రికలో చక్కని కార్టూన్‌ వచ్చింది. భర్త, భార్యతో అంటాడు, 'మన రాజా అవినీతిని చూశాక, పాపం సుఖ్‌ రాం అవినీతి బొత్తిగా ట్రాఫిక్‌లో ఎర్ర దీపాన్ని దాటినంత చిన్నదిగా కనిపిస్తోంది' అని.
పూర్తిగా చదవండి

Monday, February 27, 2012

Story by Ra.vi.Sastry

మందుభాగ్యులు

దాదాపు ముప్ఫై సంవత్సరాల కిందటిమాట. అప్పట్లో ఇప్పటి పద్మవిభూషణ్‌ ప్రతాప్‌ సి.రెడ్డి నాకు వైద్యులు. సెయింట్‌ మేరీ వీధిలో హెచ్‌.ఎం. ఆసుపత్రిని నిర్వహించేవారు. నాకు ఆ రోజుల్లో గుండె నొప్పి వస్తుందేమోనన్న భయం ఎక్కువగా ఉండేది. ప్రతి చిన్న అసౌకర్యం నాలో ఆ భయాన్ని రెచ్చగొట్టేది. ఆయన దగ్గరికి వెళ్లాను.
పూర్తిగా చదవండి

Monday, February 20, 2012

నల్లసొమ్ము

సత్యజిత్‌ రే సినిమా 'పథేర్‌ పాంచాలీ' సినిమాను తలచుకున్నప్పుడల్లా నాకు ఒళ్లు పులకరించే సంఘటన ఒకటి గుర్తుకొస్తుంది. ఆ ఇంట్లో అక్కా, తమ్ముడూ చిన్నపిల్లలు. ఒక సన్నివేశంలో అక్క పూసలదండ దొంగతనం చేసిందని స్నేహితురాలు నిందవేస్తుంది. తన బిడ్డమీద నింద పడినందుకే ఉదాసీనతతో తల్లి కూతుర్ని కొడుతుంది. తమ్ముడు నిస్సహాయంగా గమనిస్తాడు. తర్వాత అమ్మాయి చచ్చిపోతుంది. కొన్ని నెలల తర్వాత ఆ కుటుంబం వేరే చోటుకి తరలిపోతోంది
పూర్తిగా చదవండి

Kaluva Mallayya Story

Monday, February 13, 2012

Sripada Subrahmanya Sastri Gari Story

బూతు సమస్యా?పరిష్కారమా?

ఈ మధ్య అడ్డమయిన కారణాలెన్నింటికో రాజకీయనాయకుల్ని విమర్శిస్తున్నారు. దుమ్మెత్తి పోస్తున్నారు. ఇళ్ళమీద రాళ్ళేస్తున్నారు. పదవుల్లో ఉన్నవారిని మంత్రి పదవులకు రాజీనామా చేయాలని నినాదాలు చేసి గద్దెలు దించుతున్నారు. ఇది చాలా అన్యాయం. అనుచితం.
పూర్తిగా చదవండి

Monday, February 6, 2012

Gopichand Story - Dharmavaddi

49 ఓ

ప్రజాస్వామిక విధానాలలో కొన్ని సౌకర్యాలున్నాయి. అంతకు మించిన ఎన్నో అనర్థాలున్నాయి. సౌకర్యాలను మింగేసిన అనర్థాలు పెచ్చురేగితే ఏమౌతుంది? అది భారతదేశమౌతుంది.
ఏ విచక్షణా అక్కరలేకుండా కేవలం ప్రజల మద్దతు సంపాదించుకున్న ఎవరయినా 'ప్రజాప్రతినిధి' కావచ్చును. ఇది గొప్ప ఏర్పాటు. అయితే 'ఎవరయినా' అన్న ఒక్క కారణానికే, ఎంతమంది బొత్తిగా అర్హతలేని, చాలని, ఏ విధంగానూ నాయకత్వ లక్షణాలు లేని హంతకులూ, గూండాలూ, తప్పుడు కారణాలకి ప్రాచుర్యాన్ని సంపాదించిన వారూ (ఇందుకు ఉదాహరణ చెప్పాలని నా కలం ఊరిస్తోంది. టీవీ రామాయణంలో సీత, రావణుడు) మనకు నాయకులయి మన దేశాన్ని ఈ స్థితికి తీసుకు వచ్చారు
పూర్తిగా చదవండి

Sunday, January 29, 2012

ఏవీ ఈ పద్మాలు

'సాయంకాలమైంది' అనే నా నవలలో కథానాయకుడు బాగా చదువుకున్నాడు. విదేశాలకు వెళ్లే అవకాశం వచ్చింది.
'మావాడు పై దేశాలకు ఎందుకు వెళ్లాలి?' అనడిగాడు అలాంటి చదువు చదువుకోని తండ్రి.
పూర్తిగా చదవండి

జాతీయ రుగ్మత

క్రికెట్‌ క్రీడాభిమానులకు ఆనంద్నా కలిగించే ఆట -ప్రపంచంలో చాలా దేశాలలో. కా మన దేశంలో అది జబ్బు. జూదాకి ఆలంబన. వ్యాపార సాధనం. రాజకీయ లబ్ధికి పెట్టుబడి. అవీతికి అవకాశం. అజ్ఞానులకీ, అడ్డమయిన వాళ్లకీ ఫాషన్‌ సింబల్‌. వెరసి -క్రీడ తప్ప మిగతా అన్నీను.
పూర్తిగా చదవండి

Chalam Story - Suseela

Monday, January 16, 2012

తుంటి పళ్ళు

1971లో 'అండర్సన్ టేప్స్' అనే హాలీవుడ్ చిత్రం వచ్చింది. జేంస్ బాండ్గా నటించిన షాన్ కోనరీ దొంగ. ఒక అపార్టుమెంటునంతా దోచుకోడానికి పన్నాగం చేస్తాడు. కొన్ని నెలలపాటు దొంగతనానికి ఏర్పాట్లు చేస్తాడు. అతను చేసే ప్రతీపనీ - గవర్నమెటులో ఏదో విభాగాంకి తెలుస్తోంది. కారణం - అతను సంప్రదించిన అన్నిసంస్థల, వ్యక్తుల టెలిఫోన్లను ఆయా విభాగాల డిపార్టుమెంటుల నిఘా ఉంది కనుక. అయితే అన్ని వి భాగాల సమాచారాన్ని కలిపే ఆస్కారం లేదు. ఏర్పాటు లేదు. కనుక దొంగతనం గవర్నమెంటుకి తెలియలేదు. నెలల తర్వాత పధకం ప్రకారం దొంగతనం ప్రారంభమయింది. మరో అరగంటలో తప్పించుకుంటాడనగా - ప్రభుత్వం మేలుకుంది. దొంగని పట్టుకుంది. అదీ కధ.
పూర్తిగా చదవండి

hmtv vandella kathaku vandanalu _ a.n.jagannatha sharma _ pegu kaalina v...

hmtv vandella kathaku vandanalu _ a.n.jagannatha sharma _ pegu kaalina v...

Tuesday, January 10, 2012

Ravuri Bharadwaja

తోడికోడలు నవ్వింది

నా చిన్నతనంలో - నిజానికి 20 సంవత్సరాల కిందటివరకూ - ఆడవాళ్ళు చుడీదార్ డ్రస్సులు వేసుకోవడం తెలీదు. అందరూ పరికిణీ, ఓణీలతో లక్షణంగా తెలుగుదనంతో కనిపించేవారు. అలాంటి డ్రస్సులు ప్రస్థుతం మాయమయిపోతున్నాయి. నేటి తరం సినీమాల్లో హీరోయిన్ల ఒంటి మీద బట్టలు వెద్దుక్కోవలసిన పరిస్థితి.
పూర్తిగా చదవండి

Sunday, January 1, 2012

సైబీరియన్‌ గీత

మహాభారతంలో అర్జునుడు దౌర్జన్యకారుడు. కౌరవ సైన్యాన్ని తుదముట్టించడమే అతని లక్ష్యం. కాకపోతే కురుక్షేత్రంలో సైన్యాల మధ్య నిలబడగానే గుండెవణికింది. కాళ్లు తడబడ్డాయి. తన అన్నదమ్ముల్నీ, బంధువర్గాన్నీ చంపాలా అని వాపోయాడు. శ్రీకృష్ణుడనే ఓ జిత్తులమారి -రకరకాల సిద్ధాంతాల్ని ఉటంకించి, పూర్తిగా గందరగోళం చేసి, చంపడమే పరమ కర్తవ్యమని నూరిపోశాడు. కృష్ణుడి విషం తలకెక్కింది. మరో ఆలోచన లేకుండా -తన పర అని చూడకుండా వేలాదిమందిని చంపాడు అర్జునుడు
పూర్తిగా చదవండి